Heroines : అప్పుడు ‘నో’ చెప్పారు.. ఇప్పుడు ‘ఎస్’ అంటున్నారు..

ఓ హీరోయిన్ రెమ్యునరేషన్ తగ్గించేస్తే.. మరో బ్యూటీ మళ్లీ ఆఫర్స్ కావాలంటోంది..

Heroines : అప్పుడు ‘నో’ చెప్పారు.. ఇప్పుడు ‘ఎస్’ అంటున్నారు..

Heroines Trying For Movie Offers

Heroines: టైంను బట్టి మారిపోతున్నారు హీరోయిన్స్.. గతంలో వేటికైతే ‘నో’ చెప్పారో, ఇప్పుడు వాటికే ‘ఎస్’ చెప్పాల్సిన పరిస్థితి. ఓ హీరోయిన్ రెమ్యునరేషన్ తగ్గించేస్తే.. మరో బ్యూటీ మళ్లీ ఆఫర్స్ కావాలంటోంది.. ఒకరు స్టార్ హీరో లేకపోయినా పర్వాలేదనుకుంటుంటే.. మరొకరు లేడీ ఓరియెంటెడ్‌కీ ఓటేస్తున్నారు.

పెళ్లి తర్వాత కాజల్ లైఫ్ మాత్రమే కాదు, మైండ్ సెట్ కూడా మారింది. కథలు, క్యారెక్టర్ల విషయంలో ప్రయోగాలు చేసేందుకు ప్రెజెంట్ ఇంట్రెస్ట్ చూపిస్తోంది. మొన్నటి వరకు స్టార్ హీరోల సరసన గ్లామరస్‌గా కనిపించిన కాజల్.. ఇప్పుడు కొత్త రోల్స్‌తో ప్రయోగాలు చేయాలనుకుంటోంది. ఈమధ్యే తన రెమ్యునరేషన్ కూడా భారీగా తగ్గించేసింది. ప్రస్తుతం సీనియర్ హీరోల హాట్ ఫేవరెట్‌గా మారిన కాజల్.. చిరంజీవి ‘ఆచార్య’, నాగ్ – ప్రవీణ్ సత్తారు కాంబో మూవీల్లో నటిస్తోంది. పనిలో పనిగా వెబ్ సిరీస్‌కీ ఒకే చెప్తోంది. త్వరలోనే ‘పేపర్ బాయ్’ డైరెక్టర్ జయ శంకర్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌లో నటించనుంది.

పెళ్లి వాయిదా వేసుకొని ఆఫర్స్ కోసం ట్రై చేస్తోంది మెహ్రీన్. బిష్ణోయ్‌తో ఎంగేజ్‌మెంట్ అయింది మెహ్రీన్‌కి. అతనికి రీసెంట్‌గా కోవిడ్ సోకడంతో పెళ్లి వాయిదా పడింది. దీంతో ఈ గ్యాప్‌ను మళ్లీ సినిమాల కోసం వాడుకోవాలనుకుంటోన్న మెహ్రీన్.. ఇండస్ట్రీకి హింట్స్ ఇస్తోంది. ఆమె చేతిలో ప్రస్తుతం ఒక్క ‘ఎఫ్ 3’ నే ఉంది. ఇక ఇంతకుముందు వరకు స్టార్స్ సినిమాలకే సైన్ చేసిన అనూ ఇమ్మానుయెల్ ఇప్పుడు ఎవరైనా ఒకే చెప్తోంది. కథ ముఖ్యమంటోంది. ఈమధ్యే అల్లుడు బెల్లంకొండ సరసన ఆడిపాడిన అనూ.. ప్రస్తుతం అల్లు శిరీష్‌తో ‘ప్రేమ కాదంట’ సినిమాలో సందడి చేస్తోంది.

పర్ఫామెన్స్ రోల్స్ మాత్రమే కావాలని ఎదురుచూస్తున్నారు మలయాళీ భామలు. వాళ్లకి నచ్చిన సినిమాలు చేస్తున్నారు. రీసెంట్‌గా పవన్ కల్యాణ్ – రానా రీమేక్ మూవీలో నిత్యా మీనన్ పేరు వినిపించింది. ‘స్కైల్యాబ్’, ‘గమనం’ వంటి డిఫరెంట్ ప్రాజెక్టుల్లో నటిస్తోంది నిత్య. ఈమధ్యే ‘వకీల్ సాబ్’ లో మెరిసిన నివేథా థామస్.. ‘శాకిని – ఢాకిని’ అనే కాన్సెప్ట్ బేస్డ్ మూవీకి సైన్ చేసింది. రెజీనాతో కలిసి ఇందులో నటిస్తోంది. లాంగ్ గ్యాప్ తర్వాత అనుపమా పరమేశ్వరన్, నిఖిల్ ‘18 పేజీస్’ తో పాటు.. దిల్ రాజు బ్యానర్‌లో ‘రౌడీ బాయ్స్’ లో కనిపించనుంది..