APPSC: APPSC ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అభ్యర్థులకు గమనిక.. పరీక్షల్లో ఈ పనులు అస్సలు చేయొద్దు
ఏపీపీఎస్సి ఇటీవల ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు(APPSC), ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు పోస్టుల నోటిఫికేషన్ విడుదల చేశారు.

APPSC Forest Beat Officer Exam to be held on September 7
APPSC: ఏపీపీఎస్సి ఇటీవల ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దరఖాస్తు ప్రక్రియ కూడా ఇప్పటికే మొదలయ్యింది. అయితే దీనికి సంబందించిన పరీక్షల గురించి(APPSC) అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యలో తాజాగా ఎపీపీఎస్సీ కార్యదర్శి రాజాబాబు కీలక ప్రకటన చేశారు. సెప్టెంబర్ 7వ తేదీన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ల పరీక్షా నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. అలాగే పరీక్ష నిబంధనల గురించి అభ్యర్థులకు సూచనలు చేశారు.
ECIL: ఐటీఐ పూర్తి చేశారా.. ఈసీఐఎల్ లో 412 పోస్టులకు నోటిఫికేషన్.. అర్హత, దరఖాస్తు, పూర్తి వివరాలు
APPSC ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పరీక్ష ముఖ్యమైన సూచనలు:
- అభ్యర్థులకు ఆఫ్ లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు
- ఏబీసీడీ సీరీస్ లలో అభ్యర్థులు ఎంపిక చేసిన ప్రశ్నాపత్రం ఇస్తారు.
- అభ్యర్థులు ఎలాంటి తప్పులు లేకుండా ఒఎమ్ ఆర్ షీట్ల నింపాలి
- ఒకేవేళ తప్పులు చేస్తే ఒఎమ్ఆర్ షీట్ ఇన్వాలిడ్ అవుతుంది.
- ఒఎమ్ఆర్ షీట్ పై ఎలాంటి దిద్దులు, కొట్టివేతలు కనిపించకూడదు
- ఒకవేళ కనిపిస్తే ట్యాంపరింగ్ అయినట్లు భావిస్తారు
- ఈ పరీక్ష లో కూడా నెగెటివ్ మార్కులు ఉంటాయి.
ఇక గ్రూప్ 1 గురించి ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం స్పోర్ట్స్ కోటా దృవపత్రాల వెరిఫికేషన్ జరుగుతోందని, త్వరలోనే గ్రూప్ 1, గ్రూప్ 2 ఫలితాలు వెల్లడిస్తామని ప్రకటించారు. ఇప్పటికే 1600 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చామని, పారదర్శకంగా వాల్యువేషన్ చేసి తుది ఫలితాలు ప్రకటిస్తామని అన్నారు.