South India Movies: ఇండియన్ సినిమాకు కేరాఫ్ అడ్రస్‌గా సౌత్ సినిమాలు!

ఎక్కడ చూసినా సౌత్ ఇండియా సినిమాల గురించే.. ఎక్కడ చూసినా సౌత్ ఇండియాస్టార్లే.. ఎక్కడ చూసినా సౌత్ ఇండియా సినిమాల బాక్సాఫీస్ కలెక్షన్లే. ఒక్కటేంటి.. అసలు సినిమా ఇండియన్ సినిమా..

South India Movies: ఇండియన్ సినిమాకు కేరాఫ్ అడ్రస్‌గా సౌత్ సినిమాలు!

South India Movies

South India Movies: ఎక్కడ చూసినా సౌత్ ఇండియా సినిమాల గురించే.. ఎక్కడ చూసినా సౌత్ ఇండియాస్టార్లే.. ఎక్కడ చూసినా సౌత్ ఇండియా సినిమాల బాక్సాఫీస్ కలెక్షన్లే. ఒక్కటేంటి.. అసలు సినిమా ఇండియన్ సినిమా మొత్తం సౌత్ ఇండియా సినిమాల గురించే మాట్లాడుకుంటోంది. సినిమా అంటే కేరాఫ్ సౌత్ ఇండియా అనేలా నెక్ట్స్ లెవల్ సినిమాలు చూపించడానికి రెడీ అవుతున్న స్టార్లెవరో.. ఆ రేంజ్ లో దుమ్ము రేపబోయే సినిమాలేంటో బ్రీఫ్ గా చూద్దాం.

Senior South Heroes: రిటైర్మెంట్ ఏజ్‌లో దూకుడు ఆపని సౌత్ హీరోలు!

ఇండియన్ సినిమా అడ్రస్ మారిపోయింది. సినిమా అంటే కేరాఫ్ సౌత్ ఇండియా అనే రేంజ్ లో సినిమాలు చేస్తున్నారు మన వాళ్లు. తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం ఇలా సౌత్ లో ప్రతి ఇండస్ట్రీ పోటీ పడి బాలీవుడ్ మార్కెట్ కి చెక్ పెడుతూ నెక్ట్స్ లెవల్ సినిమాలు చేస్తోంది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన టాలీవుడ్ మూవీ ట్రిపుల్ఆర్ వరల్డ్ వైడ్ గాసెన్సేషన్ క్రియేట్ చేస్తూ సౌత్ ఇండియన్ సినమా వాల్యూని ఇంకాస్త పెంచేసింది.

South Heroines: తమిళ హీరోయిన్లకు లాంచింగ్ ప్యాడ్‌గా టాలీవుడ్

ట్రిపుల్ఆరే కాదు.. రాబోయే సౌత్ సినిమాలన్నీ అదే రేంజ్ లో ఇండియన్ సినిమాని రిఫ్లెక్ట్ చెయ్యబోతున్నాయి. తమిళ్ ఇండస్ట్రీకి సంబంధించి ఏప్రిల్ 13న పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అవుతున్న విజయ్ బీస్ట్ మూవీ ఇప్పటికే విపరీతమైన హైప్స్ తో ఉంది. తమిళ్ స్టార్ హీరో విజయ్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రిలీజ్ అవుతున్న ఈ బిగ్ మూవీ మరోసారి తమిళ్ సత్తా చూపబోతోంది.

Bollywood Movies: టార్గెట్ 2023.. వచ్చే ఏడాదే బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్స్!

కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి రాబోతున్న హై యాక్షన్ విజువల్ ఎంటర్ టైనర్ కేజీఎఫ్ 2 సౌత్ యాక్షన్ సత్తాని ఓ రేంజ్ లో చూపించబోతోంది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా మీద అంచనాల్ని విపరీతంగా పెంచేసింది. సంజయ్ దత్, రవీనా టాండన్ లాంటి బాలీవుడ్ స్టార్లు కూడా ఈ కన్నడ సినిమాలో చెయ్యడానికి అంత ఇంట్రస్ట్ చూపించారంటే.. ఈ కెజిఎఫ్ 2 రేంజ్ ఏంటో అర్దం చేస్కోవచ్చు. గ్రాండియర్, భారీ సెట్స్ తో.. ఈ బిగ్గర్ మూవీ ఏప్రిల్ 14న నెవర్ బిఫోర్ విజువల్స్ తో ఆడియన్స్ ని థ్రిల్ చెయ్యబోతోంది.

Top South Actors: వీళ్లు ఇకపై గ్లోబల్ స్టార్లు.. పారితోషికం భారీగానే!

ఇండియా మొత్తాన్ని తనసక్సెస్ తో ఓ ఊపు ఊపేసిన సినిమా పుష్ప. ఫస్ట్ ఓన్లీ తెలుగు సినిమాగా రిలీజ్ చేద్దామనుకున్న ఈ సినమాని పాన్ ఇండియారేంజ్ లో గ్రాండ్ గా రిలీజ్ చేసింది టీమ్. ఈ కల్ట్ రా యాక్షన్ ఎంటర్ టైనర్ మేకింగ చూసి బాలీవుడ్ కూడా ఫిదా అయ్యి కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పుడు పుష్ప 2 పుష్పని మించి ఇంకా ఎక్స్ ట్రార్డినరీగా పెద్ద స్కేల్ లో ప్లాన్ చేశారు.

South Stars: బాలీవుడ్‌లో జెండా పాతేస్తున్న లోకల్ స్టార్స్!

పాన్ ఇండియా సినిమాలకు, పెద్ద బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ప్రభాస్ తన సినిమాలతో సౌత్ సత్తా చూపిస్తూనే ఉన్నారు. ఇదే రూట్ లో మరిన్ని బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ తో రాబోతున్నారు. ఆల్రెడీ షూట్ ఫినిష్ చేసుకున్న ఆదిపురుష్, సెట్స్ మీదున్న సలార్.. షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ప్రాజెక్ట్.కె ఈ మూడుసినిమాలు నెక్ట్స్ లెవల్ మేకింగ్ తో తెరకెక్కుతున్న పెద్ద సినిమాలే.

Movie Releases: విజయ్-యష్ మూవీ వార్.. మధ్యలో నేనున్నానంటున్న షాహిద్!

ఇండియన్ లెజండరీ స్టార్ డైరెక్టర్ మణిరత్నం చాలా గ్యాప్ తర్వాత భారీ బడ్జెట్ తో తీస్తున్న నెక్ట్స్ లెవల్ మూవీ పొన్నియున్ సెల్వన్. విక్రమ్, కార్తి, ఐశ్వర్యరాయ్, త్రిష లాంటి భారీ స్టార్ కాస్ట్ తో తెరకెక్కుతున్న హిస్టారికల్ మూవీని నెవర్ బిఫోర్ విజువల్స్ తో షూట్ చేస్తున్నారు మణిరత్నం. ఈ అప్ కమింగ్ భారీ సినిమాలతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కి తనస్టామినా చూపించబోతోంది సౌత్ ఇండస్ట్రీ.