North Korea: అమెరికా బయోలాజికల్ ఆయుధాలు సిద్ధం చేస్తుంది – ఉత్తర కొరియా

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బయోలాజికల్ ఆయుధాలను సిద్ధం చేస్తున్నట్లు నార్త్ కొరియా ఆరోపించింది. రష్యా గతంలో ఇవే ఆరోపణలు వినిపించినప్పటికీ మార్చిలో యునైటెడ్ నేషన్స్ వాటిని కొట్టిపారేసింది. వాషింగ్టన్.. యుక్రెయిన్‌లో బయోలాజికల్ ఆయుధాలు తయారుచేస్తున్నట్లు మార్చిలో మాస్కో విమర్శలకు దిగింది.

North Korea: అమెరికా బయోలాజికల్ ఆయుధాలు సిద్ధం చేస్తుంది – ఉత్తర కొరియా

North Korea

 

 

North Korea: యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బయోలాజికల్ ఆయుధాలను సిద్ధం చేస్తున్నట్లు నార్త్ కొరియా ఆరోపించింది. రష్యా గతంలో ఇవే ఆరోపణలు వినిపించినప్పటికీ మార్చిలో యునైటెడ్ నేషన్స్ వాటిని కొట్టిపారేసింది. వాషింగ్టన్.. యుక్రెయిన్‌లో బయోలాజికల్ ఆయుధాలు తయారుచేస్తున్నట్లు మార్చిలో మాస్కో విమర్శలకు దిగింది.

ఫిబ్రవరిలో మాస్కో మిత్రదేశమైన ప్యోంగ్యాంగ్.. US విధానమే “యుక్రెయిన్ సంక్షోభానికి మూలకారణం” అని చెప్పింది. జులై నెలలో తూర్పు యుక్రెయిన్‌లో రెండు స్వయం ప్రకటిత రష్యన్ అనుకూల వేర్పాటువాద ప్రాంతాలను అధికారికంగా గుర్తించింది. అదే ఉత్తర కొరియాతో దౌత్య సంబంధాలను తెంచుకోవడానికి కైవ్‌ను ప్రేరేపించింది.

వాషింగ్టన్ “అంతర్జాతీయ ఒప్పందాలను పట్టించుకోకుండా యుక్రెయిన్‌తో సహా పదుల సంఖ్యలో దేశాల ప్రాంతాలలో అనేక బయోలాజికల్ ల్యాబ్‌లను ఏర్పాటు చేసింది” అని అధికారిక కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కెసిఎన్‌ఎ) ఆదివారం తెలిపింది. వాటిని రష్యా “కనుగొన్నట్లు” పేర్కొంది.

Read Also: యుక్రెయిన్ విద్యార్థుల కోసం రష్యన్ జర్నలిస్టు నోబెల్ ప్రైజ్ వేలం

దాదాపు ఐదు నెలల క్రితం రష్యా దాడి చేసిన యుక్రెయిన్‌లో బయోలాజికల్ ఆయుధాల అభివృద్ధిపై పరిశోధనలకు వాషింగ్టన్ నిధులు సమకూరుస్తోందని మార్చిలో మాస్కో ఆరోపించింది.