రేపే మెగా జాబ్ మేళా.. టాప్ కంపెనీలు, 560 ఉద్యోగాలు.. అస్సలు మిస్ అవకండి

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. శ్రీకాకుళం జిల్లా రాజాంలోని శ్రీ సాయి డిగ్రీ కళాశాలలో సెప్టెంబర్ 6వ తేదీ మెగా జాబ్ మేళా(Mega Job Mela) జరుగనుంది.

రేపే మెగా జాబ్ మేళా.. టాప్ కంపెనీలు, 560 ఉద్యోగాలు.. అస్సలు మిస్ అవకండి

Mega job Mela to be held in Srikakulam district tomorrow

Updated On : September 5, 2025 / 10:09 AM IST

Mega Job Mela: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. శ్రీకాకుళం జిల్లా రాజాంలోని శ్రీ సాయి డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా జరుగనుంది. సెప్టెంబర్ 6వ తేదీ ఉదయం 9 గంటలకు మొదలుకానున్న ఈ మెగా జాబ్‌ మేళాలో ప్రముఖ ప్రైవేట్ కంపెనీలు పాల్గొననున్నాయి. మొత్తం 560 ఉద్యోగాలను ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ చేయనున్నారు. కాబట్టి, ఆసక్తి ఉన్న అభ్యర్థులు తప్పకుండా ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. ఈ జాబ్ మేళా(Mega Job Mela) గురించి మరిన్ని వివరాల కోసం 8317652552 నంబర్‌ను సంప్రదించవచ్చు.

Police Recruitment Board: తెలంగాణలో పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ పోస్టులు.. నెలకు రూ.1.33 లక్షల జీతం.. అర్హత, దరఖాస్తు వివరాలు

ఉద్యోగం, ఖాళీల వివరాలు:

ఆర్విక్స్ PVT LTD: ప్రొడక్షన్ కెమిస్టు పోస్టులు 30 ఉన్నాయి. దీనికి B.Sc కెమిస్ట్రీ చదివి 18 నుంచి 25 ఏళ్ళ వయసున్న వారు అర్హులు. వీరికి నెలకు రూ.17,000 జీతం ఇస్తారు.

అల్ హాండ్స్ గ్లోబల్ PVT LTD: కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ (వాయిస్ ప్రాసెస్) పోస్టులు 20 ఉన్నాయి. దీనికి ఇంటర్, ఆపై చదివి 20 నుంచి 30 ఏళ్ళ మధ్య వయసున్నవారు అర్హులు. వీరికి నెలకు రూ.15,000 జీతం ఇస్తారు.

యాక్సిస్ బ్యాంకు: బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 40 ఉన్నాయి. దీనికి ఇంటర్, ఆపై చదివి 18 నుంచి 35 ఏళ్ళ మధ్య వయసున్నవాడు అర్హులు. వీరికి నెలకు రూ.15,000 జీతం ఇస్తారు.

హెటేరో: Q/A Q/C, ప్రొడక్షన్, ఇంజినీరింగ్, అసిస్టెంట్ పోస్టులు 100 ఉన్నాయి. దీనికి MSc/BSc కెమిస్ట్రీ, ITI, డిప్లొమా చేసి 18 నుంచి 26 ఏళ్ళ మధ్య ఉన్నవారు అర్హులు. వీరికి నెలకు రూ.21,000 జీతం ఇస్తారు.

లాట్ మొబైల్స్: బ్రాంచ్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు 25 ఉన్నాయి. దీనికి ఇంటర్, ఆపై చదివి19 నుంచి 30 ఏళ్ళ మధ్య ఉన్నవారు అర్హులు. వీరికి నెలకు రూ.15,000 నుంచి రూ.20,000 జీతం ఇస్తారు.

MRF: అసెంబ్లీ ఆపరేటర్లు పోస్టులు 40 ఉన్నాయి. దీనికి SSC, ఇంటర్, ITI, డిప్లొమా పూర్తి చేసి 18 నుంచి 30 ఏళ్ళ మధ్య ఉన్నవారు అర్హులు: వీరికి నెలకు రూ.15,000 జీతం ఇస్తారు.

నేతంబిట్ (GOOGLE PAY): సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 25 ఉన్నాయి. దీనికి SSC, ఇంటర్ పూర్తి చేసి 18 నుంచి 35 ఏళ్ళ మధ్య ఉన్నవారు అర్హులు. వీరికి నెలకు రూ.18,000 జీతం ఇస్తారు.

SCHNIDER: అసెంబ్లీ ఆపరేటర్లు పోస్టులు 50 ఉన్నాయి. దీనికి SSC, ఇంటర్, ITI, డిప్లొమా పూర్తి చేసి 18 నుంచి 25 ఏళ్ళ మధ్య ఉన్నవారు అర్హులు. వీరికి నెలకు రూ.13,500 జీతం ఇస్తారు.

టాటా ఎలక్ట్రానిక్స్: జూనియర్ టెక్నీషియన్ పోస్టులు 100 ఉన్నాయి. దీనికి ఇంటర్, ITI చదివి 18 నుంచి 27 మధ్య వయసున్నవారు అర్హులు. వీరికి నెలకు రూ.14,279 జీతం ఇస్తారు.

టీం లీజ్ ఎస్బీఐ కార్డ్స్: రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 50 ఉన్నాయి. దీనికి ఇంటర్, ఆపై చదివి 18 నుంచి 35 ఏళ్ళ మధ్య ఉన్నవారు అర్హులు. వీరికి నెలకు రూ.15,000 నుంచి రూ.18,000 జీతం ఇస్తారు.

యోకోహోమా టైర్స్: అప్రెంటిస్ ట్రైనీ పోస్టులు 50 ఉన్నాయి. దీనికి ఇంటర్, ITI, డిప్లొమా పూర్తి చేసి 18 నుంచి 24 ఏళ్ళ మధ్య ఉన్నవారు అర్హులు. వీరికి నెలకు రూ.14,000 జీతం ఇస్తారు.
యూత్ ఫర్ జాబ్స్ (వికలాంగులకు మాత్రమే): డేటా ఎంట్రీ ఆపరేటర్లు (శారీరక వైకల్యం/బధిరులు) పోస్టులు 30 ఉన్నాయి. దీనికి ఇంటర్, ఆపై చదివి 18 నుంచి 30 ఏళ్ళ మధ్య ఉన్నవారు అర్హులు. వీరికి నెలకు రూ.10,000 నుంచి రూ.15,000 జీతం ఇస్తారు.