Oil Plantation Partnership: అస్సాం ప్రభుత్వంతో ఆయిల్ ప్లాంటేషన్ భాగస్వామ్యం.. ఈశాన్య వ్యవసాయ రంగంలో మార్పు తెస్తామంటూ ప్రకటన

ఆయిల్ పామ్ అభివృద్ధి, ప్రాసెసింగ్ పరిశ్రమ పట్ల వారి నిబద్ధతకు గుర్తింపుగా 3F ఆయిల్ పామ్ ఇప్పటికే డిసెంబర్ 2022లో అస్సాం ప్రభుత్వంతో MOU కుదుర్చుకుంది. NMEO-OPలో భాగంగా లఖింపూర్, చిరాంగ్ జిల్లాలలో సబ్-జోన్ 1-b, V-aలో ఆయిల్ పామ్ తోటలు, ప్రాసెసింగ్ సౌకర్యాలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Oil Plantation Partnership: అస్సాం ప్రభుత్వంతో ఆయిల్ ప్లాంటేషన్ భాగస్వామ్యం.. ఈశాన్య వ్యవసాయ రంగంలో మార్పు తెస్తామంటూ ప్రకటన

Updated On : June 6, 2023 / 8:33 PM IST

Assam Govt: అస్సాం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ – ఆయిల్ పామ్ (NMEO-OP) కింద ఆయిల్ పామ్ యొక్క ప్లాంటేషన్‌ వేడుకను నిర్వహించింది ఆయిల్ పామ్ ప్లాంటేషన్, ప్రాసెసింగ్ కంపెనీ 3F ఆయిల్ పామ్. అస్సాం వ్యవసాయ, ఉద్యానవన శాఖ మంత్రి అతుల్ బోరా సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.

WTC Final 2023: డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌లో రోహిత్ శ‌ర్మ‌ ఒక్క బంతిని స‌రిగ్గా క‌నెక్ట్ చేసినా చాలు..

3F ఆయిల్ పామ్ అస్సాంలో NMEO-OP కింద మొదటి ఆయిల్ పామ్ ప్లాంటేషన్‌గా లఖింపూర్ జిల్లాను గుర్తించారు. ఈ కార్యక్రమం ద్వారా వ్యవసాయ కమ్యూనిటీలను ఉద్ధరించడం, వంట నూనెలలో భారతదేశ స్వావలంబనకు దోహదం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది ఆయిల్ పామ్ ప్లాంటేషన్ రంగం అభివృద్ధి, పురోగతికి ప్రభుత్వ నిబద్ధతను ఇస్తుందని మంత్రి అతుల్ అన్నారు.

Odisha Train Accident: విపక్షాలు రైల్వే మంత్రి రాజీనామా కోరుతుంటే శభాష్ అంటూ సపోర్ట్ చేసిన మాజీ ప్రధాని