Afghanistan : అప్ఘానిస్తాన్‌లో తాలిబన్ల దాష్టీకం..నిరసన ప్రదర్శనలు కవర్ చేసిన జర్నలిస్టులపై దాడి
అప్ఘానిస్తాన్‌లో తాలిబన్ల అరాచకాలు హద్దుమీరుతున్నాయి. నిరసన ప్రదర్శనలు కవర్ చేసిన జర్నలిస్టులపై తాలిబన్లు దాడి చేశారు. ఇద్దరు జర్నలిస్టులను బంధించి చితకబాదారు.

Taliban Attack
Taliban attack journalists : అప్ఘానిస్తాన్‌లో తాలిబన్ల అరాచకాలు హద్దుమీరుతున్నాయి. నిరసన ప్రదర్శనలు కవర్ చేసిన జర్నలిస్టులపై తాలిబన్లు దాడి చేశారు. ఇద్దరు జర్నలిస్టులను బంధించి చితకబాదారు. బట్టలు విప్పి రక్తం వచ్చేలా కొట్టిరు. తమకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రదర్శనలను ఎందుకు కవర్ చేశారంటూ చిత్రహింసలకు గురి చేశారు.
తాలిబన్లకు వ్యతిరకేంగా మహిళలు కొన్ని రోజులుగా భారీ నిరసన ర్యాలీలు చేపడుతున్నారు. వారిపై తాలిబన్లు బుల్లెట్ల వర్షం కురిసిస్తున్నారు. అయినా మహిళలు వెనక్కి తగ్గడంలేదు. రోడ్లపైకి చేరి గొంతెత్తి నినదిస్తున్నారు. ప్లకార్డులు చేతపట్టి ర్యాలీలుగా వెళుతున్నారు.
తాలిబన్ల బెదిరింపులకు లొంగడం లేదు. వీటిని కవర్ చేసేందుకు తాకీ, నిమెత్ అనే ఇద్దరు జర్నలిస్టులు కాబూల్ నుంచి రిపోర్టు చేస్తున్నారు. తాలిబన్లు జరిపిన కాల్పులను రిపోర్టు చేశారు. అంతే తాలిబన్లకు కోపం వచ్చింది. వారి నిజస్వరూపాన్ని బయటకు తీశారు. ఇద్దరిని పట్టుకుపోయారు. ఒక ప్లేస్‌లో బంధించారు. ఎక్కడికి పారిపోకుండా కట్టేశారు.
చేతికొచ్చిన ఆయుధాలతో చితకబాదారు. గొడ్డును బాదినట్లు కర్రలతో విచక్షణ మరిచి కొట్టారు. కొడుతున్న సమయంలో జర్నిలిస్టులు స్పృహ కోల్పోయారు. అయినా కనికరించలేదు తాలిబన్లు. ఆయుధాలతో కొడుతునే ఉన్నారు.