Little Hearts Review : ‘లిటిల్ హార్ట్స్’ మూవీ రివ్యూ.. వామ్మో.. పడీ పడీ నవ్వాల్సిందే..
రీల్స్ తో గుర్తింపు తెచ్చుకున్న మౌళి 90s సిరీస్ తో ఫేమ్ తెచ్చుకొని ఇప్పుడు ఈ లిటిల్ హార్ట్స్ సినిమాతో హీరోగా మారాడు. (Little Hearts Review)

Little Hearts Review
Little Hearts Review : మౌళి తనుజ్, శివాని నగరం జంటగా తెరకెక్కిన సినిమా ‘లిటిల్ హార్ట్స్’. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఆదిత్య హాసన్ నిర్మాణంలో సాయి మార్తాండ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. లిటిల్ హార్ట్స్ సినిమా సెప్టెంబర్ 5న థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. రెండు రోజుల ముందునుంచే ఈ సినిమాకు ప్రీమియర్స్ వేశారు.(Little Hearts Review)
కథ విషయానికొస్తే.. ఈ కథ అంతా 2015 బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. అఖిల్(మౌళి)ని సాఫ్ట్ వేర్ ఇంజనీర్ చేయాలని వాళ్ళ నాన్న గోపాల్ రావు (రాజీవ్ కనకాల)కల. కానీ అఖిల్ కి చదువు ఎక్కదు. ఫ్రెండ్స్ తో తిరుగుతూ ఉంటాడు. ఎంసెట్ ఫెయిల్ అవ్వడం, అదే టైంలో తన లవర్ బ్రేకప్ చెప్పడం, అఖిల్ కి నచ్చకపోయినా బిటెక్ చేయాల్సిందే అని అతన్ని వాళ్ళ నాన్న ఎంసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్ లో జాయిన్ చేయడం జరుగుతుంది. అక్కడ కాత్యాయని(శివాని) పరిచయం అవుతుంది. తనకి బైపీసీ ఇష్టం లేకపోయినా వాళ్ళ పేరెంట్స్ వల్ల తను కూడా లాంగ్ టర్మ్ తీసుకుంటుంది. వీరిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది.
ఇంతలో కాత్యాయని బావ అంటూ ఓ అబ్బాయి అదే కోచింగ్ లో జాయిన్ అవుతాడు. అఖిల్ – కాత్యాయని మధ్య క్లోజ్ నెస్ పెరగడంతో తనకి ప్రపోజ్ చేస్తాడు. కానీ తను అఖిల్ కంటే మూడేళ్లు పెద్ద అని అతన్ని కొట్టి వెళ్ళిపోతుంది. మరి అఖిల్ ఏం చేసాడు? వీళ్లిద్దరి మధ్య ప్రేమ ఎలా ఏర్పడుతుంది? కాత్యాయని బావ ఏమయ్యాడు? అఖిల్ – కాత్యాయని ప్రేమకు వచ్చిన అడ్డంకులేటి? ఇద్దరి ఫ్యామిలీలలో వీళ్ళు చదివేది ఇష్టం లేదని, తమకు నచ్చిన కెరీర్ గురించి చెప్తారా? స్ట్రిక్ట్ పేరెంట్స్ మధ్య వీళ్ళిద్దరూ ఎలా కమ్యూనికేట్ అవుతారు.. ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Also Read : Pawan Kalyan : అమెరికాలో పవన్ కళ్యాణ్ OG దూకుడు.. పుష్ప, దేవర, సలార్ రికార్డ్ లను బద్దలుకొట్టి..
సినిమా విశ్లేషణ..
సోషల్ మీడియాలో రీల్స్ తో గుర్తింపు తెచ్చుకున్న మౌళి ఇటీవల 90s వెబ్ సిరీస్ తో మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఈ లిటిల్ హార్ట్స్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. వీళ్ళ ప్రమోషన్స్ కూడా కొత్తగా ఉండటం, సినిమా రిలీజ్ కు ముందు పాటలు బాగుండటంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.
ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఇంటర్ అయిపోయిన కుర్రాడు, అతని ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఎంసెట్ కోచింగ్ లో జాయిన్ అవ్వడం, అక్కడ ఓ అమ్మాయి పరిచయం అవ్వడంతో సింపుల్ గా అక్కడక్కడా కామెడీతో సాగిపోతుంది. ఇంటర్వెల్ కి కాత్యాయని అఖిల్ కంటే పెద్దదని తెలియడంతో నెక్స్ట్ వీళ్ళ ప్రేమ ఎలా సాగుతుంది అని ఆసక్తి నెలకొంటుంది. సెకండ్ హాఫ్ అంతా ఫుల్ గా నవ్విస్తునే మధ్యలో కాస్త ఎమోషన్ పెట్టారు. కానీ ఆ ఎమోషన్ లో కూడా కొన్ని సీన్స్, పాటతో నవ్వు తెప్పించారు. ఈ సినిమాకు క్లైమాక్స్ చాలా ప్లస్ అయింది. సినిమా అంతా నడిచిన తీరు చూసి మధ్యలో ఎక్కడో ఎండ్ ఉంటుందేమో అనిపిస్తుంది కానీ కథకు ఒక పూర్తి క్లైమాక్స్ ఇచ్చారు. క్లైమాక్స్ కూడా చాలా కన్విన్స్ గా రాసుకున్నారు.
కథ పరంగా చూస్తే ఒక మాములు లవ్ స్టోరీనే కానీ దాన్ని చాలా అందంగా క్యూట్ గా చూపిస్తూ నవ్వించే డైలాగ్స్ తో మంచి స్క్రీన్ ప్లేతో బాగా రాసుకొని మెప్పించారు. ఇక సినిమాకు లిటిల్ హార్ట్స్ అనే పేరు ఎందుకు పెట్టారో అర్ధం కాదు కానీ టైటిల్ కోసం ఓ రెండు డైలాగ్స్ అయితే వాడారు. సినిమా అంతా 2015 బ్యాక్ డ్రాప్, ఇంటర్, ఎంసెట్ బ్యాక్ డ్రాప్ లో తీయడంతో 90s, ఎర్లీ 2000 కిడ్స్ కి కాలేజీ డేస్ కచ్చితంగా గుర్తొస్తాయి. అప్పట్లో అమ్మాయిలు, అబ్బాయిలు ఎలా ఉండేవాళ్ళు, అప్పుడు బాహుబలి చేసిన సందడి, అప్పట్లో ఫేస్ బుక్ ని ఏ రేంజ్ లో వాడేవాళ్లు, కాలేజీలో ఎలా ఉండేవాళ్ళం, లవర్స్ అప్పుడు ఎలా మాట్లాడుకునేవాళ్ళు.. ఇవన్నీ మనకు కచ్చితంగా గుర్తొస్తాయి. 90s, ఎర్లీ 2000 కిడ్స్ కి మాత్రం ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. హీరో – హీరోయిన్ పాత్రల్లో తమని తాము చూసుకుంటారు. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్లి చూస్తే ఫుల్ గా నవ్వుకొని రావొచ్చు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ అంతా పడీ పడీ నవ్వాల్సిందే. రీసెంట్ టైంలో వచ్చిన ఒక మంచి రామ్ కామ్ సినిమా. ఫ్యామిలీతో కలిసి వెళ్లొచ్చు.(Little Hearts Review)
నటీనటుల పర్ఫార్మెన్స్..
ఇన్నాళ్లు సోషల్ మీడియాలో రీల్స్ తో నవ్వించిన మౌళి మొదటిసారి హీరోగా ఆకట్టుకున్నాడు. తన నటనతో మెప్పిస్తాడు. ఇండస్ట్రీలో కామెడీ, లవ్ సినిమాలు చేయడానికి మరో హీరో దొరికాడు అనిపిస్తుంది. శివాని సింపుల్ లుక్స్ లో అప్పట్లో అమ్మాయిలు అలాగే ఉండేవాళ్ళు అనిపిస్తుంది. పర్ఫెక్ట్ గా కాత్యాయని పాత్రలో ఒదిగిపోయింది. రాజీవ్ కనకాల తండ్రి పాత్రలో మెప్పించారు. సీనియర్ నటులు SS కాంచి కూడా నవ్విస్తారు. సత్య కృష్ణన్, అనితా చౌదరి తల్లి పాత్రల్లో బాగానే మెప్పించారు. ఫ్రెండ్ పాత్రలో జయకృష్ణ తన కామెడీ టైమింగ్ తో ఫుల్ గా నవ్విస్తాడు. మరో ఫ్రెండ్ పాత్రలో నిఖిల్ అబ్బూరి అక్కడక్కడా కనిపించి పర్వాలేదనిపిస్తాడు. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే మెప్పిస్తారు.
Also See : Lokah Chapter 1 Chandra : మలయాళం హిట్ సినిమా.. తెలుగులో సక్సెస్ మీట్.. ఫొటోలు..
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ కలర్ ఫుల్ గా ఉన్నాయి. సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ చాలా ప్లస్ అయ్యాయి. సాంగ్స్ రిపీటెడ్ మోడ్ లో వినొచ్చు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా సెట్ అయింది. 2015 బ్యాక్ డ్రాప్ లో చూపించడానికి ఆర్ట్ డైరెక్టర్స్ అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. నవ్వించడమే లక్ష్యంగా పెట్టుకొని ఒక సింపుల్ లవ్ స్టోరీని చాలా బాగా రాసుకున్నాడు దర్శకుడు. మొదటి సినిమాని పర్ఫెక్ట్ గా డీల్ చేసాడు. నిర్మాణ పరంగా సినిమాకు కావలసినంత ఖర్చుపెట్టారు.
మొత్తంగా ‘లిటిల్ హార్ట్స్’ సినిమా ఫుల్ గా నవ్విస్తూనే ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీ చూపిస్తుంది. ఈ సినిమాకు 3.5 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.