White Spots: చర్మంపై తెల్ల మచ్చలు ఎందుకు వస్తాయి.. ఏదైనా ప్రమాదానికి సంకేతమా?
చర్మంపై తెల్ల మచ్చలు, వైట్ పాచ్‌లు (White Spots) రావడం సహజమే. ఈమధ్య కాలంలో చాలా మందిలో ఈ సమస్య కనిపిస్థునే ఉంది.

What are the main causes of white spots on the skin?
White Spots: చర్మంపై తెల్ల మచ్చలు, వైట్ పాచ్‌లు (White Spots) రావడం సహజమే. ఈమధ్య కాలంలో చాలా మందిలో ఈ సమస్య కనిపిస్థునే ఉంది. చర్మపు భాగంలో మెలనిన్ (Melanin) అనే రంగు పదార్థం తగ్గిన లేదా పూర్తిగా లేని కారణంగా వస్తాయి. అయితే, ఇలాంటి మంచ్చలు కనబడగానే చాలా మంది భయపడుతూ ఉంటారు. ఇలాంటి సమస్య ఎందుకు వస్తుంది? ఏదైనా ప్రమాదకరమైన సమస్యకు సంకేతమా? అనేది చాలా మందిలో ఉండే సందేహం. మరి దానికి సంబందించిన విషయం గురించి వివరంగా తెలుసుకుందాం.
Pumpkin Juice: గుమ్మడి కాయ జ్యూస్ తో గుండె భద్రం.. షుగర్ మాయం.. ఎలాంటి రోగాలు రావు
ప్రధాన కారణాలు:
1.విటిలిగో: చర్మంపై తెల్ల మచ్చలు రావడం అనేది ఒక ఆటోఇమ్యూన్ రోగం. ఇది శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ మెలనోసైట్స్ దాడి చేస్తుంది. దీనివల్ల చర్మంపై తెల్ల మచ్చలు ఏర్పడతాయి. ఇది ముఖం, చేతులు, పెదవులు, కాళ్ళు మొదలైన చోట్ల ఏర్పడుతుంది. ఇది స్వయంగానే పెరుగుతూ విస్తరిస్తూ పోయే అవకాశం ఉంది.
2.టినియా వర్సికలర్: ఇది ఒక ఫంగస్ వల్ల కలిగే చర్మ సమస్య. దీనివల్ల చిన్న చిన్న తెల్లటి లేదా బూడిద రంగు మచ్చలు. ఇది అంటువ్యాధి కాదు కానీ వ్యాధి నిరోధక శక్తి తగ్గినపుడు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది సాధారణంగా మందులతో తగ్గుతుంది.
3.పోషకాహార లోపాలు: ముఖ్యంగా విటమిన్ B12, కాల్షియం, విటమిన్ D, ఫోలిక్ యాసిడ్ లోపాలు ఈ సమస్య రావచ్చు. చర్మంపై రంగు కోల్పోయే భాగాలు ఏర్పడతాయి, లేత తెల్ల మచ్చలుగా కనిపించవచ్చు. ఇది పెద్ద సమస్య కాదు. ఆహారపు జాగ్రత్తలతో తగ్గించుకోవచ్చు.
4.లెప్రసీ: లెప్రసీ అనేది ఒక అంటువ్యాధి. దీనివల్ల చర్మం సున్నితత్వం కోల్పోయి తెల్ల మచ్చలు ఏర్పడతాయి. అక్కడ చేతితో తాకినా కూడా నొప్పి తెలియదు. ముందుగా గుర్తించి చికిత్స చేస్తే పూర్తిగా తగ్గించుకోవచ్చు.
నివారణ & చికిత్సలు:
1.సక్రమమైన డైటు: విటమిన్ B12, విటమిన్ D, కాల్షియం ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. పాల ఉత్పత్తులు, ఆకుకూరలు, గుడ్లు, సన్న బియ్యం, బాదం
ఎక్కువగా తీసుకోవాలి.
2.వెలుగు నుంచి రక్షణ: సన్‌స్క్రీన్ వాడడం వల్ల మంచి మంచి ఫలితాలు అందుతాయి. పగటి సమయంలో నేరుగా వెలుతురు దానిపై పడకుండా చూసుకోవాలి.
3.యాంటీ ఫంగల్ క్రీములు: వెర్సికోలార్ లాంటి ఫంగస్ వల్ల వస్తే, డాక్టర్ సూచించిన మందులు వాడాలి. లేదంటే ప్రమాదం అయ్యే అవకాశం ఉంది.
4.ఇమ్యూన్ సిస్టం బలోపేతం: ప్రొబయోటిక్స్, నిద్ర, స్ట్రెస్ తగ్గించడం ద్వారా రోగనిరోధక శక్తి మెరుగవుతుంది. దీనివల్ల కూడా ఈ సమస్య తగ్గించవచ్చు.
5.డెర్మటాలజిస్టు సలహా తీసుకోవాలి: తెల్ల మచ్చలు నిరంతరం పెరుగుతూ ఉంటే తప్పకుండా డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించాలి కొన్ని సందర్భాల్లో స్కిన్ బయాప్సీ లేదా బ్లడ్ టెస్టులు చేయించాల్సి వస్తుంది.