NASA spacecraft: ఆస్టరాయిడ్ శాంపుల్స్ తీసుకుని రిటర్న్ అయిన నాసా అంతరిక్ష నౌక

ఆస్టరాయిడ్‌ల నుంచి శాంపుల్స్ కలెక్ట్ చేసిన నాసా స్పేస్‌క్రాఫ్ట్ రెండేళ్ల ప్రయాణం తర్వాత భూమి మీదకు సోమవారం బయల్దేరింది. నాసాకు చెందిన OSIRIS-REx బెన్నును చేరేందుకు 200 మిలియన్ మైల్స్..

NASA spacecraft: ఆస్టరాయిడ్ శాంపుల్స్ తీసుకుని రిటర్న్ అయిన నాసా అంతరిక్ష నౌక

Nasa Asteroid Samples

NASA spacecraft: ఆస్టరాయిడ్‌ల నుంచి శాంపుల్స్ కలెక్ట్ చేసిన నాసా స్పేస్‌క్రాఫ్ట్ రెండేళ్ల ప్రయాణం తర్వాత భూమి మీదకు సోమవారం బయల్దేరింది. నాసాకు చెందిన OSIRIS-REx బెన్నును చేరేందుకు 200 మిలియన్ మైల్స్(320 మిలియన్ కిలోమీటర్లు) ప్రయాణించింది. అక్కడి తలాన్ని సర్వే చేసి, శాంపుల్స్ కలెక్ట్ చేసుకుని వాటిని భూమి మీదకు తీసుకురానుంది.

కొలరాడోలోని OSIRIS-REx కంట్రోల్ రూంలో స్టాఫ్ స్పేష్ వెహికల్ వెనక్కు వస్తుందని తెలిసి సంబరాలు జరుపుకున్నారు. రెండేళ్ల క్రితం అంటే 2018లో OSIRIS-REx భూమిపై నుంచి బయల్దేరింది. స్పేస్‌క్రాఫ్ట్ హైడ్రోజన్, ఆక్సిజన్ మాలిక్యూల్స్ ముక్కలను కలెక్ట్ చేసింది.

భూమిపైకి తిరిగి రావడానికి రెండేళ్లు పట్టింది. అప్పుడే తనతో పాటు ఉన్న ఆస్టరాయిడ్ శాంపుల్స్ ను బయటపెడుతుంది. Utahఅనే రిమోట్ ఏరియాలో ల్యాండ్ అవుతుందని నాసా చెబుతుంది.

ఈ శాంపుల్స్ ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న రీసెర్ట్ ల్యాబొరేటరీలకు డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు. కాకపోతే 75శాతం శాంపుల్స్ మాత్రం హోస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్ లో ఫ్యూచర్ జనరేషన్స్ కోసం దాచిపెడతారు.

షుమారు 800మిలియన్ డాలర్లతో మినీ వ్యాను సైజులో ఉండే OSIRIS-REx స్పేస్ క్రాఫ్ట్ ను లాక్ హీడ్ మార్టిన్ నిర్మించారు.