పాకిస్థాన్‌కి బిగ్ షాక్ ఇచ్చిన చైనా? ఏం జరుగుతోంది?

పాకిస్థాన్ ఇప్పటికే చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోతోంది. చైనా ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడులకు సంబంధించిన రీపేమెంట్స్ విషయంలో పాకిస్థాన్ వైఖరి సరిగా లేదు.

పాకిస్థాన్‌కి బిగ్ షాక్ ఇచ్చిన చైనా? ఏం జరుగుతోంది?

China

Updated On : September 5, 2025 / 11:04 AM IST

China: పాకిస్థాన్ కు చైనా బిగ్ షాక్ ఇచ్చింది. ఆ దేశంలో చేపట్టాలని భావించిన అతి పెద్ద ప్రాజెక్టు నుంచి చైనా తప్పుకొంది. దీంతో పాకిస్థాన్ ఇప్పుడు సంకటంలో పడింది.

చైనా – పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ లో భాగంగా పాక్ లో పెట్టుబడులు పెట్టాలని చైనా భావించింది. కొంత పెట్టుబడులు పెట్టింది. అందులో కరాచీ నుంచి పెషావర్ వరకు ఉన్న మార్గం అత్యంత ముఖ్యమైంది. ఈ రూట్ లో సుమారు 1800 కిలోమీటర్ల మేర ఇన్ ఫ్రా డెవలప్ చేయాలని చైనా భావించింది. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్టు నుంచి డ్రాగన్ కంట్రీ తప్పుకొంది.

పాక్ లో సుమారు 60 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టిన చైనా ఈ విషయంలో మాత్రం వెనక్కి తగ్గింది. అతిపెద్ద ప్రాజెక్టు అంశంలో డ్రాగన్ కంట్రీ విత్ డ్రా కావడం సంచలనంగా మారింది. (China)

చైనా ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకోవడం వెనుక పూర్తిగా ఆర్థిక అంశాలే కారణమని తెలుస్తోంది. పాకిస్థాన్ లో పెట్టుబడులు పెట్టినా ఆ మేరకు రిటర్న్స్ రావనే ఉద్దేశంతోనే చైనా విత్ డ్రా అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులో ఫండ్స్ తీసుకుని తమ దేశాన్ని అభివృద్ధి చేసుకోవడానికి పాక్ ప్రయత్నించినా.. అది ఇప్పుడు వర్కవుట్ కాలేదు.

Also Read: హైదరాబాద్‌లో నిమజ్జనం రూట్ మ్యాప్ ఇదే.. ఇవాళ, రేపు ఈ రూట్లలో అస్సలు వెళ్లకండి..

ఇప్పుడు మళ్లీ అప్పుల వేట మొదలెట్టింది. ఆసియా డెవలప్ మెంట్ బ్యాంక్ నుంచి 2 బిలియన్ డాలర్ల రుణ సాయాన్ని అర్థించింది. కరాచీ – రోహ్రీ స్టేషన్ల మధ్య రైల్వే నెట్ వర్క్ డెవలప్ కోసం పాక్ ఏడీబీ నుంచి సాయం కోరుతోంది.

చైనా విత్ డ్రా కావడం వెనుక మరో కారణం కూడా ఉంది. చైనా ఆశించి రేంజ్ లో పాక్ లో డెవలప్మెంట్ జరగడం లేదు. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకు దిగజారిపోతుంది. పతనం అంచులకు చేరుకుంటోంది. ఇప్పటికే చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోతోంది.

ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేస్తోంది. ముఖ్యంగా చైనా ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడులకు సంబంధించిన రీపేమెంట్స్ విషయంలో పాకిస్థాన్ వైఖరి సరిగా లేదు. రీపేమెంట్స్ చేయలేకపోవడంతో.. మునిగిపోయే పడవలో పెట్టుబడులు పెట్టడం ఇష్టం లేక చైనా విత్ డ్రా అయినట్టు కనిపిస్తోంది.

అమెరికా టారిఫ్ ల తర్వాత స్వదేశంలో పెట్టుబడులు, ఇన్ ఫ్రా డెవలప్ మెంట్ మీద చైనా ఎక్కువ ఫోకస్ చేసింది. ముందు చైనాలో చూసుకుని ఆ తర్వాత ఇతర దేశాల్లో డెవలప్ మెంట్ పెట్టుబడుల గురించి ఆలోచించవచ్చనే ఉద్దేశంతో ఉన్నట్టు కనిపిస్తోంది.

గోల్డ్ మైన్ కి దెబ్బ..?

పాక్ లోని బలోచిస్తాన్ లో గోల్డ్ మైన్ ని గుర్తించారు. దీంట్లో కెనడియన్ కంపెనీ పెట్టుబడులు పెట్టి దాన్ని వెలికితీసేందుకు ప్రయత్నిస్తుంది. ఆ వెలికితీసిన మట్టిని పోర్టులకు తరలించడానికి సరైన రవాణా వ్యవస్థ లేదు.

చైనా పెట్టుబడులు పెడితే దాని వల్ల లాభం పొందుదామనుకున్న పాక్ కి ఇప్పుడు గోల్డ్ మైన్ విషయంలో కూడా మరో దెబ్బ తగిలే అవకాశం ఉంది. సరైన రవాణా వ్యవస్థ, సదుపాయాలు లేకపోతే గోల్డ్ మైన్ తవ్వకం, వెలికితీత, దాన్ని చేరవేయడం వంటివి చాలా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.