Barack Obama : వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా ప్రతిష్టాత్మక ఎమ్మీ అవార్డు దక్కించుకున్న బరాక్ ఒబామా..

తాజాగా ‘అవర్‌ గ్రేట్‌ నేషనల్‌ పార్క్స్‌' డాక్యుమెంటరీ సిరీస్ కి వాయిస్ అందించినందుకు ప్రపంచంలోనే అత్యుత్తమ పురస్కారాల్లో ఒకటైన ఎమ్మీ అవార్డు ఒబామాకి వరించింది. బెస్ట్‌ నేరేటర్‌ గా ఆయన ఈ పురస్కారం.........

Barack Obama : వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా ప్రతిష్టాత్మక ఎమ్మీ అవార్డు దక్కించుకున్న బరాక్ ఒబామా..

Barack Obama win Emmy award for narrating Our Great National Parks

Barack Obama :  అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ప్రతిష్ఠాత్మక ఎమ్మీ అవార్డును సాధించారు. నెట్‌ఫ్లిక్స్‌ లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గొప్ప జాతీయ పార్కులపై ‘అవర్‌ గ్రేట్‌ నేషనల్‌ పార్క్స్‌’ అంటూ ఓ డాక్యుమెంటరీ సిరీస్‌ ని తీశారు. ఈ సిరీస్ ని ఒబామా, ఆయన సతీమణి మిషెల్‌ ఒబామాల నిర్మాణ సంస్థ హయర్‌ గ్రౌండ్‌ నిర్మించింది. ఈ సిరీస్ కి బరాక్ ఒబామా వాయిస్ ఆర్టిస్ట్ గా నేరేషన్ ఇచ్చారు. నెట్ ఫ్లిక్స్ లో ఈ డాక్యుమెంటరీ బాగా పాపులర్ అయింది.

తాజాగా ‘అవర్‌ గ్రేట్‌ నేషనల్‌ పార్క్స్‌’ డాక్యుమెంటరీ సిరీస్ కి వాయిస్ అందించినందుకు ప్రపంచంలోనే అత్యుత్తమ పురస్కారాల్లో ఒకటైన ఎమ్మీ అవార్డు ఒబామాకి వరించింది. బెస్ట్‌ నేరేటర్‌ గా ఆయన ఈ పురస్కారం దక్కించుకున్నారు. అమెరికా అధ్యక్షులుగా పనిచేసినవారిలో ఎమ్మీ అవార్డు గెలుచుకున్న రెండో వ్యక్తి ఒబామానే. గతంలో డివైట్‌ డి ఐసెన్‌హోవర్‌ 1956లో అందుకున్నారు.

BiggBoss 6 : ఇక మొదలెడదామా.. ఈ సారి బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్ వీళ్ళే.. ఏకంగా 21 మంది..

ఒబామా ఇప్పటికే రెండు గ్రామీ అవార్డులను కూడా సాధించారు. తను రాసిన ‘ఏ ప్రామిస్డ్‌ ల్యాండ్‌’, ‘ది అడాసిటీ ఆఫ్‌ హోప్‌’ పుస్తకాలకు తనే వాయిస్ ఓవర్ ఇచ్చి ఆడియో వెర్షన్‌లను రిలీజ్ చేయగా వీటికి కూడా బెస్ట్ నేరేటర్ గా గ్రామీ అవార్డులు అందుకున్నారు. ఒబామా భార్య మిషెల్‌ ఒబామా కూడా గతంలో నేరేటర్ గా గ్రామీ అవార్డు అందుకున్నారు. తాజాగా ఒబామా ఎమ్మీ అవార్డు అందుకోవడంతో ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు.