హైదరాబాద్‌లో నిమజ్జనం రూట్ మ్యాప్ ఇదే.. ఇవాళ, రేపు ఈ రూట్లలో అస్సలు వెళ్లకండి..
పార్కింగ్ ప్రదేశాలు: ఎన్టీఆర్ స్టేడియం, కట్టమైసమ్మ టెంపుల్, పబ్లిక్ గార్డెన్స్, బుద్ధభవన్ వెనుక, ఆదర్శనగర్, బీఆర్‌కే భవన్, ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్

Hyderabad Ganesh Immersion 2025
Hyderabad Ganesh Immersion 2025: హైదరాబాద్‌లో గణేశుడి విగ్రహాల నిమజ్జనాలకు సర్వం సిద్ధమైంది. శనివారం నిమజ్జనాలకు పోలీసులు రూట్ మ్యాప్ ఇచ్చారు. ఇవాళ, రేపు వాహనదారులు పలు రూట్లలో వెళ్లకూడదు. సెప్టెంబర్ 6 ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 7 ఉదయం 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి.
నిమజ్జనం రూట్ మ్యాప్ ఇదే..
బాలాపూర్ నుంచి చార్మినార్–అబిడ్స్–లిబర్టీ–ట్యాంక్‌బండ్–నెక్లెస్ రోడ్ ప్రధాన శోభాయాత్ర
సికింద్రాబాద్ నుంచి పాట్నీ–ప్యారడైజ్–రాణిగంజ్–కర్బలామైదాన్–ట్యాంక్‌బండ్ మార్గం
దిల్‌సుఖ్‌నగర్, అంబర్‌పేట్, నారాయణగూడ, ఉప్పల్ నుంచి ప్రాసెషన్లు లిబర్టీ వద్ద కలుస్తాయి
టోలిచౌకీ, మెహిదీపట్నం నుంచి వచ్చిన విగ్రహాలు ఖైరతాబాద్ మీదుగా నెక్లెస్ రోడ్ చేరతాయి
తపాచబుత్రా, ఆసిఫ్‌నగర్ నుంచి వచ్చిన విగ్రహాలు ఎంజే మార్కెట్‌లో కలుస్తాయి
ప్రధాన రూట్లపై ఇతర వాహనాలకు అనుమతి లేదు
సౌత్‌ఈస్ట్ జోన్ డైవర్షన్ పాయింట్లు: కేశవగిరి, చాంద్రాయణగుట్ట, మూసారాంబాగ్, చంచల్‌గూడ
సౌత్ జోన్: అలియాబాద్, మదీనా, నయాపూల్, ఎంజే మార్కెట్, దరుష్షిఫా
ఈస్ట్ జోన్: శివాజీ బ్రిడ్జ్, పుత్లిబౌలి, హిమాయత్‌నగర్, వైఎంసీఏ
సెంట్రల్ జోన్: లిబర్టీ, అబిడ్స్, ఖైరతాబాద్, ట్యాంక్‌బండ్, బుద్ధభవన్
నార్త్ జోన్: పాట్నీ, ప్యారడైజ్, రాణిగంజ్
పార్కింగ్ ప్రదేశాలు: ఎన్టీఆర్ స్టేడియం, కట్టమైసమ్మ టెంపుల్, పబ్లిక్ గార్డెన్స్, బుద్ధభవన్ వెనుక, ఆదర్శనగర్, బీఆర్‌కే భవన్, ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్ (Hyderabad Ganesh Immersion 2025)
ఇంకా..
- నిమజ్జనం అనంతరం లారీలు నగరంలోకి రాకుండా ఔటర్ రింగ్ రోడ్ మీదుగా మాత్రమే అనుమతి
- సెప్టెంబర్ 6 ఉదయం 8 నుంచి సెప్టెంబర్ 7 రాత్రి 11 వరకు నగరంలోకి లారీలకు ప్రవేశం లేదు
- ఆర్టీసీ బస్సులు పీక్ సమయంలో మెహిదీపట్నం, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్, నారాయణగూడ వరకు మాత్రమే
- అంతర్ రాష్ట్ర, జిల్లా బస్సులు – చాదర్‌ఘాట్ వైపు మాత్రమే దారి మళ్లింపు
దాటకూడని జంక్షన్లు: ఎంజే మార్కెట్, ఖైరతాబాద్, అబిడ్స్, లిబర్టీ, రాణిగంజ్, తెలుగు తల్లి చౌరస్తా, ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా
విమానాశ్రయం వెళ్ళేవారు పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే లేదా ఔటర్ రింగ్ రోడ్ మాత్రమే వాడాలి
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్లేవారు బేగంపేట్–పరడైజ్ రూట్ వాడాలి
నిమజ్జనం కోసం 10 బేబీ పాండ్లు, 8 పోర్టబుల్ వాటర్ ట్యాంకులు, 8 ఎక్స్కవేషన్ పాండ్లు ఏర్పాటు
హెల్ప్‌లైన్ నంబర్లు: 040-27852482, 8712660600, 9010203626
నోటిఫికేషన్ అమలు: సెప్టెంబర్ 6 ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 8 ఉదయం 6 గంటల వరకు