Bigg Boss Telugu 9 : బిస్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టనున్న ఆరుగురు కామన్ మ్యాన్స్.. లిస్ట్ ఇదే?
బిస్‌బాస్ హౌస్‌లో (Bigg Boss Telugu 9) అడుగుపెట్టనున్న కామన్ మ్యాన్స్ లిస్ట్ ఇదేనంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Bigg Boss Telugu 9 common man list viral on social media
Bigg Boss Telugu 9 : రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బిగ్‌బాస్ రియాలిటీ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బిగ్‌బాస్ తెలుగు ఇప్పటికే విజయవంతంగా 8 సీజన్లు పూర్తి చేసుకుంది. తాజాగా తొమ్మిదో సీజన్(Bigg Boss Telugu 9)కు సిద్ధమైంది. ఈ ఆదివారం (సెప్టెంబర్ 7) నుంచి తొమ్మిదో సీజన్ ప్రారంభం కానుంది. ఈ సారి కూడా హోస్ట్‌గా నాగార్జుననే వ్యవహరించనున్నాడు.
ఈ సీజన్‌లో సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా కంటెస్టెంట్స్‌గా రానున్నారు. అగ్ని పరీక్ష అనే షో ద్వారా కామన్ మాన్స్‌ను ఎంపిక చేయనున్నారు అన్న సంగతి తెలిసిందే. మొదటగా.. 45 మంది నుంచి 15 మందిని ఎంపిక చేశారు. ఈ 15 మంది చేత వివిధ టాస్క్‌లు ఆడించారు. ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్స్‌లలో ఇద్దరు ఎలిమినేట్ కాగా.. ప్రస్తుతం 13 మంది ఉన్నారు.
Madharaasi Twitter Review : శివకార్తికేయన్ ‘మదరాసి’ ట్విటర్ రివ్యూ..
కాగా.. అగ్నిపరీక్ష షో ఆరంభంలో వీరిలో ఐదుగురు తొమ్మిదో సీజన్‌లో అడుగుపెడతారు అని చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆరుగురు వెళ్లనున్నారట. ఇప్పటికే వారి ఎంపిక పూరైందని తెలుస్తోంది. దమ్ము శ్రీజ, మాస్క్ మ్యాన్ హరీశ్, మర్యాద మనీశ్, ఆర్మీ పవన్ కల్యాణ్, ప్రియాశెట్టి, హీమ్యాన్ పవన్‌లు హౌస్‌లో అడుగుపెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇక బిగ్‌బాస్‌లో అడుగుపెట్టే సెలబ్రిటీలు వీరేంటూ ఓ సోషల్ మీడియాలో ఓ లిస్ట్ వైరల్ అవుతోంది. ఆ లిస్ట్‌లో రీతూ చౌదరి, ఇమ్మానియేల్, రాము రాథోడ్, తనూజా గౌడ, ఆశా షైనీ, భరణి శంకర్, సుమన్ శెట్టి, శ్రష్టి వర్మ, సంజనా గార్లా వంటి వారు ఉన్నారు.
వీరిలో ఎవరెవరు బిస్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టారో? లేదో తెలియాలంటే ఆదివారం వరకు వెయిట్ చేయకతప్పదు.