బట్టలు ఉతికించుకోవడానికే ప్రధాని అమెరికాకు వస్తున్నారు!!

బట్టలు ఉతికించుకోవడానికే ప్రధాని అమెరికాకు వస్తున్నారు!!

అమెరికా పర్యటనకు వచ్చేటప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వ్యవహరించే తీరుపై అమెరికన్‌ మీడియాలో ఓ కథనం ప్రచురించారు. బెంజమిన్ పర్యటించిన ప్రతిసారీ బ్యాగుల కొద్దీ మాసిపోయిన దుస్తులు తీసుకొస్తారనేది ఆ కథనం సారాంశం. ఆ దుస్తులను అమెరికా ప్రభుత్వంలోని పనివారితో ఉతికించుకునేందుకు ఇలా చేస్తుంటారని వాషింగ్టన్‌ పోస్టు రాసుకొచ్చింది. దీంతో నెతన్యాహు పద్ధతి చర్చనీయాంశమైంది.

బెంజమిన్ అమెరికాలో అధికారికంగా పర్యటించిన ప్రతిసారీ వైట్‌హౌస్‌కు చెందిన అఫీషియల్ గెస్ట్ హౌజ్ భవనమైన బ్లెయిర్ హౌస్‌లో సేదతీరుతుంటారు. అదే సమయంలో ఆయనతో పాటుగా బ్యాగులు, సూటుకేసుల కొద్దీ విడిచిన బట్టలను తీసుకువస్తారు. వాటిని సిబ్బంది ఉచితంగా శుభ్రం చేసిపెడతారు. అతిథులందరికీ బ్లెయిర్ హౌస్‌ ఉచితంగా లాండ్రీ సేవలు అందిస్తుండంతో ఈ సౌలభ్యాన్ని ఈ విధంగా ఉపయోగించుకుంటున్నారు.



చాలా మంది విదేశీ నేతలు ఈ సర్వీసులను కరెక్ట్ పద్థతిలోనే వినియోగించుకున్నప్పటికీ.. నెతన్యాహు మాత్రమే సూట్‌కేసుల కొద్దీ దుస్తులను తీసుకొస్తారని అధికారులు వెల్లడించినట్లు కథనంలో పేర్కొన్నారు. ఆయన తీరు ఇలాగే ఉండటంతో ఉద్దేశపూర్వకంగా ఈ రకంగా కామెంట్లు చేస్తున్నదేనని గుర్తించినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఈ ఆరోపణలను వాషింగ్టన్‌లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వెల్లడించింది.