South Movies: హిందీలో సౌత్ సినిమాల రికార్డులు.. నోరుపారేసుకుంటున్న బాలీవుడ్ క్రిటిక్స్!

ఇన్నాళ్లుగా బాలీవుడ్ సినిమాలు చూసి, బాలీవుడ్ లో ఛాన్సే టార్గెట్ గా పెట్టుకుని సినిమాలు చేసిన సౌత్ ఇప్పుడు.. బాలీవుడ్ బాక్సాఫీస్ బద్దలు కొడుతోంది. ఏదో ఒక సినిమా హిట్ అయ్యిందంటే అనుకోవచ్చు.. అదీ ఇదీ అని కాదు.. వరసగా రిలీజ్ అయిన..

South Movies: హిందీలో సౌత్ సినిమాల రికార్డులు.. నోరుపారేసుకుంటున్న బాలీవుడ్ క్రిటిక్స్!

South Movies

South Movies: ఇన్నాళ్లుగా బాలీవుడ్ సినిమాలు చూసి, బాలీవుడ్ లో ఛాన్సే టార్గెట్ గా పెట్టుకుని సినిమాలు చేసిన సౌత్ ఇప్పుడు.. బాలీవుడ్ బాక్సాఫీస్ బద్దలు కొడుతోంది. ఏదో ఒక సినిమా హిట్ అయ్యిందంటే అనుకోవచ్చు.. అదీ ఇదీ అని కాదు.. వరసగా రిలీజ్ అయిన పాన్ ఇండియా సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి హిందీలోనే రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. ఈ బాక్సాఫీస్ సక్సెస్ చూసి భరించేలేకపోతోంది బాలీవుడ్. అందుకే.. సౌత్ సినిమాల మీద నోరు పారేసుకుంటోంది. మీ సినిమాలు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాయి అంటూ శ్రీరంగనీతులు చెబుతోంది బాలీవుడ్.

South Movies: బాలీవుడ్‌ను వెంటాడుతున్న సౌత్.. సైడ్ ఇచ్చేస్తున్న బీటౌన్!

ఈ వయెలెన్స్ నే ఇప్పుడు టార్గెట్ చేసింది బాలీవుడ్. ఇలా వయెలెన్స్ చూపించే జనాల్ని పిచ్చోళ్లని చేస్తున్నారంటున్నారు బాలీవుడ్ క్రిటిక్స్. ప్రజెంట్ ఇండియన్ సినిమాని ఏలుతున్న సౌత్ సినిమా లో వయలెన్స్ ఎక్కువైపోయిందని, ఈ వయెలెన్స్ తో సమాజంలో తప్పులు జరుగుతున్నాయని, ఇలాంటి వయెలెన్స్ సౌత్ వాళ్లు మరీ ఎక్కువ చూపిస్తున్నారని సౌత్ పాన్ ఇండియా సినిమాల మీద పడి ఏడుస్తున్నారు బాలీవుడ్ క్రిటిక్స్.

South India Movies: ఇండియన్ సినిమాకు కేరాఫ్ అడ్రస్‌గా సౌత్ సినిమాలు!

బాలీవుడ్ ఇప్పటి వరకూ సౌత్ సినిమాల హవా చూసింది లేదు. కానీ ఈ మధ్య సౌత్ నుంచి వరసగా రిలీజ్ అవుతున్న పాన్ ఇండియా సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ దుమ్ము దులుపుతున్నాయి. ట్రిపుల్ఆఱ్, కెజిఎఫ్ 2, పుష్ప లాంటి లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్ల తో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఓరియంటెడ మూవీస్ తో బాలీవుడ్ లో కూడా వందలకోట్లు కలెక్ట్ చేస్తున్నాయి. బాలీవుడ్ లో వరసగా సౌత్ సినిమాలు ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. బీస్ట్, వలిమై, సాహో లాంటి సినిమాలు పెద్దగా ఆడియన్స్ ని ఆకట్టుకోకపోయినా.. ఈ సినిమాలు కూడా కంప్లీట్ యాక్షన్ ఓరియంటెడ్ మూవీసే. అయితే అదే ఇప్పుడు బాలీవుడ్ కి మింగుడు పడడం లేదు. సౌత్ పాన్ ఇండియా సినిమాల్లో వయెలెన్స్ ఎక్కువైపోతోందని, దీనివల్ల సమాజం పై ప్రభావం పడే అవకాశం ఉందంటూ నెగెటివ్ స్టోరీస్ రాస్తున్నారు బాలీవుడ్ క్రిటిక్స్.

Tamil Movies: సినీ వెలుగంతా తమిళ పరిశ్రమదే.. కానీ అదంతా గతం!

పుష్ప, ట్రిపుల్ఆర్, కెజిఎఫ్ 2.. పాన్ ఇండియా సినిమా అంటే అన్ని హంగులూ ఉండాలి కాబట్టి.. యాక్షన్ ఎమోషన్ అందరికీ కనెక్ట్ అవుతుంది కాబట్టి.. ఇధే ఎలివేట్ చేస్తూ.. సూపర్ హిట్ అవుతున్నా యి సౌత్ సినిమాలు. ఇదే పాయింట్ తో సౌత్ సినిమాని టార్గెట్ చేస్తున్నారు బాలీవుడ్ క్రిటిక్స్. అంతేకాదు రీసెంట్ గా నవాజుద్దీన్ సిద్దిఖీ కూడా పాండమిక్ వల్ల జనాల టేస్ట్ మారిందనుకున్నాను కానీ.. అదే రొటీన్ యాక్షన్ సినిమాల్ని ఇష్టపడుతున్నారు. జనాల టేస్ట్ ఏమాత్రం మారలేదు.. కొత్త సినిమాల వైపు వెళ్లడం లేదు అంటూ సర్ కాస్టిక్ గానే కామెంట్ చేశారు. ఎవరేం అన్నా కూడా సౌత్ మూవీ తన సత్తా చూపిస్తూనే ఉంది. ఇంకా బాలీవుడ్ లో తన హవా నడిపిస్తూనే ఉంది.