Action Movies: యాక్షన్ ఫార్ములా.. వయొలెన్స్ కావాలంటోన్న టాప్ స్టార్స్!

ఇండస్ట్రీ ఏదైనా హీరోలిప్పుడు యాక్షన్ బాట పడుతున్నారు. భారీ ఫైట్స్, మాస్ ఎలివేషన్స్ తో యాక్షన్ హీరోలు అనిపించుకోవాలనేది స్టార్స్ ప్లాన్. ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యే కథతో పాటే యాక్షన్ ఎపిసోడ్స్ అదుర్స్ అనిపిస్తే ఇప్పుడు సినిమా హిట్టే.

Action Movies: యాక్షన్ ఫార్ములా.. వయొలెన్స్ కావాలంటోన్న టాప్ స్టార్స్!

Action Movies

Action Movies: ఇండస్ట్రీ ఏదైనా హీరోలిప్పుడు యాక్షన్ బాట పడుతున్నారు. భారీ ఫైట్స్, మాస్ ఎలివేషన్స్ తో యాక్షన్ హీరోలు అనిపించుకోవాలనేది స్టార్స్ ప్లాన్. ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యే కథతో పాటే యాక్షన్ ఎపిసోడ్స్ అదుర్స్ అనిపిస్తే ఇప్పుడు సినిమా హిట్టే. సో సేమ్ ఫార్ములాను గతంలో ఫాలో అయినా ఇప్పుడు దానికి మరింత పదును పెడుతున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ అనే తేడా లేకుండా రఫ్ఫాడించటమే లక్ష్యంగా దూసుకుపోతున్నారు స్టార్ హీరోలు.

South Movies: హిందీలో సౌత్ సినిమాల రికార్డులు.. నోరుపారేసుకుంటున్న బాలీవుడ్ క్రిటిక్స్!

ఐ డోంట్ లైక్ వయొలెన్స్ అంటూనే గూజ్ బంప్స్ తెప్పించాడు రాఖీబాయ్. కేజీఎఫ్ ఫ్రాంచైజ్ ఇచ్చిన బూస్టప్ మామూలుది కాదు. సరైన కంటెంట్ కు భారీ యాక్షన్ ఎపిసోడ్స్, మేజర్ ఫైట్ సీక్వెన్స్ తోడైతే మాస్, క్లాస్ అని తేడా లేకుండా ఆడియెన్స్ ఎలా ఎంజాయ్ చేస్తారనేది మరోసారి కేజీఎఫ్2 గుర్తుచేసింది. గరుడ, అధీరా, ముంబై గ్రూప్, నారాచీ విలన్స్ తో రాకింగ్ స్టార్ యశ్ తలపడుతుంటే సీట్ ఎడ్జ్ లో కూర్చుని అడియెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇలాంటి యాక్షన్ డ్రామాలు ఇంకా ఇంకా చేయాలనుందని యశ్ చెప్తున్నాడంటే.. తనకొచ్చిన కిక్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడొచ్చిన స్టార్ డంను నిలబెట్టుకోవాలంటే మళ్లీ కొత్త పంథాలో యాక్షన్ చూపించాలని డిసైడ్ అయ్యాడు యశ్.

Postponed Movies: అటకెక్కిన సినిమాలు.. సర్ సర్లే ఎన్నెన్నో అనుకుంటాం!

అరడగుల కటౌట్ అవలీలగా యాక్షన్ ఎపిసోడ్స్ చేస్తుంటే ఫ్యాన్స్ లో పునకాలే కాదా. సాలిడ్ యాక్షన్ ఎలిమెంట్స్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిన గ్లోబల్ స్టార్.. రాధేశ్యామ్ లో లవ్ ట్రాక్ నడిపిస్తే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయలేదు. మిర్చి, బాహుబలి, సాహో లాంటి పవర్ ప్యాక్డ్ మూవీస్ లో యాక్షన్ అదరగొట్టిన ప్రభాస్.. నెక్ట్స్ ప్రాజెక్ట్స్ కూడా యాక్షన్ మోడ్ లోనే ఉండబోతున్నాయి. ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబోలో వస్తోన్న మాస్ మసాలా సలార్ కోసం అందుకే ప్రేక్షకులు అంతలా ఎదురుచూస్తున్నారు. ప్రాజెక్ట్ కెతో పాటూ ఆదిపురుష్, స్పిరిట్ వంటి సినిమాల్లోనూ హై వోల్డెజ్ తో కనిపించే డార్లింగ్ నే ఫ్యాన్స్ చూడబోతున్నారు.

Bollywood Movies: బాలీవుడ్ కి చేతకావట్లేదా? సౌత్ ను చూసి నేర్చుకోవాల్సిందేనా?

లవర్ బాయ్, ఫ్యామిలీ గయ్ ఇమేజ్ ను పక్కనబెట్టేసి.. బరిలోకి దూకి దుమ్మురేపాలనే ఆలోచిస్తున్నారు స్టార్స్. అయితే కంటెట్ లో కూడా బలముంటేనే సక్సెస్ రేట్ ఎక్కువన్నది ఇక్కడ పాయింట్. గతంలో చేసినా.. ట్రిపుల్ ఆర్ తో యాక్షన్ హీరోలుగా పాన్ ఇండియాకు ఎక్స్ పోజ్ అయిన చరణ్, తారక్ తర్వాతి సినిమాలను యాక్షన్ మోడ్ లోనే నడిపించబోతున్నారు. ఆచార్యతో కలిసి సిద్ధగా ఫైట్ సీక్వెన్స్ అదరగొట్టబోతున్నాడు. శంకర్ మేకింగ్ లో తెరకెక్కుతోన్న సినిమాలో చరణ్ భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో సర్ ప్రైజ్ చేయబోతున్నారు. ఒక్క యాక్షన్ ఎపిసోడ్ కోసమే శంకర్ 10 కోట్లు ఖర్చు పెట్టిస్తున్నాడంటే ఏ రేంజ్ లో ప్లాన్ చేసాడో తెలుస్తోంది.

Malty starrer Movies: వచ్చేస్తున్న టాప్ స్టార్ మల్టీస్టారర్ కాంబినేషన్స్!

తారక్ కూడా తక్కువేమి తినలేదు. ఆల్రెడీ రాజమౌళి లాంటి టాప్ డైరెక్టర్స్ సినిమాలతో పవర్ ప్యాక్డ్ కంటెంట్ చూపించిన ఎన్టీఆర్.. ట్రిపుల్ ఆర్ మ్యానియాను నిలబెట్టుకోవాలనుకుంటున్నారు. అందుకే నెక్ట్స్ ప్రాజెక్ట్స్ విషయంలో ఆచీతూచీ అడుగేస్తున్న తారక్.. సాలిడ్ స్టోరీలకే ఓటేస్తున్నాడు. 300 కోట్ల బడ్డెత్ తో కొరటాల శివ తెరకెక్కించే మూవీ.. యాక్షన్ పరంగా పాన్ ఇండియా ఆడియెన్స్ ను మెస్మరైజ్ చేస్తుందంటున్నారు. ఆపై ప్రశాంత్ నీల్ తో చేయబోయే మూవీ కూడా పూర్తిస్థాయి యాక్షన్ మూవీగా ఉండబోతుంది.

Star Heroes Movies: కేజీఎఫ్ టెర్రర్.. అంతకుమించిన అంచనాలతో కొత్త సినిమాలు!

ఎలాంటి ఎక్స్ పెక్టేషన్ల్ లేకుండా పుష్ప నేషనల్ లెవెల్ ఆడియెన్స్ ను ఎంగేజ్ చేసిందంటే కారణం యాక్షన్ మ్యానియానే. సుకుమార్ స్క్రీన్ ప్లేలో ఐకాన్ స్టార్ అదరగొట్టారు కాబట్టే జనం అంతలా కనెక్ట్ అయ్యారు. పుష్ప పార్ట్ 2 ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లర్ లా తనదైన స్లైల్ లో బన్నీ మాస్ లుక్.. హై ఎనర్జీ ఎలివేషన్ సీన్స్, భారీ సీక్వెన్స్ లు అందరినీ అలరించాయి. అందుకే నెక్ట్స్ ప్రాజెక్ట్స్ అంతకుమించి అనేలా అల్లు అర్జున్ ప్లాన్ చేస్తున్నారు.

Tamil Movies: అరవ హీరోల రొటీన్ ఫార్ములా.. ఎన్నాళ్లీ రొడ్డకొట్టుడు సామీ!

సర్కారు వారి పాటలో కూడా భారీ ఛేజింగ్ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయనేది ఇన్ సైడ్ టాక్. అదే నిజమైతే మహేశ్ ఫ్యాన్స్ రెచ్చిపోతారు. అయితే సూపర్ స్టార్ ను పాన్ ఇండియా లెవెల్ లో పవర్ డైనమైట్ గా చూడాలంటే మాత్రం రాజమౌళితో చేయబోయే సినిమా వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇంటర్నేషనల్ కంటెంట్ తో భారీ యాక్షన్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్ లో మహేశ్ నెవర్ బిఫోర్ యాక్షన్ లుక్ ను జక్కన్న ప్రెజెంట్ చేయబోతున్నారు.

High Budget Movies: కంటెంట్ లేదా.. హైఎండ్ వాల్యూస్ ఉన్నా బూడిదలో పోసిన పన్నీరే!

హిందీ హీరోలకు యాక్షన్ ఎపిసోడ్స్ చేయడం కొత్తేం కాదు. సల్మాన్ యాక్షన్ మూవీస్ అంటే ఇష్టమని తారక్ రీసెంట్ గా పొగిడారు కూడా. టైగర్ ఫ్రాంచైజ్ తో పాటూ దబాంగ్, అంతిమ్, సుల్తాన్, కిక్ లాంటి ప్రాజెక్ట్స్ తో పవర్ చూపించాడు సల్లూభాయ్. ఇప్పుడు కూడా టైగర్ 3ను హై ఎనర్జీతో రెడీ చేస్తున్నాడు. మనీశ్ శర్మ డైరెక్షన్ లో ఇదివరకటి టైగర్ సినిమాలను మించిన యాక్షన్ ఛేజింగ్ సీన్స్ లో సల్మాన్ కనిపించబోతున్నాడు. ఇమ్రాన్ హష్మీతో ఈయనకి హై ఇంటెన్స్ సీన్స్ ప్లాన్ చేసారని టాక్. 2023 ఏప్రిల్ 21న ఈమూవీ రిలీజ్ కాబోతుంది.

Pan India Movies: అప్‌నే టైమ్ ఆగయా.. బాలీవుడ్ బెండు తీస్తున్న సౌత్ మూవీస్!

షారుఖ్, హృతిక్ లాంటి హీరోలు కూడా భారీ యాక్షన్ సినిమాలను లైన్ లో పెట్టారు. డైరెక్టర్ సిద్దార్ధ్ ఆనంద్ తో ఈ ఇద్దరు హీరోలు చేసే రెండు సినిమాలు కూడా హై ఎండ్ యాక్షన్ మోడ్ లోనే మేకోవర్ అవుతున్నాయి. ఫైటర్, పఠాన్.. ఈ రెండింటిలోనూ దీపికానే హీరోయిన్. వార్ తర్వాత సిద్ధార్ధ్ ఆనంద్ తో ఫైటర్ చేస్తున్నాడు హృతిక్ రోషన్. 2023 సెప్టెంబర్ 28న యాక్షన్ బాంబ్ ఫైటర్ థియేటర్స్ కి రాబోతుంది. అయితే అంతకన్నా ముందే సైఫ్ తో కలిసి హృతిక్ నటిస్తోన్న మరో హై వోల్డెజ్ మూవీ విక్రమ్ వేదా రీమేక్ ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక షారుఖ్ ఫ్యాన్స్ మోస్ట్ అవైటైడ్ యాక్షన్ అడ్వంచరస్ పఠాన్ నెక్ట్స్ ఇయర్ జనవరి 25న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.