Ghaati Twitter Review : ‘ఘాటి’ ట్విటర్ రివ్యూ.. యాక్షన్ సీన్లలో అనుష్క బీభత్సం!

ఘాటి చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ చిత్రాన్ని వీక్షించిన వారు సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌మ అభిప్రాయాల‌ను (Ghaati Twitter Review ) తెలియ‌జేస్తున్నారు.

Ghaati Twitter Review : ‘ఘాటి’ ట్విటర్ రివ్యూ.. యాక్షన్ సీన్లలో అనుష్క బీభత్సం!

Anushka Shetty Ghaati Twitter Review

Updated On : September 5, 2025 / 9:04 AM IST

Ghaati Twitter Review : అనుష్క శెట్టి న‌టించిన చిత్రం ఘాటి. క్రిష్ జాగర్లమూడి ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. యువీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. విక్రమ్ ప్రభు, జగపతి బాబు, జిషు సేన్‌గుప్తా తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. వేదం తర్వాత అనుష్క-క్రిష్ కాంబినేషన్‌లో వ‌స్తున్న చిత్రం కావ‌డంతో ఈ చిత్రం పై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి.

ఇక ఈ చిత్రం నేడు( సెప్టెంబ‌ర్ 5న) ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. తెలుగుతో పాటు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ రిలీజ్ అయింది. ఇప్ప‌టికే ప‌లు చోట్ల షోలు ప‌డ్డాయి. ఈ చిత్రాన్ని వీక్షించిన అభిమానులు సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌మ అభిప్రాయాల‌ను తెలియ‌జేస్తున్నారు(Ghaati Twitter Review).

Little Hearts Review : ‘లిటిల్ హార్ట్స్’ మూవీ రివ్యూ.. వామ్మో.. పడీ పడీ నవ్వాల్సిందే..

ఫాస్టాఫ్ అదిరిపోయింద‌ని అంటున్నారు. ముఖ్యంగా యాక్ష‌న్ సీన్ల‌లో అనుష్క దుమ్మురేపింద‌ని అంటున్నారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంద‌ని చెబుతున్నారు. ఇక ప్రీ క్లైమాక్స్ ఓ రేంజ్‌లో ఉంద‌ని కామెంట్లు చేస్తున్నారు. ఈ చిత్రంతో క్రిష్ మంచి క‌మ్ బ్యాక్ ఇచ్చార‌ని అంటున్నారు.