Gold and Silver Rates Today : పసిడి ప్రియులకు అలర్ట్.. రాత్రికిరాత్రే సీన్ రివర్స్.. నేటి బంగారం, వెండి ధరలు ఇవే..
Gold and Silver Rates Today : బంగారం, వెండి కొనుగోలుకు సిద్ధమవుతున్నారా.. అయితే, మీకు బిగ్ షాకింగ్ న్యూస్.

బంగారం, వెండి కొనుగోలుకు సిద్ధమవుతున్నారా.. అయితే, మీకు బిగ్ షాకింగ్ న్యూస్. బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. గత మూడు రోజుల వరకు భారీ తగ్గిన వీటి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరగడం దేశీయంగా ప్రభావం చూపించింది. వచ్చేవారం నుంచి భారతదేశంలో పెళ్లిళ్ల సీజన్ మొదలవుతోంది. అలాగే శివరాత్రి, ఉగాది, శ్రీరామనవమి వంటి పండగలుసైతం ఉన్నాయి. బంగారం కొనుగోలు చేసేందుకు చాలా మంది సిద్దమవుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో బంగారం, వెండి ధరలు మళ్లీ భారీగా పెరుగుతుండటం వారిని ఆందోళనకు గురిచేస్తోంది.

ఆదివారం బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. మరోవైపు.. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు పెరిగింది. ఔన్సు గోల్డ్‌పై 98డాలర్లు పెరగ్గా.. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ రేటు 4,966 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలను పరిశీలిస్తే.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర స్వల్పంగా పెరిగింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో.. 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,43,550 వద్దకు చేరగా.. 24క్యారట్ల ధర రూ.1,56,600కు చేరింది.

దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.. దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,43,700కాగా.. 24క్యారట్ల ధర రూ. 1,56,750కు చేరింది. ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,43,550కు చేరగా.. 24క్యారట్ల ధర రూ.1,56,500కు వద్దకు చేరింది.

ఇవాళ్టి వెండి ధర ఇలా.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర స్వల్పంగా పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.2,85,000కు చేరింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,80,000 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి ధర రూ. 2,85,000 వద్దకు చేరింది.

గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
