Delhi Mayor: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఆప్ .. ఢిల్లీ మేయర్ అభ్యర్థిగా షెల్లీ ఒబెరాయ్‌

ఢిల్లీ మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థుల పేర్లను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శుక్రవారం ప్రకటించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం.. మహిళను మేయర్ అభ్యర్థిగా ప్రకటిస్తూ ఆప్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.

Delhi Mayor: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఆప్ .. ఢిల్లీ మేయర్ అభ్యర్థిగా షెల్లీ ఒబెరాయ్‌

Shelly Oberoi as AAP candidate for Mayor of Delhi

Delhi Mayor: ఢిల్లీ మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థుల పేర్లను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శుక్రవారం ప్రకటించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం.. మహిళను మేయర్ అభ్యర్థిగా ప్రకటిస్తూ ఆప్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ మేయర్ పదవికి షెల్లీ ఒబెరాయ్ ను ప్రకటించిన ఆప్.. మాటియా మహల్ ఎమ్మెల్యే షోయిబ్ ఇక్బాల్ కుమారుడు ఆలే మొహమ్మద్ ఇక్బాల్ ను డిప్యూటీ మేయర్ ఆప్ నామినేట్ చేసింది.

Delhi LG Vs AAP: కేజ్రీవాల్ ప్రభుత్వానికి షాకిచ్చిన ఢిల్లీ ఎల్‌జీ.. ఆప్ నుంచి రూ. 97కోట్లు రికవరీ చేయాలట ..

షెల్లీ ఒబెరాయ్ వయస్సు 39ఏళ్లు. ఆమె ఢిల్లీ మున్సిపాలిటీ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేశారు. 86వ వార్డు తూర్పు పటేల్ నగర్ నుండి పోటీ చేసి విజయం సాధించింది. షెళ్లీ ఒబెరాయ్ ఉన్నత విద్యావంతురాలు. ఇండియన్ కామర్స్ అసోసియేషన్ లో లైఫ్ టైం మెంబర్. ఇందిరా గాంధీ ఒపెన్ యూనివర్శిటీ నుంచి ఆమె స్కూల్ మేనేజ్ మెంట్ స్టడీస్ లో పీహెచ్ డీ చేశారు. ఐసీఏ కాన్ఫరెన్స్ నుంచి గోల్డ్ మెడల్ ను అందుకున్నారు. అంతేకాక.. అంతర్జాతీయ, దేశీయ సదస్సుల నుంచి ప్రశంసలు సైతం దక్కించుకున్నారు.

Delhi MCD Elections: 15ఏళ్ల కాషాయ కోటను బద్దలు కొట్టిన ఆప్.. ఢిల్లీ కార్పొరేషన్ పీఠం కైవసం

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు ఇటీవల వెలువడ్డాయి. గత పదిహేనేళ్ల బీజేపీ ఆధిపత్యానికి చెక్ పెడుతూ ఢిల్లీ ప్రజలు ఆప్ కు మున్సిపల్ కార్పొరేషన్ పగ్గాలు అప్పగించారు. మొత్తం 250 వార్డులకు గాను ఆప్ 134 వార్డుల్లో విజయం సాధించగా, బీజేపీ 104, కాంగ్రెస్ తొమ్మిది వార్డుల్లో విజయం సాధించింది. ఆప్ కు భారీ మెజార్టీ ఉండటంతో మేయర్ పదవికి పోటీ పెట్టేందుకు బీజేపీ ముందుకు రాలేదు. దీంతో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా షెల్లీ ఒబెరాయ్ ఖాయమైంది.