Senior South Heroes: రిటైర్మెంట్ ఏజ్‌లో దూకుడు ఆపని సౌత్ హీరోలు!

సిక్స్ టీ ప్లస్ ఏజ్ ఉన్న తెలుగు హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వరస సినిమాలను సెట్స్ మీదకి తీసుకెళ్తూ బిజీగా ఉన్నారు. తెలుగు హీరోలే కాదు.. సౌత్ లో స్టార్ ఇమేజ్..

Senior South Heroes: రిటైర్మెంట్ ఏజ్‌లో దూకుడు ఆపని సౌత్ హీరోలు!

Senior South Heroes

Senior South Heroes: సిక్స్ టీ ప్లస్ ఏజ్ ఉన్న తెలుగు హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వరస సినిమాలను సెట్స్ మీదకి తీసుకెళ్తూ బిజీగా ఉన్నారు. తెలుగు హీరోలే కాదు.. సౌత్ లో స్టార్ ఇమేజ్ ఉన్న సీనియర్ హీరోలు కూడా ఇటు సోలోగా అటు మల్టీస్టారర్ మూవీస్ చేస్తూ.. ఫుల్ బిజీగా ఉన్నారు. తమిళ్, మళయాళ హీరోలు యంగ్ హీరోలతో పోటీ పడుతూ యంగ్ డైరెక్టర్లతో సినిమా ఛాన్సులు దక్కించుకుంటున్నారు.

South Heroins: అప్నా టైమ్ ఆయా.. బాలీవుడ్‌లో సత్తా చూపిస్తున్న సౌత్ హీరోయిన్లు!

రజనీకాంత్.. సౌత్ సూపర్ స్టార్.. తమిళ్ తలైవా.. స్టైల్ ఐకాన్.. ఇలా.. ఆ హీరోని ఎన్ని పేర్లతో పిలిచినా తక్కువే. ఇండస్ట్రీకి వచ్చి 40 సంవత్సరాలు దాటుతున్నా.. వయసు 70 దాటేసినా ఇంకా అదే ఎనర్జీతో ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తున్నారు. ఈ ఏజ్ లో కూడా యంగ్ హీరోలతో పోటీపడుతూ యాక్షన్ ఎంటర్ టైనర్స్ చేస్తున్నారు. రజనీకాంత్ కి వరసగా కబాలి, పేట, కాలా, దర్బార్, పెద్దన్న ఇలా రిలీజ్ అయిన ఏ సినిమా కూడా బ్లాక్ బస్టర్ కాలేదు. అయినా కూడా ఈ సూపర్ స్టార్ కి సినిమా ఛాన్సులకొచ్చిన లోటేం లేదు.

South Stars: బాలీవుడ్‌లో జెండా పాతేస్తున్న లోకల్ స్టార్స్!

హిట్స్ పెద్దగా లేకపోయినా.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు రజనీకాంత్. తమిళ్ యంగ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తో తన 169వ సినిమా చేస్తున్నారు. అనిరుద్ మ్యూజిక్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈమూవీలో రజనీకాంత్ మాస్ లుక్ లో స్టైలిష్ గా కనిపిస్తున్నారు. హిట్లు లేకపోయినా.. రజనీకున్న క్రేజ్, ఓపెనింగ్స్ మరో హీరోకి సాధ్యం కాదు.. అందుకే మేకర్స్ కూడా రజనీతో సినిమా కోసం వెయిట్ చేస్తూనే ఉంటారు.

South Stars: తెలుగుపై మనసుపారేసుకుంటున్న సౌత్ హీరోలు

లోకేష్ కనగరాజ్ తో సౌత్ సూపర్ స్టార్ కమల్ హాసన్ తన అప్ కమింగ్ మూవీ విక్రమ్ సినిమా షూటింగ్ ని కంప్లీట్ చేసేశారు. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ కూడా నటిస్తున్న ఈ సినిమా భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది. కమల్ హాసన్ భారతీయుడు 2 సినిమా షూటింగ్ ఇంకా కొలిక్కి రాకపోవడంతో.. ఈ గ్యాప్ లో విక్రమ్ ని కంప్లీట్ చేసి సమ్మర్ కి రిలీజ్ చేస్తున్నారు. కమల్ హాసన్ కి కూడా విశ్వరూపం డిజాస్టర్ తర్వాత ఏ సినిమా కూడా సరిగా వర్కవుట్ అవ్వలేదు. కానీ కమల్ సినిమాలంటే జనాల్లో క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.

Bollywood Heroins: సౌత్ క్రేజ్.. మన హీరోలపై మనసు పారేసుకుంటున్న బాలీవుడ్

తమిళ్ సీనియర్ హీరోల క్రేజ్ ఏమాత్రం తగ్గకుండా సినిమాలు రిలీజ్ చేస్తుంటే.. మళయాళ సీనియర్ హీరోలు కూడా మేమేం తక్కువ అంటున్నారు. హిట్, ఫ్లాప్ తో సంబందం లేని ఇమేజ్ సంపాదించుకున్న మోహన్ లాల్ ఇటు సోలో గా సినిమాలు చెయ్యడమే కాకుండా తెలుగు, తమిళ్ లో క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తున్నారు. ట్వల్త్ మ్యాన్, అలోన్, మాన్ స్టర్, రామ్ ప్రాజెక్ట్స్ చేస్తూ.. ఫుల్ బిజీగా ఉన్నారు మోహన్ లాల్.

Bollywood Movies: టార్గెట్ 2023.. వచ్చే ఏడాదే బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్స్!

మళయాళ సీనియర్ హీరోల్లో మోస్ట్ హ్యాండ్సమ్ హీరో అయిన మమ్ముట్టి సెలక్టివ్ గా సినిమాలు చేస్తూ.. తన సక్సెస్ టూర్ ని కంటిన్యూ చేస్తున్నారు. పుళు, నాన్ పాకల్ నేరత్తు మాయక్కమ్, సిబిఐ ద బ్రెయిన్, బిలాల్ లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఈ సినిమాలే కాకుండా అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఏజెంట్ మూవీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు మమ్ముట్టి. ఇలా ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్ అంటూ క్రేజ్ ని, ఇమేజ్ ని నిలబెట్టుకుంటూ కలెక్షన్లు రాబడుతూ.. కెరీర్ లో ఇంకా బిజీగానే ఉన్నారు సిక్స్ టీ ప్లస్ సీనియర్ హీరోలు.