Rajasthan vs PBKS, Preview: రాయల్స్ vs కింగ్స్, గెలిచేదెవరు? ప్రీవ్యూ!

Rajasthan vs PBKS, Preview: రాయల్స్ vs కింగ్స్, గెలిచేదెవరు? ప్రీవ్యూ!

Ipl 2021

RR vs PBKS: ఐపిఎల్ 2021లో నాల్గవ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మరికాసేపట్లో(రాత్రి 7గంటల 30నిమిషాలకు) ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. ఐపీఎల్ 2021లో ఇరుజట్ల మధ్య జరగబోతున్న ఫస్ట్ మ్యాచ్ ఇదే కాగా.. ఇద్దరూ విజయంతో తమ ప్రయాణాన్ని ప్రారంభించాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. పంజాబ్, రాజస్థాన్ జట్ల బలం వారి బ్యాటింగ్. అటువంటి పరిస్థితిలో.. ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారొచ్చని అభిమానులు ఆశిస్తున్నారు.

పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు ప్లేయింగ్ లెవెన్‌ను ఎన్నుకోవడం చాలా కష్టమైన పని.. నలుగురు విదేశీ ఆటగాళ్లను ఎవరిని తీసుకోవాలి అనేది కష్టమైన పని. ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్‌మన్ డేవిడ్ మలన్‌కు టీ20 ఇంటర్నేషనల్‌లో అవకాశం లభిస్తుందో లేదో చూడాలి. అలాగే ప్లేయింగ్ ఎలెవన్లో మలన్‌కు చోటు లభిస్తే, క్రిస్ గేల్ బయట కూర్చోవలసి ఉంటుంది.

రాజస్థాన్ విషయానికి వస్తే.., జోస్ బట్లర్, బెన్ స్టోక్స్, క్రిస్ మోరిస్ మరియు రెహ్మాన్‌లకు అవకాశం దక్కుతుంది. అయితే ఓపెనింగ్‌కు ఎవరు పంపాలి అనేది సంజూ శాంసన్ ముందు ఉన్న అతిపెద్ద ప్రశ్న. ముంబైలోని వాంఖడే స్టేడియంలోని పిచ్ బ్యాట్స్‌మెన్‌లకు అనుకూలంగా ఉంటుంది. అయితే, స్టార్టింగ్‌లో ఫాస్ట్ బౌలర్లకు పిచ్ అనుకూలంగా ఉంటుంది. కానీ బంతి పాతదైన వెంటనే బ్యాటింగ్‌కు సులభం అవుతుంది. మంచు ప్రభావంతో, టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకోవచ్చు.

Rajasthan Royals(Probable XI): Jos Buttler (wk), Ben Stokes, Sanju Samson (c), Riyan Parag, Shivam Dube, Rahul Tewatia, Chris Morris, Liam Livingstone, Shreyas Gopal, Jaydev Unadkat, Kartik Tyagi

Punjab Kings(Probable XI): KL Rahul (c, wk), Mayank Agarwal, Chris Gayle, Nicholas Pooran, Deepak Hooda, Shahrukh Khan, Moises Henriques, Murugan Ashwin, Mohammed Shami, Riley Meredith, Ravi Bishnoi

ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌కు పైచేయి ఉండవచ్చు. ఇరు జట్లు చాలా బలంగా కనిపిస్తున్నప్పటికీ, ఈ మ్యాచ్‌లో పంజాబ్ విజయం సాధించే అవకాశం ఉంది. పిచ్ చూస్తే, ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్లు రావచ్చు. సెకెండ్ బ్యాటింగ్‌కు వచ్చే జట్లకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.