South Movies: బాలీవుడ్‌ను వెంటాడుతున్న సౌత్.. సైడ్ ఇచ్చేస్తున్న బీటౌన్!

సౌత్ నుంచి పాన్ ఇండియా సినిమా వస్తుందంటే బాలీవుడ్ కి వెన్నులో వణుకు పుడుతోంది. ముందు పోటీకీ మేము రెడీ అన్నట్టు ఫోజులు కొట్టినా.. చివరికొచ్చేసరికి పోస్ట్ పోన్ అనేస్తున్నారు.

South Movies: బాలీవుడ్‌ను వెంటాడుతున్న సౌత్.. సైడ్ ఇచ్చేస్తున్న బీటౌన్!

South Movies

South Movies: సౌత్ నుంచి పాన్ ఇండియా సినిమా వస్తుందంటే బాలీవుడ్ కి వెన్నులో వణుకు పుడుతోంది. ముందు పోటీకీ మేము రెడీ అన్నట్టు ఫోజులు కొట్టినా.. చివరికొచ్చేసరికి పోస్ట్ పోన్ అనేస్తున్నారు. పోనీ ధైర్యం చేసి నిలబడితే ఈమధ్య సౌత్ హీరోల కటౌట్ ముందు ఢీలా పడ్డ ఎక్జాంపుల్స్ బోలెడు. సో చేసేదేం లేక ఇక్కడి భారీ ప్రాజెక్టులకు బాలీవుడ్ మేకర్స్ సైడ్ ఇస్తున్నారు.

South India Movies: ఇండియన్ సినిమాకు కేరాఫ్ అడ్రస్‌గా సౌత్ సినిమాలు!

షాహిద్ కపూర్ జెర్సీ వాయిదాపడింది. ఏప్రిల్ 14న కేజీఎఫ్2 మూవీకి పూర్తిగా లైన్ క్లియర్ చేసి ఏప్రిల్ 22న వచ్చేలా జెర్సీ ప్లాన్ మార్చేసింది. ఏప్రిల్ 13న కోలీవుడ్ స్టార్ విజయ్ బీస్ట్ కూడా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది. అయితే నార్త్ ఆడియెన్స్ క్రేజీగా ఎదురుచూస్తున్నది మాత్రం కెజీఎఫ్ చాప్టర్ 2 గురించే. అడ్వాన్స్ టికెట్ సేల్స్ విషయంలోనూ అది స్పష్టంగా కనిపిస్తోంది. ప్రమోషన్స్ చేసినా ఇప్పుడు చేసేదేమి లేక షాహిద్ కపూర్ వెనక్కి వెళ్లాల్సి వచ్చింది.

High Budget Movies: నిర్మాతలకు షాక్ కొట్టే సినిమా బడ్జెట్.. ఎందుకిలా పెరిగిపోతుంది?

అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో హిందీ జెర్సీ సినిమాను ప్రొడ్యూస్ చేసింది దిల్ రాజు. తెలుగు రాష్ట్రాల్లో బీస్ట్ తో పాటూ కేజీఎఫ్2ను కూడా తీసుకొస్తున్నది దిల్ రాజే. సో ఈ రెండు హిట్ అవ్వడమే దిల్ రాజుకు కావాల్సింది. అలాంటిది తను ప్రొడ్యూస్ చేసిన జెర్సీని బాలీవుడ్ పోటీ నుంచి తప్పంచి సేఫ్ గేమ్ ఆడుతున్నాడీ ప్రొడ్యూసర్. ఎలాగూ ఈమధ్య సౌత్ భారీ సినిమా ముందు హిందీ ప్రాజెక్ట్స్ నిలబడలేకపోతున్నాయన్న సెంటిమెంట్ కూడా ఉండనే ఉంది.

South Heroins: టార్గెట్ బాలీవుడ్.. సౌత్ గర్ల్స్ అడ్డాగా మారిన బీటౌన్!

ఈమధ్యే ట్రిపుల్ ఆర్ మాకు పోటీ కాదంటూ బరిలోకి దూకి అడ్డంగా బుక్కయ్యాడు జాన్ అబ్రహం. మా వీక్ లో మేము నంబర్ వన్ ఉంటామని చెప్పి కనీసం ట్రిపుల్ ఆర్ 8వ రోజు కలెక్షన్స్ ను కూడా తన మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ తో బీట్ చేయలేకపోయాడు. గతేడాది పుష్పకు ఎదురెళ్లి బోల్తాపడింది 83. కంటెంట్ మీద నమ్మకమున్నా సరే బన్నీ, సుక్కూ మాస్ బాంబ్ ముందు క్లాస్ టచ్ ఇచ్చిన 83 ఖాతా గల్లంతయింది.

High Budget Movies: వందల కోట్ల బడ్జెట్ మూవీస్.. టాలీవుడ్‌లో అసలేం ఏం జరుగుతుంది?

హిందీ సినిమాను సౌత్ ప్రాజెక్ట్స్ వెంటాడుతున్న విషయం ప్రెజెంట్ సినారియో చూస్తే ఇట్టే అర్ధమైపోతుంది. జాగ్రత్తపడిన వాళ్లు గంగూబాయ్ కతియావాడిలా సేఫ్ అయిపోతున్నారు. లేదంటే బాక్సాఫీస్ దగ్గర చతికిలపడుతున్నారు. కేజీఎఫ్2తో క్లాష్ వద్దనుకునే ఏప్రిల్ 14 నుంచి లాల్ సింగ్ చద్దాను తప్పించాడు ఆమీర్ ఖాన్. సేమ్ సూత్రాన్ని పాటించి అక్షయ్ కుమార్ పృథ్వీరాజ్ కూడా జూన్ 3కి షిఫ్ట్ అయింది.