Pumpkin Juice: గుమ్మడి కాయ జ్యూస్ తో గుండె భద్రం.. షుగర్ మాయం.. ఎలాంటి రోగాలు రావు
గుమ్మడి కాయ (Pumpkin Juice) చాలా మందికి గుమ్మం ముందు దిష్టి కోసం కట్టేదిగానే తెలుసు. కానీ, దీనిని రోజువారీ ఆహరంలో భాగం

Health benefits of drinking pumpkin juice
Pumpkin Juice: గుమ్మడి కాయ చాలా మందికి గుమ్మం ముందు దిష్టి కోసం కట్టేదిగానే తెలుసు. కానీ, దీనిని రోజువారీ ఆహరంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు. పప్పులో, కూరల్లో వేసుకొని మరీ తినవచ్చు. దీని రసాన్ని (Pumpkin Juice) తీసుకోవడం వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. ఇది పోషక విలువలతో నిండి ఉన్నందున, సహజంగా శరీరానికి శక్తిని అందిస్తుంది. ముఖ్యంగా చలికాలం, వేసవికాలంలో గుమ్మడి జ్యూస్ మంచి సహజ శక్తిని అందించే పానీయంగా చెప్పుకోవచ్చు. మరి ఈ జ్యూస్ తాగడం వల్ల కలిగే ఆ ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
1.కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:
గుమ్మడి జ్యూస్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, పేక్టిన్ పదార్థాలు లివర్‌ను డిటాక్స్ చేస్తాయి. ఇది మద్యం, అధిక కొవ్వు, మందుల వల్ల లివర్‌పై వచ్చే ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది లివర్‌ను శుభ్రపరచడం, లివర్ సమస్యలు తగ్గించడం, జలదోషం వంటి సమస్యల నివారణకు సహాయపడుతుంది.
2.జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది:
గుమ్మడిలో ఉండే డైటరీ ఫైబర్, నీటి శాతం అధికంగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ సవ్యంగా పనిచేస్తుంది. మలబద్ధకం నివారణ, అజీర్ణం, వాంతులు తగ్గింపు, శరీరంలో వేడిమి తగ్గించి ఆంత్రముల ఆరోగ్యం మెరుగుపరచడం వంటి ప్రయోజనాలు కలుగుతాయి.
3.మధుమేహ నియంత్రణకు సహాయపడుతుంది:
గుమ్మడిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో షుగర్ స్థాయిని స్థిరంగా ఉంచుతుంది. గుమ్మడి బీజాల్లో ఉండే మాఘ్నీషియం కూడా ప్యాంక్రియాస్ పనితీరును మెరుగుపరుస్తుంది.
4.హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:
గుమ్మడిలో ఉండే పొటాషియం, విటమిన్ C, ఫైటోకెమికల్స్ రక్తపోటును నియంత్రిస్తుంది. దీనివల్ల బీపీ నియంత్రణ, గుండె వేగం సమతుల్యం, గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడం లాంటి ప్రయోజనాలు కలుగుతాయి.
5.చర్మం, చూపు మెరుగుపరచడం:
గుమ్మడిలో విటమిన్ A, బీటా-కెరోటిన్ అధికంగా ఉంటాయి. ఇవి చర్మానికి ఆరోగ్యాన్ని, మెరుపును అందిస్తుంది. అలాగే చూపును కూడా మెరుగుపరుస్తుంది. వృద్ధాప్య లక్షణాల నుండి రక్షణ ఇస్తుంది.
ఎలా తాగాలి?
తాజా గుమ్మడి ముక్కలు తీసుకుని చిన్న ముక్కలుగా కోసి, మిక్సీలో కొద్దిగా నీళ్లు వేసి గ్రైండ్ చేయాలి. ఉదయం ఖాళీ కడుపుతో లేదా మధ్యాహ్నం తినేవేళ తాగడం వల్ల మంచి ఫలితాలు అందుతాయి.