Elon Musk: ఒబామాను దాటేసిండు..! ట్విటర్‌లో అత్యధిక ఫాలోవర్స్‌ కలిగిన వ్యక్తిగా ఎలాన్ మస్క్

ట్విటర్ సీఈఓ ఎలాన్ మస్క్ అమెరికా మాజీ అధ్యక్షుడు ఒరాక్ ఒబామాను దాటేశాడు. మైక్రోబ్లాగింగ్ సైట్‌లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన వ్యక్తిగా మస్క్ నిలిచాడు.

Elon Musk: ఒబామాను దాటేసిండు..! ట్విటర్‌లో అత్యధిక  ఫాలోవర్స్‌ కలిగిన వ్యక్తిగా ఎలాన్ మస్క్

Elon Musk

Elon Musk: ట్విటర్ సీఈఓ ఎలాన్ మస్క్  (Twitter Ceo Elon Musk) అమెరికా మాజీ అధ్యక్షుడు ఒరాక్ ఒబామా (Barack Obama)ను దాటేశాడు. 2020 నుంచి ట్విటర్‌లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన వ్యక్తిగా ఒబామా కొనసాగుతున్నాడు. తాజాగా ఆ రికార్డును మస్క్ తుడిచేశాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం.. మైక్రోబ్లాగింగ్ సైట్‌ ట్విటర్‌ (Twitter) లో అత్యధిక మంది ఫాలోవర్స్ కలిగిన వ్యక్తిగా మస్క్ నిలిచాడు. వారి సంబంధిత ట్విటర్ ప్రొఫైల్స్ (Twitter profiles) సూచించిన ఫాలోవర్స్ ప్రకారం.. ఒబామాకు 1,33,042,819 మంది ఫాలోవర్స్ ఉండగా, మస్క్ ఫాలోవర్స్ సంఖ్య 133,068,709 మందిగా ఉంది.

Elon Musk: ఎలాన్ మస్క్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన డబ్ల్యూహెచ్ఓ అధినేత

ట్విటర్‌లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన వ్యక్తిగా ఎలాన్ మస్క్ మారడానికి ట్విటర్ కొనుగోలు ఉపయోగపడిందని చెప్పొచ్చు. 51ఏళ్ల బిలియనీర్ 44బిలియన్ డాలర్లకు ట్విటర్‌ను కొనుగోలు చేశాడు. అప్పటినుంచి అనేక ఆటంకాలు ఎదురైనప్పటికీ.. ట్విటర్‌లో నిత్యం అందుబాటులో ఉంటూ మస్క్ ట్వీట్లు చేస్తున్నాడు. మస్క్ ట్వీట్లు పలుసార్లు వివాదాస్పదం కూడా అయ్యాయి. గతేడాది అక్టోబర్ 27న మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేశాడు. ఆ సమయంలో అతనికి 110 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. జస్టిస్ బీబర్ (Justin Bieber), ఒబామా తరువాత స్థానంలో మస్క్ ఉండేవాడు. ట్విటర్ కొనుగోలు నాటి నుంచి దాదాపు ఐదు నెలల కాలంలో మస్క్ 23 మిలియన్ల మంది ఫాలోవర్లను అదనంగా సంపాదించుకోవటం గమనార్హం.

Elon Musk..Silicon Valley Bank : సిలికాన్ వ్యాలీ బ్యాంక్ మూసివేత .. కొనటానికి నేను రెడీ అంటున్న ఎలన్ మస్క్

గణాంకాల ట్రాకర్ సోషల్ బ్లేడ్ ప్రకారం.. నెల రోజుల్లో ఒబామా, బీబర్ ఫాలోవర్స్ భారీగా తగ్గిపోయారు. గత 30 రోజులుగా ఒబామా 267,585 మంది ఫాలోవర్లను, బీబర్ 118,950 మంది ఫాలోవర్లను కోల్పోయారు. మస్క్ మాత్రం సగటున రోజుకు 100,000 కొత్త ఫాలోవర్స్‌ను పొందినట్లు నివేదిక చెబుతోంది. దీనికి ప్రధాన కారణం లేకపోలేదు. ఎలాన్ మస్క్ పోస్టింగ్ లు అన్ని రంగాలకు సంబంధించినవి ఉంటున్నాయి. ముఖ్యంగా ట్విటర్ అధినేత కావడం, ప్రస్తుతం ట్విటర్‌లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మస్క్ పెట్టిన ప్రతీ ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంటుంది.

Barack Obama : వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా ప్రతిష్టాత్మక ఎమ్మీ అవార్డు దక్కించుకున్న బరాక్ ఒబామా..

ఒబామా విషయానికొస్తే.. ప్రధానంగా వృత్తిపరమైన వ్యవహారాలకోసం తన ఖాతాను ఉపయోగిస్తారు. పలు విషయాలపై ప్రచారం చేయడం, తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చేసిన పనులను హైలెట్ చేయడం చేస్తుంటారు. జస్టిస్ బీబర్, కేటి పెర్రీలు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. కానీ మస్క్ అన్ని రంగాలపైనా, దేశాల సరిహద్దులపైనా ట్వీట్లు చేస్తుంటంతో వాటి పట్ల ఫాలోవర్లు ఎక్కువ ఆకర్షితులవుతున్నట్లు కనిపిస్తుంది.