South Heroines: తమిళ హీరోయిన్లకు లాంచింగ్ ప్యాడ్‌గా టాలీవుడ్

తెలుగులో సినిమా చేస్తే అంతే.. ఇక వరసపెట్టి సౌత్ మొత్తం చుట్టేయ్యొచ్చని తెగ సంబరపడిపోతున్నారు హీరోయిన్లు. తమిళ్ లో ఛాన్సులు రావాలంటే ఫస్ట్.. తెలుగులో సినిమాలు చేస్తే చాలు...

South Heroines: తమిళ హీరోయిన్లకు లాంచింగ్ ప్యాడ్‌గా టాలీవుడ్

South Heroines

South Heroines: తెలుగులో సినిమా చేస్తే అంతే.. ఇక వరసపెట్టి సౌత్ మొత్తం చుట్టేయ్యొచ్చని తెగ సంబరపడిపోతున్నారు హీరోయిన్లు. తమిళ్ లో ఛాన్సులు రావాలంటే ఫస్ట్.. తెలుగులో సినిమాలు చేస్తే చాలు.. దెబ్బకు తమిళ్ లో ఎంట్రీ ఈజీ అని ప్రూవ్ చేస్తున్నారు ఈ హీరోయిన్లు. ఇక టాలీవుడ్ అయితే తమిళ్ హీరోయిన్లకు లాంచింగ్ ప్యాడ్ గా మారిపోయిందనుకుంటున్నారు ఆడియన్స్. ఇప్పటికే అలా తెలుగులో సినిమాలు చేస్తూ.. తమిళ్ లో లాంచ్ అయిపోయారు కొందరు హీరోయిన్లు.

Trivikram Heroines: నచ్చితే చాలు.. హీరోయిన్స్ ను రిపీట్ చేస్తున్న త్రివిక్రమ్!

తమిళ్ హీరోలకు హీరోయిన్లు కరువయ్యారు. అందుకే హీరోలకు జంటకోసం వెతుకుతూ.. టాలీవుడ్ వైపు చూస్తున్నారు. తమిళ్ మేకర్స్ కూడా.. తెలుగులో ఏ హీరోలున్నారా అని ఆరా తీస్తున్నారు. అలా తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్న కృతి శెట్టి.. తమిళ్ లో ఎంట్రీకి రెడీ అవుతోంది. శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు లాంటి బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ ల తర్వాత రామ్ తో వారియర్, సుథీర్ బాబుతో ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, నితిన్ తో మాచర్ల నియోజకవర్గం సినిమాలతో తెలుగులోనే ఫుల్ బిజీగా ఉంది. టాలీవుడ్ లో ఇంత క్రేజ్ ఉన్న బేబమ్మ.. ఇప్పుడు తమిళ్ లో ఎంట్రీ ఇవ్వబోతోంది. సూర్య హీరోగా బాల డైరెక్షన్లో తెరకెక్కబోతున్న సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తోందని న్యూస్ గట్టిగానే వినిపిస్తోంది.

Heroines : ఐటెం సాంగ్స్ చేసిన స్టార్ హీరోయిన్స్

ప్రజెంట్ తెలుగు ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ లో కూడా ఫుల్ బిజీగా ఉన్న రష్మిక మందాన.. తెలుగులో హిట్ సినిమాలు చేసిన తర్వాతే తమిళ్ లో ఆఫర్ దక్కించుకుంది. కన్నడ సినిమాతో కెరీర్ ని స్టార్ట్ చేసినా పట్టించుకోని తమిళ్ ఇండస్ట్రీ.. తెలుగులో శ్రీవల్లి కున్న క్రేజ్ చూసి కార్తితో సినిమా ఆఫర్ కొట్టేసింది. కెరీర్ స్టార్ట్ చేసిన 6 ఏళ్ల తర్వాత తమిళ్ లో ఎంట్రీ ఇచ్చింది రష్మిక. సుల్తాన్ టైటిల్ తో తెరకెక్కిన ఈ మూవీ డీసెంట్ సక్సెస్ అందుకుంది.

Heroines : ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్న హీరోయిన్స్ వీళ్లే

మరో యంగ్ సెన్సేషన్ ఇస్మార్ట్ భామ అయిన నిధి అగర్వాల్ కూడా తెలుగులో సినిమాలు చేసిన తర్వాతే తమిళ్ లో ఛాన్స్ దక్కించుకుంది. అక్కినేని అన్నదమ్ములు.. నాగచైతన్య, అఖిల్ తో సవ్యసాచి, మిస్టర్ మజ్ను సినిమాలు చేసిన నిధి అగర్వాల్.. రామ్ తో చేసిన ఇస్మార్ట్ శంకర్ తో మంచి క్రేజ్ సంపాదించుకుంది. దెబ్బతో తమిళ్ మేకర్స్ ని ఎట్రాక్ట్ చేసింది నిధి అగర్వాల్. దాంతో శింబు, జయం రవితో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేసే బంపర్ ఆఫర్ దక్కించుకుంది నిధి అగర్వాల్.

South Heroines : టాప్ హీరోయిన్స్.. కొత్త కండీషన్స్..?

తమిళ్ లో మెహరీన్ లాంచ్ అయ్యింది కూడా తెలుగు సినిమా క్రేజ్ తోనే. నానితో చేసిన కృష్ణ గాడి వీర ప్రేమగాధతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న మెహరీన్.. ఆ తర్వాత మహానుభావుడు, రాజాదిగ్రేట్ సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ దక్కించుకుంది. ఆ క్రేజ్ తోనే కేరాఫ్ సూర్యతో తమిళ్ మూవీ చేసే చాన్స్ దక్కించుకుంది.

Heroines : అప్పుడు ‘నో’ చెప్పారు.. ఇప్పుడు ‘ఎస్’ అంటున్నారు..

రాశిఖన్నాకి కూడా తమిళ్ లో ఛాన్స్ రావడానికి 5 ఏళ్లు పట్టింది. ఆక్సిజన్, టచ్ చేసి చూడు, తొలిప్రేమ, శ్రీనివాసకళ్యాణం లాంటి సినిమాల తర్వాత రాశిని రికగ్నైజ్ చేసింది కోలీవుడ్. అజయ్ గ్నానముత్తు డైరెక్షన్లో నయనతార, అథర్వ, లీడ్ రోల్స్ లో చేసిన అంజలి సిబిఐ సినిమాతో తమిళ్ లో అరంగేట్రం చేసింది రాశిఖన్నా.

Bollywood Star Heroes: కమ్ బ్యాక్ బాలీవుడ్.. హీరోలు బిజీ బిజీ!

ఇప్పటి వరకూ చెప్పిన హీరోయిన్లు తమిళ్ లో ఆఫర్ కోసం వెయిట్ చేశారేమో కానీ.. లాస్ట్ ఇయర్ టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి చౌదరిని మాత్రం ఇట్టే పట్టేసింది కోలీవుడ్. ఇచట వాహనములు నిలుపరాదు, లేటెస్ట్ గా వచ్చిన ఖిలాడితో ఆడియన్స్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న మీనాక్షి.. విజయ్ ఆంటోనీ హీరోగా చేస్తున్న కొలై మూవీతో తమిళ్ ఎంట్రీ ఇస్తోంది.

Actress Promotions: డబ్బిస్తే చాలు.. ఏ ప్రొడక్ట్‌కైనా మేము సిద్దమే!

సౌత్ స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే..10 ఏళ్ల క్రితం విజయ్ హీరోగా వచ్చిన తమిళ్ సినిమాతో తన కెరీర్ ని స్టార్ట్ చేసినా..ఇప్పటి వరకూ మళ్లీ ఒక్క తమిళ్ సినిమా కూడా చెయ్యలేదు. కానీ తెలుగులో స్టార్ హీరోలందరితో సినిమాలు చేస్తూ.. ఫుల్ బిజీగా ఉన్న ఈ భామ క్రేజ్ చూసి తమిళ్ స్టార్ హీరో విజయ్ ఏరికోరి తన సినిమాలో మళ్లీ చాన్సిచ్చారు. బీస్ట్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ తో మళ్లీ తమిళ్ లో ఫామ్ లోకొస్తానంటోంది పూజా. ఇప్పటికే రిలీజ్ అయిన అరబిక్ కుతు సాంగ్ సోషల్ మీడియాలో రికార్డులు క్రియేట్ చేస్తోంది.