Germany : 84 ఏళ్ళ వృద్ధుడికి 2.2కోట్ల జరిమానా… ఎందుకో తెలిస్తే షాక్

మరోవైపు వృద్ధుడి ఇంట్లో దొరికిన రెండవ ప్రపంచ యుద్ధకాలం నాటి యుద్ధ ట్యాంకుతోపాటు, ఇతర పురాతనమైన ఆయుధాలను కొనుగోలు చేసేందుకు ఓ మ్యూజియం ఆసక్తి చూపిస్తుంది.

Germany : 84 ఏళ్ళ వృద్ధుడికి 2.2కోట్ల జరిమానా… ఎందుకో తెలిస్తే షాక్

Germany

Germany : వయసుపైబడి వృద్ధాప్యంలో ఇంటిపటునుంటూ కృష్ణా,రామా అనుకునే వయస్సులో ఓ వృద్ధుడికి పెద్ద కష్టమే వచ్చిపడింది. ఇతనికి సంబంధించిన అసలు కధ తెలుసుకుంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళితే జర్మనీ దేశంలోని కైల్ ప్రాంతానికి చెందిన 84 సంవత్సరాల వృద్ధుడు ఇంటిలో రెండవ ప్రపంచ యుద్ధకాలంనాటి యుద్ధ ట్యాంక్ తోపాటు, యాంటీ ఎయిర్ క్రాఫ్ గన్ ఇతర వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 2015లో ఈ ఘటన జరగగా ఆకేసులో న్యాయ స్ధానం తీర్పు వెలువరించింది. 2.2కోట్ల రూపాయల జరిమానా విధించింది.

జర్మన్ గోప్యతా చట్టాల ప్రకారం వృద్ధుడి పేరును వెల్లడించని జర్మన్ వార్తా సంస్ధ డిపిఎ ఈ కేసుకు సంబంధించిన వివరాలను ప్రచురించింది. వృద్ధుని నివాసంలో లభించిన ఆయుధాలు అన్నీ వాడుకలో లేనివిగా న్యాయవాది తెలిపారు. యుద్ద ట్యాంకును క్రాప్ గా భావించి ఇంట్లో ఉంచారని జరిమానా మొత్తాన్ని తగ్గించాలని న్యాయవాది కోర్టును కోరారు. మరోవైపు స్వాధీనం చేసుకున్న ఆయుధాలన్నీ పనిచేసే కండీషన్ లోనే ఉన్నాయని పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పారు. మరోవైపు వృద్ధుడు జర్మనీ ఆయుధాల నియంత్రణ చట్టాన్ని ఉల్లంఘించాడా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు వృద్ధుడి ఇంట్లో దొరికిన రెండవ ప్రపంచ యుద్ధకాలం నాటి యుద్ధ ట్యాంకుతోపాటు, ఇతర పురాతనమైన ఆయుధాలను కొనుగోలు చేసేందుకు ఓ మ్యూజియం ఆసక్తి చూపిస్తుంది. అదే సమయంలో జర్మనీకి చెందిన చాలా మంది వృద్ధుడి ఇంట్లో లభించిన వస్తువులను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. న్యాయస్ధానం ఈ ఆయుధాలను విక్రయించేందుకు రెండేళ్ళ గడువు విధించింది.

ఇదిలావుంటే వృద్ధుని ఇంట్లో బేస్ మెంట్ క్రింద ఉన్న ఈ అయుధాలను బయటకు తీసేందుకు 20 మంది 9మందిగంటలపాటు శ్రమించాల్సి వచ్చింది. బెర్లిన్ కి చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారం తోనే అధికారులు వృద్ధుని ఇంటిపై దాడులు చేసి ఈ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.