Music With Plastic : ప్లాస్టిక్ వ్యర్ధాలతో సంగీత వాయిద్యాలు..టర్కీ బృందం వినూత్న ఆలోచన

ప్లాస్టిక్ వ్యార్ధాలకు ఎంతోమంది కొత్త రూపునిస్తున్నారు. అద్భుతమైన కళాఖండాలను తయారు చేస్తున్నారు. ఎక్కడపడితే అక్కడ పారేసి ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను చూసి టర్కీలో కొంతమంది మ్యూజిక్ ప్రియులు కొత్తగా ఆలోచించారు. పారేసిన ప్లాస్టిక్ ఏకంగా ఓ మ్యూజిక్ వాయిద్యాలుగా ఉపయోగిస్తున్నారు. పారేసిన్ ప్లాస్టిక్ డబ్బాలతో డ్రమ్ములు తయారు చేసి చక్కటి మ్యూజిక్ వాయిస్తున్నారు.

Music With Plastic : ప్లాస్టిక్ వ్యర్ధాలతో సంగీత వాయిద్యాలు..టర్కీ బృందం వినూత్న ఆలోచన

Music With Plastic

Music with plastic : ప్లాస్టిక్..ప్లాస్టిక్..ప్లాస్టిక్. ఎక్కడ చూసిన ప్లాస్టిక్ వ్యార్ధాలే. వీటికి ఎంతోమంది కొత్త రూపునిస్తున్నారు. అద్భుతమైన కళాఖండాలను తయారు చేస్తున్నారు. కానీ టర్కీలో కొంతమంది మ్యూజిక్ ప్రియులు మాత్రం కొత్తగా ఆలోచించారు. పారేసిన ప్లాస్టిక్ ఏకంగా ఓ మ్యూజిక్ వాయిద్యాలుగా ఉపయోగిస్తున్నారు. పారేసిన్ ప్లాస్టిక్ డబ్బాలతో డ్రమ్ములు తయారు చేసి చక్కటి మ్యూజిక్ వాయిస్తున్నారు.

టర్కిలోని ఫంగీస్తాన్బుల్ సభ్యులు వారికి దొరికిన ప్లాస్టిక్ డబ్బాలను డ్రమ్స్ గాను..గిటార్లు గాను.. తయారు చేసి ప్లాస్టిక్ డబ్బాలతో వాయిద్యాలను తయారు చేసి చక్కటి మ్యూజిక్ వినిపిస్తున్నారు. ప్లాస్టిక్ డబ్బాలతో గిటార్లు వాయిస్తు..డ్రమ్స్ వాయిస్తూ పర్యావరణం గురించి అవగాహన కల్పిస్తున్నారు. వాటితో మ్యూజిక్ వాయిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు.

ప్లాస్టిక్ వ్యర్థాల సమస్య రోజురోజుకు తీవ్రమవుతున్న క్రమంలో టర్కీకి చెందిన ఒక బృందం ప్లాస్టిక్ సమస్యను పరిష్కరించడానికి వినూత్న మార్గాలను ఉపయోగిస్తోంది. ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారు చేసిన పరికరాలతో సంగీతం వాయిస్తున్నారు. వీరి వినూత్న మ్యూజిక్ లకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ వీడియోలో ముగ్గురు బ్యాండ్ సభ్యులు తమ ప్లాస్టిక్ వ్యర్థాల పరికరాలను ఉపయోగించి మ్యూజిక్ వాయిస్తూ డ్యాన్సులేస్తున్నారు. అలాగే ప్లాస్టిక్ షీట్లతో తయారు చేసిన పసుపు రంగు దుస్తులు ధరించి ప్లాస్టిక్ డబ్బాలతో తయారు చేసిన మ్యూజిక్ వాయిద్యాలనువాయిస్తూ ఆకట్టుకుంటున్నారు. పర్యావరణం గురించి అవగాహన కల్పిస్తున్నారు. ప్లాస్టిక్ వాడకం ఎంత ప్రమాదమో తెలియజేస్తున్నారు.

ఈ సందర్భంగాప్లాస్టిక్ డ్రమ్మర్ హర్మన్ మాట్లాడుతూ.. మన చుట్టూ వాడి పారేసిన ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి ఎంతో ప్రమాదం ఏర్పడుతోంది. అటువంటి వ్యర్ధాల నుంచి మేం మ్యూజిక్ వాయిద్యాలు తయారు చేసి వాటితోనే పర్యావరణం గురించి అవగాహన కల్పిద్దామనుకున్నామని తెలిపారు. ఇది ఓ కొత్త ఆలోచన అని మేం అనుకుంటున్నాం..” అని అన్నారు. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది.