Big Boss 5: ఆ ఇద్దరితో లహరి బిజీ.. అగ్గిరాజేసిన ప్రియా కామెంట్స్

బిగ్‌బాస్‌ హౌస్‌లో అన్నింటికంటే పెద్ద టాస్క్‌ నామినేషన్స్‌. బిగ్‌బాస్‌ ఇంట్లో అడుగు పెట్టిన కంటెస్టెంట్స్ ఎప్పుడో ఒకసారైనా ఈ గండం బారిన పడక తప్పదు.

Big Boss 5: ఆ ఇద్దరితో లహరి బిజీ.. అగ్గిరాజేసిన ప్రియా కామెంట్స్

Big Boss 5

Big Boss 5: బిగ్‌బాస్‌ హౌస్‌లో అన్నింటికంటే పెద్ద టాస్క్‌ నామినేషన్స్‌. బిగ్‌బాస్‌ ఇంట్లో అడుగు పెట్టిన కంటెస్టెంట్స్ ఎప్పుడో ఒకసారైనా ఈ గండం బారిన పడక తప్పదు. ఈ నామినేషన్స్‌ కంటెస్టెంట్ల బలాబలాలను నిరూపించడమే కాకుండా ప్రేక్షకులు ఎవరి వైపు నిలబడుతున్నారన్న విషయాన్ని కూడా సుస్పష్టం చేస్తాయి. 19 మంది సెలబ్రిటీలతో ప్రారంభమైన బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ మూడవ వారం నామినేషన్స్ ప్రక్రియ కూడా మొదలైంది. సరయు, ఉమాదేవి హౌస్‌ను వీడివెళ్లడంతో ఇంటిసభ్యుల సంఖ్య 17కు చేరగా.. వీరిలో నుంచి ఒకరిని బయటకు పంపించేందుకు హౌస్‌లో నామినేషన్స్‌ కూడా జరిగాయి.

South Stars: తెలుగుపై మనసుపారేసుకుంటున్న సౌత్ హీరోలు

మూడోవారానికి సంబంధించి నామినేషన్స్‌ ప్రక్రియలో కంటెస్టెంట్‌ల మధ్య వాడీవేడీగా వాదనలు జరిగాయి. హౌస్‌లో ఉండేందుకు అర్హత లేని, తమకు ఇష్టం లేని పోటీదారుల పేర్లను బోర్డుపై ముద్రించి అందుకు తగిన కారణాలు చెప్పి పేరు రాసిన బోర్డును సుత్తితో బద్దలు కొట్టాల్సిందిగా బిగ్‌బాస్‌ సూచించారు. ఈ నామినేషన్స్ ప్రక్రియలో హౌస్‌మేట్స్‌ ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగారు. తీవ్రమైన ఆరోపణలు, అపోహలు, అంతకు మించిన వివాదాలుగా సాగిన ఈ నామినేషన్స్ లో లహరిపై ప్రియ చేసిన కామెంట్స్‌ అగ్నికి ఆజ్యం పోసినట్లు అయింది.

Prabhas: పక్కా ప్లాన్.. ఒకేసారి 4 సినిమాలు లైన్లో పెట్టిన యూనివర్సల్ స్టార్!

ఈ నామినేషన్స్ లో ప్రియా లహరిని నామినేట్ చేయగా.. ఎందుకు నాతో దూరం పాటిస్తున్నారో నాకు అర్థం కావటం లేదని లహరి ప్రియను అడిగింది. మీరు హౌస్‌లోని పురుషులతో బిజీగా ఉండడం వలనే నేను దూరం ఉంటున్నా అని ప్రియా లహరిని అనడంతో హౌస్‌లోని సభ్యులంతా ఆశ్చర్యపోయారు. ‘రవి, మానస్‌లతో మీరు బిజీగా ఉన్నారని ప్రియ ఈ వివాదాన్ని ఇంకాస్త ముందుకు తీసుకెళ్లడంతో, లహరి, రవిలు ప్రియపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రవి అయితే ‘రాంగ్‌ స్టేట్‌మెంట్‌’ అంటూ ప్రియపై ఆగ్రహంతో ఊగిపోయాడు. ప్రియా ఇచ్చిన ఈ స్టేట్మెంట్ వలనే సన్నీ ప్రియను నామినేట్‌ చేస్తున్నట్లు తెలిపాడు.

Film Actress: హీరోయిన్స్ హార్డ్ వర్క్.. హీరోలతో సమానంగా స్టంట్లు!

నామినేట్‌ చేసేందుకు పనికిమాలిన కారణాలు చెబుతారని ప్రియాంక అసహనం వ్యక్తం చేస్తే.. ఇంకెంత కాలం చిన్న చెడ్డీలు వేసుకుని, దెబ్బ చూపిస్తావంటూ రవి జస్వంత్‌ మీద అసహనం వ్యక్తం చేశాడు. అలా మొత్తానికి ఈ నామినేషన్స్ ప్రక్రియ పూర్తయ్యేసరికి లహరి, ప్రియాంక, మానస్‌, శ్రీరామచంద్ర, ప్రియ మూడో వారం నామినేషన్లలో ఉన్నారు. మరి నామినేషన్స్‌లో ఉన్న వీరిలో మూడోవారం ఎవరు ఇంటిని నుంచి బయటకు వెళ్తారో మరో నాలుగు రోజులు ఆగాలి.