Police Recruitment Board: తెలంగాణలో పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ పోస్టులు.. నెలకు రూ.1.33 లక్షల జీతం.. అర్హత, దరఖాస్తు వివరాలు
అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ పోస్టులకు(Police Recruitment Board) నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు.

Police Recruitment Board: Notification released for the posts of Telangana Assistant Public Prosecutors
Police Recruitment Board: తెలంగాణలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(టీఎస్ఎల్‌పీఆర్‌బీ) మెుత్తం 118 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. దీనికి(Police Recruitment Board) సంబందించిన దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 12 నుంచి మొదలుకానుంది. ఈ ప్రక్రియ అక్టోబర్ 5వ తేదీ వరకు కొనసాగనుంది. కాబట్టి.. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ www.tgprb.in నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు సూచించారు.
ఇక ఈ పోస్టులకు అప్లై చేసుకునేవారు తప్పకుండా తెలంగాణ క్రిమినల్ కోర్టుల్లో మూడేళ్లకు పైగా ప్రాక్టీస్ చేసి ఉండాలని, లిగల్ అడ్వైజరీలు, లీగల్ కౌన్సిలర్లు, లా ఆఫీసర్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అంతేకాదు, దరఖాస్తు చేసుకునే ముందు నోటిఫికేషన్ ను పూర్తిగా చదవాలని సూచించారు.
APPSC: APPSC ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అభ్యర్థులకు గమనిక.. పరీక్షల్లో ఈ పనులు అస్సలు చేయొద్దు
విద్యార్హతలు:
- తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఏదైనా బ్యాచిలర్
- డిగ్రీతోపాటుగా ఎల్ఎల్‌బీ/బీఎల్ పూర్తి చేసి ఉండాలి.
- తెలంగాణ క్రిమినల్ కోర్టుల్లో కనీసం ప్రాక్టీసింగ్ అడ్వకేట్‌గా ఉండాలి.
- అభ్యర్థులు తప్పకుండా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది.
వయోపతిమితి:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 2025 జూలై 1 నాటికి 34 సంవత్సరాల వయస్సు మించకూడదు.
ఎంపిక విధానం:
రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
వేతన వివరాలు:
ఈ ఉద్యోగాలను ఎంపికైన వారికి నెలకు నెలకు రూ.54,220 నుంచి 1,33,630 వరకు ఉంటుంది.
దరఖాస్తు రుసుము:
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.1000, ఇతరులు రూ.2000 చెల్లించాల్సి ఉంటుంది.