బతుకమ్మ వేడుకలు.. టార్గెట్ గిన్నిస్ బుక్.. హైదరాబాద్‌లో ఎన్ని లక్షల మందితో అంటే? ఇక ఓనం రికార్డును..
సెప్టెంబరు 27న సాయంత్రం ట్యాంక్‌బండ్ వద్ద బతుకమ్మ కార్నివాల్ ఉంటుంది.

Bathukamma Celebrations 2025
Bathukamma Celebrations 2025: బతుకమ్మ ఉత్సవాలకు తెలంగాణ సిద్ధమవుతోంది. సెప్టెంబరు 21 నుంచి బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.
అలాగే, సెప్టెంబరు 27న వరల్డ్ టూరిజం డే ఉంది. ఆ రోజున హైదరాబాద్ మాదాపూర్‌లోని శిల్ప కళా వేదికలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. (Bathukamma Celebrations 2025)
ఆ మరుసటి రోజు (28న) ఎల్బీ స్టేడియంలో గిన్నిస్ వరల్డ్ రికార్డు కార్యక్రమం ఉంటుంది. 11 లక్షల మందితో బతుకమ్మ సెలబ్రేషన్స్ ఉండనున్నాయి. స్వయం సహాయక బృందాల మహిళలతో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తారు.
ఇందుకోసం జీహెచ్ఎంసీ అర్బన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ విభాగం ఏర్పాట్లు ప్రారంభించింది. జీహెచ్ఎంసీకి 11 లక్షల బతుకమ్మ చీరలను కేటాయించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ఇందుకోసం ఇన్‌చార్జీలను నియమించనుంది.
కేరళలో సామూహికంగా ఓనం పండుగను జరుపుకుంటారు. ఓనం రికార్డును బ్రేక్ చేసేలా బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది.
కార్యక్రమాలు ఇలా..
- సెప్టెంబరు 27న సాయంత్రం ట్యాంక్‌బండ్ వద్ద బతుకమ్మ కార్నివాల్
- సెప్టెంబరు 28న ఎల్బీ స్టేడియంలో గిన్నిస్ వరల్డ్ రికార్డు కార్యక్రమం
- సెప్టెంబరు 29న పీపుల్స్ ప్లాజా వద్ద ఉత్తమ బతుకమ్మ పోటీ
- సెప్టెంబరు 29న ఐటీ ఎంప్లాయీల రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల పోటీ
- సెప్టెంబరు 30న ట్యాంక్‌బండ్ వద్ద గ్రాండ్ పూల పండగ