South Stars: తెలుగుపై మనసుపారేసుకుంటున్న సౌత్ హీరోలు

దక్షణాది సినీ హీరోలు తమ మార్కెట్ ని స్ప్రెడ్ చేస్కోడానికి ఏం చెయ్యడానికైనా రెడీ అంటున్నారు. డబ్బింగ్ సినిమాలతో పక్క రాష్ట్రాల్లో క్రేజ్ సంపాదించుకుంటున్న హీరోలు ..

South Stars: తెలుగుపై మనసుపారేసుకుంటున్న సౌత్ హీరోలు

South Stars

South Stars: దక్షణాది సినీ హీరోలు తమ మార్కెట్ ని స్ప్రెడ్ చేస్కోడానికి ఏం చెయ్యడానికైనా రెడీ అంటున్నారు. డబ్బింగ్ సినిమాలతో పక్క రాష్ట్రాల్లో క్రేజ్ సంపాదించుకుంటున్న హీరోలు .. ఇప్పుడు డైరెక్ట్ వార్ కి రెడీ అవుతున్నారు. సౌత్ స్టార్స్ కొందరు కొత్తగా మన టాప్ హీరోలకి టక్కర్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. తమిళ, మలయాళం హీరోలు మార్కెట్ పెంచుకోవడానికి సౌత్ హీరోల స్ట్రాటజీని స్పీడప్ చేస్తున్నారు.

Big Boss 5: ఆ ఇద్దరితో లహరి బిజీ.. అగ్గిరాజేసిన ప్రియా కామెంట్స్

ఒకప్పుడు డబ్బింగ్ సినిమాలతో మాత్రమే తెలుగులోకి వచ్చే తమిళ, మళయాళ హీరోలు ఇప్పుడు డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యారు. తమిళ్ స్టార్ హీరో విజయ్.. తన 67వ సినిమాని తెలుగు హిట్ డైరెక్టర్ వంశీ పైడిపల్లితో దిల్ రాజు ప్రొడక్షన్ లో సినిమా చెయ్యడానికి రెడీ అయ్యాడు. ఈ సినిమాని నెక్ట్స్ మన్త్ అఫీషియల్ గా స్టార్ట్ చేసి రెగ్యులర్ షూట్ ని జనవరి నుంచి మొదలుపెడుతున్నాడు వంశీ.

Film Actress: హీరోయిన్స్ హార్డ్ వర్క్.. హీరోలతో సమానంగా స్టంట్లు!

మరో స్టార్ తమిళ్ హీరో ధనుష్ కూడా తెలుగు లో డైరెక్ట్ ఎంట్రీ కి రెడీ అయ్యాడు. క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్లో సినిమా ఆల్రెడీ అఫీషియల్ గా అనౌన్స్ చేసిన ధనుష్ ఈ సినిమా షూటింగ్ ని మాత్రం వచ్చే సంవత్సరం ఏప్రిల్ లో మొదలుపెట్టబోతున్నాడు. ఈ లోపు ధనుష్ ఆల్రెడీ ఉన్న తన కమిట్ మెంట్స్ ని కంప్లీట్ చేసేసి శేఖర్ సినిమాలో జాయిన్ అవుతాడు.

Telugu Film Hero’s: థియేటర్లపై హీరోల ఫోకస్.. సొంతగా కట్టేసుకుంటున్న స్టార్లు!

వీళ్లందరి కంటే ముందే తెలుగులోకి సోలోగా వస్తున్నారు మళయాళ స్టార్ దుల్కర్ సల్మాన్. హనురాఘవపూడి డైరెక్షన్లో లెఫ్టినెంట్ రామ్ గా రాబోతున్నారు ఈ స్టార్ హీరో. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా పీరియాడిక్ లవ్ డ్రామా గా తెరకెక్కుతోంది. కెరీర్ లో డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేసి తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకున్న దుల్కర్ ..ఈ సారి డైరెక్ట్ గా సోలో హీరోగా తెలుగు ఎంట్రీ ఇస్తున్నారు.