Pan India Movies: అప్‌నే టైమ్ ఆగయా.. బాలీవుడ్ బెండు తీస్తున్న సౌత్ మూవీస్!

బాలీవుడ్ ఆలోచనలో పడింది. సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు సౌత్ ఈరేంజ్ లో ఎలా దూసుకుపోతోందా అని తెగ థింక్ చేస్తున్నారు. మొన్న మొన్నటి వరకూ బాలీవుడ్ ని చూసి ఇన్ స్పైర్ అయ్యో, కాపీ..

Pan India Movies: అప్‌నే టైమ్ ఆగయా.. బాలీవుడ్ బెండు తీస్తున్న సౌత్ మూవీస్!

Pan India Movies

Pan India Movies: బాలీవుడ్ ఆలోచనలో పడింది. సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు సౌత్ ఈరేంజ్ లో ఎలా దూసుకుపోతోందా అని తెగ థింక్ చేస్తున్నారు. మొన్న మొన్నటి వరకూ బాలీవుడ్ ని చూసి ఇన్ స్పైర్ అయ్యో, కాపీ కొట్టో.. అప్ డేట్ అవుతున్న సౌత్ సినిమా ఇప్పుడు బాలీవుడ్ ని డామినేట్ చేసేంత రేంజ్ కి వెళ్లిపోయింది. అంతేకాదు.. బాలీవుడ్ లోనే.. బాలీవుడ్ సినిమాల్ని ఓవర్ కమ్ చేసి పాతుకుపోతోంది సౌత్. ఇంతకీ బాలీవుడ్ ఎందుకు..? ఏ విషయంలో వెనకబడిపోతోంది..?

Pan India Movies: మారిన ఆడియన్స్ టేస్ట్.. మెప్పించడం అంత ఈజీకాదు!

సౌత్ రేంజ్ మారిపోయింది.. ఒకప్పుడు బాలీవుడ్ వైపు చూసి ఇన్ స్పైర్ అయ్యిన సౌత్ ఇప్పుడు ఇండియన్ సినిమానే తన వైపుకు తిప్పుకుంది. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోల సినిమాలు కూడా పక్కన పెట్టి సౌత్ సినిమాలు చూస్తున్నారు. సల్మాన్ అన్తిమ్, రణవీర్ సింగ్ 83, అక్షయ్ బచ్చన్ పాండే సినిమాల్ని బాలీవుడ్ ఆడియన్స్ ఏమాత్రం పట్టించుకోలేదు. అంతలా బాలీవుడ్ ఆడియన్స్ ని ఇంపాక్ట్ చేస్తోంది సౌత్ సినిమా. పుష్ప దగ్గరనుంచి లేటెస్ట్ గా రిలీజ్ అయిన ట్రిపుల్ ఆర్ వరకూ బాలీవుడ్ లో బాక్సాఫీస్ బెండు తీసిన సినిమాలే. దాంతో ఒక్కసారిగా ఆలోచినలో పడ్డారు సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు. బాలీవుడ్ సినిమాలు ఎందుకు ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చెయ్యలేకపోతోందా అని డిస్కషన్స్ స్టార్ట్ చేశారు.

Pan India Movies: టాలీవుడ్ పాన్ ఇండియా క్రేజ్.. కుళ్ళుకుంటున్న బాలీవుడ్!

సౌత్ సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ కి బొక్కలు పెడుతుంటే.. నార్త్ సినిమాలు అస్సలు సౌత్ లో ఏమాత్రం ఇంపాక్ట్ క్రియేట్ చెయ్యలేకపోతున్నాయి. ఇదే విషయాన్ని బలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఓపెన్ గా చెప్పారు. బాలీవుడ్ సినిమాలు సౌత్ లో అంతగా వర్కవుట్ అవ్వడం లేదు.. కానీ సౌత్ మాత్రం బాలీవుడ్ లో స్టామినా చూపిస్తోందంటున్నారు సల్మాన్. స్పెషల్లీ సౌత్ ఇండస్ట్రీలో హీరోయిజం ఎక్కువగా ఉండే సినిమాలు తీస్తున్నారు. కానీ బాలీవుడ్ ఎక్కడో మిస్ ఫైర్ అవుతోంది. నార్త్ లో కూడా మూవీ మేకింగ్ స్టైల్ మారాలి. వపర్ ఫుల్ సబ్జెక్ట్ రావాలి అంటూ ఓపెన్ గానే సౌత్ ని తెగ పొగిడేశారు సల్మాన్.

Pan India Movies: మన సినిమాకి మార్కెట్ క్రియేటర్లుగా పరభాషా నటులు!

అంతేకాదు.. బాలీవుడ్ ని డైరెక్ట్ గా తిట్టకుండానే.. చురకలు అంటించారు సల్మాన్. సౌత్ రైటర్లు చాలా కష్టపడి డిఫరెంట్ కాన్సెప్ట్ లతో ముందుకు వస్తున్నారని, బాలీవుడ్ కూడా ఇలాంటి గూస్ బంప్స్ వచ్చే స్టోరీస్ ని చెయ్యాలని మనసులో మాట చెప్పారు సల్మాన్. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రస్తుతం చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేస్తూ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు.

Tollywood Big Movies: ఎంత తోప్ సినిమా అయినా.. లెక్కలు తేల్చేది ప్రేక్షకులే!

ఒకప్పుడు బాలీవుడ్ లో యాక్షన్ మూవీస్ చేస్తే.. అదే ఇన్ స్పిరేషన్ తో సౌత్ లో సినిమాలు చేసేవాళ్లు. అలా బాలీవుడ్ లో ఏ ఫార్ములా వర్కవుట్ అయితే సౌత్ లో కూడా దాన్నే ఫాలో అయ్యేవాళ్లు. సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన దబంగ్ సినిమాని తెలుగులో గబ్బర్ సింగ్ గా తీసి సూపర్ హిట్ కొట్టారు పవన్ కళ్యాణ్. ఇలా చాలా మంది టాలీవుడ్ స్టార్ హీరోలు బాలీవుడ్ మూవీస్ ని రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ సంపాదించారు.

Postpone Movies: క్రేజీ కాంబినేషన్స్.. కానీ సెట్స్ మీదకెళ్ళడం చాలా లేట్!

కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. సౌత్ సినిమాల్ని వరసగా బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. బాలీవుడ్ సినిమాల రీమేక్ తో పాటు.. బాలీవుడ్ స్టార్లని సౌత్ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టుల్ని చేసేంత రేంజ్ కి వెళ్లిపోయింది సౌత్ సినిమా. మొన్న రిలీజ్ అయ్యి రికార్డులు సెట్ చేస్తున్న ట్రిపుల్ ఆర్ లో జస్ట్ 10 నిమిషాల రోల్ కోసం అజయ్ దేవ్ గన్, ఆలియా లాంటి స్టార్లు యాక్ట్ చేశారు. రాజమౌళి సినిమాలో ఏ క్యారెక్టర్ అయినా ఓకే, ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ పక్కన ఏ మూవీ అయినా ఓకే అనే రేంజ్ లో తెలుగు క్రేజ్ పెరిగిపోయింది.

Telugu Dubbing Movies: నేషనల్ వైడ్ తెలుగు సినిమా డబ్బింగ్ మేళా

ఒక్కటనే కాదు.. సౌత్ ఏ సినిమా చేసినా హిట్టే. అంతేకాదు.. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్.. కూడా సౌత్ మీద తెగ ప్రేమ పెంచుకంటున్నారు. ఆల్రెడీ విజయ్ దేవరకొండను హిందీలో లాంచ్ చేస్తున్న కరణ్.. రీసెంట్ గా కెజిఎఫ్ 2 లాంటి ఓ రీజనల్ కన్నడ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి హోస్ట్ గా కనిపించారు. అంతేకాదు.. టాలీవుడ్ ని చూసి నేర్చుకోవాలంటూ ఓపెన్ గానే చెప్పారు కరణ్ జోహార్. ఇక బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ అయితే సౌత్ ని ఓ రేంజ్ లో ఎత్తేశారు. సౌత్ లో చేస్తున్న పవర్ ఫుల్ సినిమాలతో ముందుకు రావాలి అంటూ పబ్లిక్ గానే స్టేట్ మెంట్ ఇచ్చారు రణవీర్ సింగ్. ఇలా సౌత్ సినిమాలు బాలీవుడ్ లో సక్సెస్ అవ్వడం, బాలీవుడ్ సినిమాలు బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా అంతగా ఇంపాక్ట్ చూపించలేకపోవడంతో ఒక్కసారిగా డిఫెన్స్ లో పడ్డ సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు దీనికి సొల్యూషన్ కోసం తెగ ఆలోచిస్తున్నారు.