High Budget Movies: వందల కోట్ల బడ్జెట్ మూవీస్.. టాలీవుడ్‌లో అసలేం ఏం జరుగుతుంది?

బడ్జెట్.. బడ్జెట్.. బడ్జెట్.. ఓ క్రేజీ సినిమా స్టార్ట్ అవుతుందంటే ఈమధ్య బడ్జెట్ నే మేకర్స్ హైలైట్ చేస్తున్నారు. వందల కోట్ల పెట్టుబడితో మూవీ తెరకెక్కిస్తున్నామని పెద్ద మాటలు..

High Budget Movies: వందల కోట్ల బడ్జెట్ మూవీస్.. టాలీవుడ్‌లో అసలేం ఏం జరుగుతుంది?

High Budget Movies

High Budget Movies: బడ్జెట్.. బడ్జెట్.. బడ్జెట్.. ఓ క్రేజీ సినిమా స్టార్ట్ అవుతుందంటే ఈమధ్య బడ్జెట్ నే మేకర్స్ హైలైట్ చేస్తున్నారు. వందల కోట్ల పెట్టుబడితో మూవీ తెరకెక్కిస్తున్నామని పెద్ద మాటలు చెప్తున్నారు. అయితే భారీ బడ్జెట్ పెట్టి సినిమాను ఓ రేంజ్ లో తీసుకొస్తే.. చివరికి ఎవరో ఒకరు నష్టపోక తప్పట్లేదు. ఎన్ని లాస్ ఎగ్జాంపుల్స్ కనిపిస్తున్నా ఎందుకు హై లెవెల్ లోనే ప్రొడ్యూసర్స్ ఆలోచిస్తున్నారు.. టాలీవుడ్ ఇండస్ట్రీలో అసలేం జరుగుతోంది..?

High Budget Movies: ఎఫీషియన్సీ లోపం.. సినిమాలను ఆదుకోలేని గ్రాండియర్!

ఓ సినిమా.. వందలమందికి అన్నం పెడుతుంది. ఆ సినిమా సూపర్ హిట్టయితే ఎంతోమంది వెలుగులోకి వస్తారు. కానీ ఫ్లాప్ కొడితే.. పట్టించుకునే వాళ్లుండరు. అదీ భారీ బడ్జెట్ సినిమా పల్టీ కొడితే.. నెత్తి మీద గుడ్డెసుకుని అప్పులపాలు కావడమే. అయితే అందరూ నష్టపోతున్నారని కాదు.. భారీగా పెట్టుబడి పెట్టి ముందుకొస్తున్న సినిమా అడ్డం తిరిగితే.. ఆ లాస్ తట్టుకోవడమే ఇప్పుడు కష్టంగా మారింది.

Postpone Movies: క్రేజీ కాంబినేషన్స్.. కానీ సెట్స్ మీదకెళ్ళడం చాలా లేట్!

స్టార్ హీరో డేట్స్ ఇచ్చాడు.. డైరెక్టర్ ఊపు మీదున్నాడు.. పెట్టుబడి పెట్టేస్తే దండుకోవడమే అన్నట్టు కొందరు ప్రొడ్యూసర్స్ ఆలోచిస్తున్నారు. కానీ సినిమాలో యూనివర్సల్ కంటెంట్ మిస్ అవుతోంది. పాన్ ఇండియా లెవెల్ ఆలోచనలు బాగానే ఉన్నా.. పాన్ ఇండియా వైడ్ కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ ను ఎంచుకోవడంలో పప్పులో కాలేస్తున్నారు. వందల కోట్ల సినిమా బకెట్ తన్నేసాక తీరిగ్గా కూర్చుని ఎక్కడ తప్పు జరిగిందా అని ట్రాజెడీని గుర్తుచేసుకుంటున్నారు.

South India Movies: ఇండియన్ సినిమాకు కేరాఫ్ అడ్రస్‌గా సౌత్ సినిమాలు!

భారీ ప్రాజెక్ట్ ఫ్లాప్ అయితే నష్టం ప్రొడ్యూసర్ కి ఇప్పుడు పెద్దగా లేదు. ప్రస్తుతం లాస్ ఫేస్ చేస్తుంది ఎక్కువ బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు మాత్రమే. నిర్మాత ఇస్తున్న హామీల కారణంగా ఇప్పుడు పోయినా నెక్ట్స్ రాబట్టొచ్చనే నమ్మకంతో డిస్ట్రిబ్యూటర్లు అప్పులు తెచ్చి మరీ సినిమాలను కొనేస్తున్నారు. ప్రెజెంట్ సినారియో చూసుకుంటే.. ఇలాంటి సంఘటనలే కనిపిస్తాయి. పెద్ద సినిమాలను నిర్మించిన ప్రొడ్యూసర్స్ సేఫ్ గానే కనిపిస్తున్నారు. వాటిని నమ్ముకున్న బయర్లే అదృష్టాన్ని నమ్ముకుంటున్నారు.

Spy Movies: స్పైలుగా మారిపోతున్న హీరోలు.. హాలీవుడ్ జానర్ మీద అంత ఇంట్రెస్ట్ ఎందుకో?

నిర్మాతలు కొంచెం సేఫ్ ఎందుకంటే.. వాళ్లు బయ్యర్లకు సినిమాను అమ్ముకుంటారు. ఓటీటీ, డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్ ఇలా రకరకాలుగా వాళ్ల మార్జిన్ ను చేరుకుంటారు. కానీ సినిమా అటు ఇటు అయితే బొక్క బోర్లా పడేది నిర్మాత దగ్గర మంచి రేట్ కి రైట్స్ దక్కించుకున్న వాళ్లే. అలాంటి నష్టాన్ని ఈమథ్య చిన్న హీరోల సినిమాలు కూడా తీసుకొచ్చాయి.

Pan India Movies: స్క్రీన్ స్పేస్ ప్లీజ్.. తెలుగు సినిమాపై బాలీవుడ్ అలక?

లో బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు.. వందల కోట్ల లాభాల్ని తెచ్చిపెట్టిన సందర్భాలు ఎన్నో. అలాగే భారీతనం నిండిన ప్రాజెక్టులు.. మూలకెళ్లిన వైనాన్ని కూడా జనాలు చూస్తూనే ఉన్నారు. అంతిమంగా కంటెంట్ బాగుంటేనే.. జనాన్ని ఎంటర్ టైన్ చేస్తేనే సినిమా ఆడుతుందన్నది వాస్తవం. వేల కోట్లు పెట్టి ఎన్ని సోకులు చేసినా.. కథలో పస లేకుంటే అవన్నీ బూడిదలో పోసిన పన్నీరే. అదీ పాన్ ఇండియా సినిమా అయినా.. లోకల్ డిజె టిల్లు అయినా.