Pakistan Gurdwara : గురుద్వారాలో ఫొటోషూట్‌..వివాదంలో మోడల్ సౌలేహ

సిక్కుల పవిత్ర స్థలం గురుద్వారాలో ఓ మోడల్ ఫోటో షూట్ చేయటం వివాదంగా మారింది.

Pakistan Gurdwara :  గురుద్వారాలో ఫొటోషూట్‌..వివాదంలో మోడల్ సౌలేహ

Model Photo Shoot In Pakistan Gurdwara

Model photo shoot in Pakistan Gurdwara : గురుద్వారా..సిక్కుల పవిత్ర స్థలం. అటువంటి గురుద్వారాలో ఓ మోడల్ ఫోటో షూట్ చేయటం వివాదంగా మారింది. పాకిస్థాన్ లోని కర్తాపూర్‌లోని దర్బార్ సాహిబ్ గురుద్వారాలో మోడల్ సౌలేహ ఇంతియాజ్ ఫోటో షూట్ చేయటంతో అది కాస్తా వివాదాస్పదంగా మారింది. గురుద్వారాలోకి మహిళలు వెళితే తప్పనిసరిగా వారి నుదిటి భాగం కనిపించకుండా వస్త్రాన్ని కప్పుకోవాలి. ఇది తప్పనిసరి నిబంధన. కానీ మోడల్ సులేహా ఎటువంటి నిబంధన పాటించకుండా ఫోటో షూట్ చేయటంతో అది సిక్కుల మనోభావాలను దెబ్బతీసేదిగా ఉందని వివాదంగా మారింది. ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ మన్నత్ క్లాతింగ్ కోసం మోడల్ సులేహా ఇంతియాజ్ గురుద్వారా నిబంధనలు పాటించకుండా..నుదుటిపై వస్త్రం కప్పుకోకుండా గురుద్వారాలో చేసిన ఫొటో షూట్‌లో పాల్గొన్నారు. మన్నత్ సంస్థ ఈ ఫొటోలను తన సోషల్ మీడియా ఎకౌంట్స్ లో పోస్ట్ చేయటంతో అదికాస్తా వివాదంగా మారింది.

Read more : Elon Musk: ఇండియన్ టాలెంట్‌తో అమెరికా బాగుపడుతుంది – ఎలన్ మస్క్

దీనిపై..మోడల్ సులేహా తీరు సిక్కుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచిందని ఆవేదన వ్యక్తం చేస్తు.. భారత జర్నలిస్ట్ రవీందర్ సింగ్ ఈ ఫొటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తూ పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌ను ట్యాగ్ చేశారు. దీంతో పాకిస్తాన్‌లోని పంజాబ్ సీఎం ఉస్మాన్ బుజ్దార్ స్పందించారు. దీనిపై విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పంజాబ్ పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సంబంధిత దుస్తుల బ్రాండ్,మోడల్‌పై దర్యాప్తు చేపడతామని, అన్ని మతాల ప్రార్థనా స్థలాలను సమానంగా గౌరవించాలని అన్నారు.

Read more : Amid Omicron: ఒమిక్రాన్ హైరిస్క్ అలర్ట్.. నిఘాలో 600మంది

ఇదిలా ఉంటే.. ఈ వివాదంపై లాహోర్‌కు చెందిన మన్నత్ క్లాతింగ్ క్షమాపణలు తెలిపి..ఆపై పోస్ట్ చేసిన ఫొటోలను సోషల్ మీడియా నుంచి తొలగించింది. అలాగే మోడల్  సౌలేహ కూడా క్ష‌మాప‌ణ‌లు చెబుతు.. ఎవ‌రి మ‌నోభావాల‌ను కించ‌ప‌ర‌చ‌డం త‌న ఉద్దేశం కాద‌ని దయచేసిన మన్నించమని కోరారు.