Mark Zuckerberg: మార్క్ జుకర్‌బర్గ్ ఇంటికి మరో చిన్న అతిథి.. ఆనందంతో ఫొటో షేర్ చేసిన మార్క్ ..
మార్క్ తన సతీమణి గర్భిణీ అనే విషయాన్ని గతేడాది సెప్టెంబర్‌లో తెలిపాడు. ప్రిసిల్లా ఫొటోను పంచుకుంటూ తాను మూడోసారి తండ్రిని కాబోతున్నట్లు చెప్పాడు.

Mark Zuckerberg
Mark Zuckerberg: ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఇంటికి చిన్న అతిథి వచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన మార్క్.. తన ఆనందాన్ని వెలుబుచ్చాడు. మా ఇంటికి చిన్న అతిథి వచ్చింది అంటూ పేర్కొన్నారు. మార్క్ జుకర్‌బర్గ్, ప్రిసిల్లా చాన్ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు సంతానం. అయితే, తాజాగా ప్రిసిల్లా చాన్ మూడో కుమార్తెకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్‌లో ద్వారా వెల్లడించారు. బేబీ ఫొటోను పోస్టు చేశాడు. ఆ చిన్నారికి ఒరిలియా చోన్ జుకర్‌బర్గ్‌గా నామకరం చేసి, ప్రపంచానికి స్వాగతం పలికారు. మీరు నిజంగా భగవంతుని ఆశీర్వాదం అంటూ మార్క్ పేర్కొన్నాడు.
మార్క్ తన సతీమణి గర్భిణీ అనే విషయాన్ని గతేడాది సెప్టెంబర్‌లో తెలిపాడు. ప్రిసిల్లా ఫొటోను పంచుకుంటూ తాను మూడోసారి తండ్రిని కాబోతున్నట్లు చెప్పాడు. మార్క్, ప్రిసిల్లా కాలేజీ నుంచి ఒకరికొకరు తెలుసు. 2003లో ఒకరికొకరు డేటింగ్ ప్రారంభించారు. 2012లో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. గతేడాది మే నెలలో భార్యాభర్తలిద్దరూ తమ 10వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు.
View this post on Instagram
పెళ్లిరోజు ఫొటోను పంచుకుంటూ.. మార్క్ క్యాప్షన్ ఇలా రాశాడు. 10 సంవత్సరాల వివాహం, మా జీవితంలో సగం. మరిన్ని సాహసాలు ఇంకా రావాల్సి ఉంది అంటూ పేర్కొన్నాడు. జుకర్‌బర్గ్, ప్రిసిల్లాకు గతంలో ఇద్దరు పిల్లలు. వారికి మాక్స్, ఆగస్ట్ అని పేరుపెట్టారు.