విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. దసరా సెలవుల డేట్స్‌ వచ్చేశాయ్‌.. స్కూళ్లకు, జూనియర్ కాలేజీలకు వేర్వేరుగా..

అక్టోబర్‌ 4న స్కూళ్లు మళ్లీ ప్రారంభమవుతాయి. ఈ షెడ్యూల్​ను అకడమిక్ క్యాలెండర్​లో అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే.

విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. దసరా సెలవుల డేట్స్‌ వచ్చేశాయ్‌.. స్కూళ్లకు, జూనియర్ కాలేజీలకు వేర్వేరుగా..

Dasara Holidays

Updated On : September 5, 2025 / 7:48 AM IST

Dasara Holidays: తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఈ సారి దసరా సెలవులు 13 రోజులు ఉండనున్నాయి. పాఠశాల విద్యాశాఖ అన్ని పాఠశాలలకు సెప్టెంబర్‌ 21 నుంచి అక్టోబర్‌ 3 వరకు పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించింది.

అక్టోబర్‌ 4న స్కూళ్లు మళ్లీ ప్రారంభమవుతాయి. ఈ షెడ్యూల్​ను అకడమిక్ క్యాలెండర్​లో అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. సెలవులకు ముందు పాఠశాలలు ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎఫ్‌ఏ) – 2 పరీక్షలు పూర్తి చేయాలి. (Dasara Holidays)

Also Read: White Spots: చర్మంపై తెల్ల మచ్చలు ఎందుకు వస్తాయి.. ఏదైనా ప్రమాదానికి సంకేతమా?

సెలవుల అనంతరం విద్యార్థులు అక్టోబర్‌ 24 నుంచి 31 వరకు సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎస్‌ఏ) – 1 పరీక్షలు రాయాల్సి ఉంటుంది. పరీక్షా పత్రాల మూల్యాంకనం అనంతరం ఎస్‌ఏ – 1 ఫలితాలు నవంబర్‌ 6న ప్రకటిస్తారు.

ఎస్‌ఏ – 1 పూర్తైన తర్వాత నవంబర్‌ నెలలో బోధన తప్పించి పరీక్షలు ఉండవు. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్​ జూనియర్ కాలేజీలకు సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 5 వరకు దసరా సెలవులు ఉండనున్నాయి.