Rangareddy Tragedy: మద్యం తాగకూడదని భర్త మందలించిన పాపానికి భార్య అదే మద్యంలో ఎలుకల మందు కలుపుకుని..
కేసు నమోదు చేసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కిస్మత్ పూర్ గ్రామంలో బెల్టు షాపులు ఎక్కువయ్యాయని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.

రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్, కిస్మత్ పూర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. మద్యం తాగకూడదని భర్త మందలించిన పాపానికి భార్య ఆత్మహత్య చేసుకుంది.
నిన్న భార్య అరుణను భర్త శేఖర్ మందలించాడు. దీంతో అరుణ తీవ్రమనస్తాపానికి గురైంది.
భర్త ఇంట్లోలేని సమయంలో మద్యంలో ఎలుకల మందు కలుపుకుని అరుణ తాగింది. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అరుణ చికిత్స పొందుతూ మృతి చెందింది.
కేసు నమోదు చేసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కిస్మత్ పూర్ గ్రామంలో బెల్టు షాపులు ఎక్కువయ్యాయని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.