MI vs KXIP : పంజాబ్‌దే మ్యాచ్.. సూపర్ డూపర్ విజయం

  • Published By: vamsi ,Published On : October 18, 2020 / 08:22 PM IST
MI vs KXIP : పంజాబ్‌దే మ్యాచ్.. సూపర్ డూపర్ విజయం

[svt-event title=”పంజాబ్‌దే మ్యాచ్.. సూపర్ డూపర్ విజయం” date=”19/10/2020,12:08AM” class=”svt-cd-green” ] ట్రెంట్ బౌల్ట్ వేసిన ఫస్ట్ బంతిని క్రిస్ గేల్ సిక్సర్‌గా మలిచాడు. తర్వాతి బంతిని సింగిల్ తియ్యగా.. మూడవ బంతిని, నాల్గవ మయాంక్ ఫోర్‌లుగా మలిచాడు. దీంతో సూపర్ సూపర్ ఓవర్‌లో విజయం పంజాబ్ వశం అయ్యింది. [/svt-event]

[svt-event title=”క్రీజులోకి క్రిస్ గేల్, మయాంక్ అగర్వాల్” date=”19/10/2020,12:04AM” class=”svt-cd-green” ] ముంబై నిర్దేశించిన 12పరుగుల టార్గెట్ చేధించే క్రమంలో క్రీజులోకి క్రిస్ గేల్, మయాంక్ అగర్వాల్ వచ్చారు. ముంబై తరపున ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ చేస్తున్నారు. [/svt-event]

[svt-event title=”రెండవ సూపర్ ఓవర్‌‌లో పంజాబ్ టార్గెట్ 12″ date=”18/10/2020,11:59PM” class=”svt-cd-green” ] రెండవ సూపర్ ఓవర్‌‌లో పంజాబ్ టార్గెట్ 12గా ఫిక్స్ అయ్యింది. ముంబై సూపర్ ఓవర్‌లో ఒక వికెట్ నష్టపోయి 11పరుగులు చేసింది. [/svt-event]

[svt-event title=”క్రీజులోకి పాండ్యా, పోలార్డ్..” date=”18/10/2020,11:47PM” class=”svt-cd-green” ] ఈసారి సూపర్ ఓవర్ ఆడేందుకు ముంబై జట్టు నుంచి పాండ్యా, పోలార్డ్ వచ్చారు. పంజాబ్ జట్టు నుంచి జోర్దాన్ బౌలింగ్ చేస్తున్నారు. [/svt-event]

[svt-event title=”సూపర్ ఓవర్‌‌లో కూడా టై.. మరో సూపర్ ఓవర్..” date=”18/10/2020,11:47PM” class=”svt-cd-green” ] ముంబై, పంజాబ్ జట్లు మధ్య జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్ కూడా ‘టై’ అయ్యింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 5పరుగులు చెయ్యగా.. తర్వాత బ్యాటింగ్ చేసిన ముంబై కూడా 5పరుగులే చేసింది. దీంతో మరో సూపర్ ఓవర్‌కు రెండు జట్లు సిద్ధం అయ్యాయి. [/svt-event]

[svt-event title=”సూపర్ ఓవర్‌‌లో 5పరుగులు చేసిన పంజాబ్.. ముంబై టార్గెట్ 6″ date=”18/10/2020,11:37PM” class=”svt-cd-green” ] సూపర్ ఓవర్‌లో ముంబైకు టార్గెట్ ఇచ్చేందుకు పంజాబ్‌ జట్టు తరఫున కేఎల్ రాహుల్, పూరన్ క్రీజులోకి రాగా.. 6 బంతుల్లో 2 వికెట్లు కోల్పోయి 5 పరుగులు చేసింది. దీంతో ముంబయి టార్గెట్ 6 బంతుల్లో 6పరుగులుగా ఫిక్స్ అయ్యింది. [/svt-event]

[svt-event title=”మరో సూపర్ ఓవర్ మ్యాచ్..” date=”18/10/2020,11:23PM” class=”svt-cd-green” ] ఉత్కంఠగా సాగిన పంజాబ్‌ ముంబయి మధ్య మ్యాచ్‌ టైగా‌ మారింది.. ఇవాళ(18 అక్టోబర్ 2020) ఇది రెండవ సూపర్ ఓవర్ మ్యాచ్.. చివరి ఓవర్‌లో 9 పరుగులు అవసరం అవ్వగా పంజాబ్‌ 8 పరుగులు మాత్రమే చేసింది. దీంతో మ్యాచ్ సూపర్‌ ఓవర్‌కు దారితీసింది. ఈ రోజు డబుల్ హెడర్‌లో మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌ కూడా సూపర్ ఓవర్‌కు దారి తీయగా.. ఆ మ్యాచ్‌లో కోల్‌కత్తా విజయం సాధించింది. [/svt-event]

[svt-event title=”డికాక్‌ పోరాటం.. పోలార్డ్ మెరుపులు.. పంజాబ్ టార్గెట్ 177″ date=”18/10/2020,9:32PM” class=”svt-cd-green” ] కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ 38 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినా.. తర్వాత నిలబడి చివరకు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. ఒక దశలో క్రీజులో ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌, మరో బ్యాట్స్‌మన్‌ కృనాల్‌ పాండ్య నిలబడి ఇన్నింగ్స్‌ను నడిపించారు. కృనాల్ పాండ్య (34; 30 బంతుల్లో, 4×4, 1×6)తో కలిసి ఓపెనర్‌ డికాక్‌ (53; 43 బంతుల్లో, 3×4, 3×6) ఆడడంతో మంచి స్కోరు కొట్టడానికి ముంబైకి అవకాశం వచ్చినట్లుగా అయ్యింది. పంజాబ్‌ బౌలర్లను ధాటిగా ఎదుర్కోగా ముంబై స్కోరు బోర్డుపై పరుగులు పెట్టింది.

ఈ క్రమంలో 14 ఓవర్లకు ముంబై 4 వికెట్లకు 102 పరుగులు మాత్రమే చెయ్యగా.. ఆఖరి ఓవర్లలో పొలార్డ్‌ (34*; 12 బంతుల్లో, 1×4, 4×4), కౌల్టర్‌నైల్‌ (24*, 12 బంతుల్లో, 4×4) దంచికొట్టడంతో పంజాబ్‌ 177 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రోహిత్‌ శర్మ (9), సూర్యకుమార్ (0), ఇషాన్‌ కిషన్‌ (7) విఫలం అవగా.. డికాక్‌ నిలకడగా ఆడి 39 బంతుల్లో అర్ధశతకాన్ని సాధించాడు.

హార్దిక్‌ పాండ్య(8)ను షమి, డికాక్‌ను జోర్డాన్‌ వరుస ఓవర్లలో అవుట్ చేశారు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కౌల్డర్‌నైల్‌తో కలిసి పొలార్డ్‌ చెలరేగి ఆడాడు. అర్షదీప్ వేసిన 18వ ఓవర్‌లో పొలార్డ్‌ రెండు సిక్సర్లు, కౌల్టర్ నైల్‌ రెండు ఫోర్‌లు బాదగా.. వీరిద్దరి ధాటికి ఆఖరి మూడు ఓవర్లలో 54 పరుగులు స్కోరు బోర్డులో చేరాయి.

పంజాబ్‌ బౌలర్లలో షమి, అర్షదీప్‌ చెరో రెండు వికెట్లు, జోర్డాన్‌, బిష్ణోయ్‌ చెరో వికెట్ తీశారు. పంజాబ్ టార్గెట్ 177పరుగులుగా అయ్యింది. [/svt-event]

[svt-event title=”ముంబై ఇండియన్స్ Playing XI -” date=”18/10/2020,8:08PM” class=”svt-cd-green” ] కెఎల్ రాహుల్ (కెప్టెన్/వికెట్ కీపర్), మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, నికోలస్ పూరన్, గ్లెన్ మాక్స్‌వెల్, దీపక్ హుడా, మురుగన్ అశ్విన్, క్రిస్ జోర్డాన్, రవి బిష్ణోయ్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్. [/svt-event]

[svt-event title=”ముంబై ఇండియన్స్ Playing XI -” date=”18/10/2020,8:08PM” class=”svt-cd-green” ] క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, క్రునాల్ పాండ్యా, నాథన్ కౌల్టర్ నైల్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా. [/svt-event]

[svt-event title=”IPL 2020 MI vs KXIP: ” date=”18/10/2020,8:07PM” class=”svt-cd-green” ] ఐపిఎల్ 2020లో 36 వ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు మొదట బౌలింగ్ చేస్తోంది. ఎటువంటి మార్పులు లేకుండా ఈ మ్యాచ్‌లోకి ఇరు జట్లు తలపడుతున్నాయి. [/svt-event]

[svt-event title=”ముంబై మెరిసేనా? పంజాబ్ గెలిచేనా? ” date=”18/10/2020,8:10PM” class=”svt-cd-green” ] రసవత్తరంగా సాగుతున్న క్రికెట్‌ లీగ్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. దుబాయ్‌ వేదికగా ముంబయి, పంజాబ్‌ జట్లు తలపడనున్నాయి. [/svt-event]