Four-Day Working Week : కరోనా పుణ్యమా అని.. వారానికి ఇక నాలుగు రోజులే పని..!

కరోనా పుణ్యమా అని.. ఇకపై వారానికి నాలుగు రోజులే పనిచేసేది.. కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచమంతా అతులాకుతలమైంది. కరోనా ఆంక్షలతో అందరూ అలసిపోయింటారు. ఇక రెస్ట్ తీసుకోండి అంటున్నాయి కంపెనీలు.

Four-Day Working Week : కరోనా పుణ్యమా అని.. వారానికి ఇక నాలుగు రోజులే పని..!

Spain Set To Try A Four Day Working Week Amid Covid 19 Burnout (1)

Four-Day Working Week amid Covid-19 burnout : కరోనా పుణ్యమా అని.. ఇకపై వారానికి నాలుగు రోజులే పనిచేసేది.. కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచమంతా అతులాకుతలమైంది. కరోనా ఆంక్షలతో అందరూ అలసిపోయింటారు. ఇక రెస్ట్ తీసుకోండి అంటున్నాయి స్పెయిన్ కంపెనీలు. ఎందుకంటే అక్కడి దేశంలో ‘పైలట్’ పేరుతో వారానికి నాలుగు రోజులే వర్కింగ్ డే అమల్లోకి వచ్చింది. ప్రపంచంలో ఈ తరహా ఆలోచనను అమల్లోకి తెచ్చిన మొదటి దేశాల్లో స్పెయిన్ ఒకటి.

ఈ ఏడాదిలోనే లెఫ్ట్ వింగ్ స్పానిష్ పార్టీ మాస్ పీయాష్.. ఇటీవలే ప్రభుత్వం ముందు వారానికి నాలుగు రోజుల పనికి సంబంధించి ప్రతిపాదన తీసుకొచ్చింది. దీనికి ప్రభుత్వం నుంచి అధికారికంగా ఆమోదం కూడా లభించింది. ఇప్పుడే ఈ పైలట్ స్కీమ్ తొలి అడుగు పడింది. కరోనా ప్రభావం ప్రతిఒక్కరిపై పడింది. వర్కింగ్ లైఫ్ కూడా దెబ్బతింది. చాలామంది ఉద్యోగులు ఇంట్లో నుంచే ఆఫీసు వర్కింగ్ చేయాల్సి వచ్చింది.
Work
దాంతో సాధారణ ఆఫీసుల్లో వర్కింగ్ అవర్స్ కంటే ఎక్కువ సమయం ఇంట్లో నుంచి చేయాల్సి వచ్చింది. తద్వారా అధిక పనిభారంతో పాటు మానసిక ఒత్తిడికి దారితీసింది. పనిఒత్తిడిని తగ్గించడంలో భాగంగా వారానికి నాలుగు రోజుల పనిదినాలనే ఆలోచనపై అనేక సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఈ ఆలోచన దాదాపు శతాబ్ద కాలంగా కొనసాగుతోంది. ప్రొడక్షన్ పెంచడంతో పాటు ఉద్యోగుల మానసిక ఆరోగ్యం మెరుగుపడేందుకు ఇదే సరైన మార్గమని నిర్ణయించారు. వారానికి నాలుగు రోజులు పని అంటే.. (32 గంటలు). వచ్చే మూడేళ్లలో 60 మిలియన్ డాలర్ల ప్రాజెక్టును ఎర్రోజాన్ పార్టీ ప్రతిపాదించింది.
Erroejn
దీనిద్వారా ఉద్యోగుల పని గంటలను తగ్గించేందుకు కంపెనీలకు అనుమతినిచ్చింది. ఈ ప్రాజెక్టులో భాగంగా తొలి ఏడాదిలో 100శాతం , రెండో ఏడాదిలో 50శాతం, మూడో ఏడాదిలో 33శాతం చొప్పున ఖర్చు భరించనుంది. ఇందులో మొత్తం 200 కంపెనీలు వరకు పాల్గొంటాయని అంచనా. ఒక్కో కంపెనీలో మొత్తంగా 3వేల నుంచి 6వేల మంది వర్కర్లు ఉంటారు. ఈ పైలట్ ప్రాజెక్టు శరదృతువు నుంచి ప్రారంభం కానుంది. 1998లో ఫ్రాన్స్ 35 గంటల వర్క్ అమల్లోకి తెచ్చింది. ఆ తర్వాత నుంచి ఈ తరహా పని గంటలు తగ్గించడం జాతీయంగా ఇదే మొదటిసారి.