Pan India Movies: స్క్రీన్ స్పేస్ ప్లీజ్.. తెలుగు సినిమాపై బాలీవుడ్ అలక?

తెలుగు సినిమా రేంజ్ మారిపోతోంది. బాలీవుడ్ స్టార్లు కూడా తెలుగు సినిమాల మీద కాన్సన్ ట్రేట్ చేస్తున్నారు. అంతేకాదు తెలుగులో ఏ అవకాశం వచ్చినా సినిమాలు చెయ్యడానికి ఇంట్రస్ట్..

Pan India Movies: స్క్రీన్ స్పేస్ ప్లీజ్.. తెలుగు సినిమాపై బాలీవుడ్ అలక?

Pan India Movies

Pan India Movies: తెలుగు సినిమా రేంజ్ మారిపోతోంది. బాలీవుడ్ స్టార్లు కూడా తెలుగు సినిమాల మీద కాన్సన్ ట్రేట్ చేస్తున్నారు. అంతేకాదు తెలుగులో ఏ అవకాశం వచ్చినా సినిమాలు చెయ్యడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అయితే బాలీవుడ్ వాళ్లు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు కదా అని మనవాళ్లు అక్కడి స్టార్లని వాడుకుంటున్నారా..? సరైన స్క్రీన్ స్పేస్ ఇవ్వడం లేదా..? ఇదంతా చూసి బాలీవుడ్ వాళ్లు టాలీవుడ్ మీద అలిగారా..? ఇక తెలుగులో సినిమా అఫర్ అంటే ఆలోచిస్తున్నారా..?

Pan India Movies: అప్‌నే టైమ్ ఆగయా.. బాలీవుడ్ బెండు తీస్తున్న సౌత్ మూవీస్!

ఒకప్పుడు రిజనల్ అయిన టాలీవుడ్.. ఇప్పుడు ఇంటర్నేషనల్ రేంజ్ లో వెళ్లిపోయింది. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్లు, యాక్టర్లు అయితే.. తెల్లారిలేస్తే.. టాలీవుడ్ ని పొగడడమే పనిగా పెట్టుకున్నారు. అంతేకాదు టాలీవుడ్ సినిమాలు బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అవుతున్నాయి. దీంతో బాలీవుడ్ జనాలు కూడా తెలుగు సినిమాల్లోనటించడానికి తెగ ఇంట్రస్ట్ చూపించారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యేలాఉంది.

Pan India Movies: మారిన ఆడియన్స్ టేస్ట్.. మెప్పించడం అంత ఈజీకాదు!

ఎంత కాదన్నా.. టాలీవుడ్ ఇప్పుడు నేషనల్ వైడ్ గా టాప్ ఇండస్ట్రీ అనిపించుకుంటోంది. దాంతో బాలీవుడ్ స్టార్లు తెలుగు సినిమాల మీద మనసు పడుతున్నారు. ఎలాంటి క్యారెక్టర్లైనా చెయ్యడానికి రెడీ అవుతున్నారు. మనవాళ్లు కూడా బాలీవుడ్ జనాల్నివిచ్చలవిడిగా వాడేస్తున్నారు. అవును.. బాలీవుడ్ స్టార్లని టాలీవుడ్ డైరెక్టర్లు వాడేస్తున్నారని తెగ ఫీలవుతున్నారు.

Pan India Movies: టాలీవుడ్ పాన్ ఇండియా క్రేజ్.. కుళ్ళుకుంటున్న బాలీవుడ్!

తెలుగు సినిమాల మీద బాలీవుడ్ స్టార్లు ఇంట్రస్ట్ చూపిస్తున్నారని టాక్ నడుస్తున్నా.. బాలీవుడ్ లో మాత్రం సెపరేట్ టాక్ వనిపిస్తోంది. లేటెస్ట్ గా బాలీవుడ్ యాక్షన్ హీరో జాన్ అబ్రహం.. నేను ఎప్పటికీ తెలుగులో సినిమాలు చెయ్యనని తేల్చి చెప్పారు. రీజనల్ సినిమాల్లో ఇచ్చే చిన్న చిన్న క్యారెక్టర్ రోల్స్ కోసం తన ఇమేజ్ ని పాడుచేసుకోనని ఓపెన్ గానే చెప్పారు జాన్ అబ్రహం. అంతేకాదు.. ఇవాళ రిలీజ్ అవుతున్న ఎటాక్ మూవీకి ట్రిపుల్ఆర్ మూవీ పెద్ద ఇంపాక్ట్ చూపించదని, నెంబర్ వన్ ప్లేస్ బాలీవుడ్ సినిమాలకే ఉంటుందని కాస్త గట్టిగానే చెప్పారు జాన్.

Pan India Movies: మన సినిమాకి మార్కెట్ క్రియేటర్లుగా పరభాషా నటులు!

తెలుగులో బాలీవుడ్ స్టార్లు నటిస్తున్నారు. కానీ ఎంత సేపు.. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రిపుల్ఆర్ లో ఆలియా, అజయ్ దేవ్ గన్ లాంటి బలీవుడ్ స్టార్లు నటించారు. ఆల్రెడీ బాలీవుడ్ లో సోలోగా సినిమాలు చేస్తూ వంద కోట్లకు పైగా మార్కెట్ ఉన్న ఆలియా ట్రిపుల్ఆర్ లో జస్ట్ 10 నిమిషాలు కనిపించింది. ఇంత పెద్ద స్టార్ హీరోయిన్ కి వాల్యూ లేకుండా ఇంత తక్కువ స్క్రీన్ స్పేసే ఇచ్చారేంటీ అని ఫాన్స్ తో పాటు బాలీవుడ్ వాళ్లు కూడా ఫీలయ్యారు. పాన్ ఇండియా ఇమేజ్ కోసం వాడుకున్నారు కానీ సరైన స్క్రీన్ స్పేస్ ఇవ్వలేదని హాట్ డిస్కషన్స్ కూడా జరిగాయి బాలీవుడ్ లో.

South India Movies: ఇండియన్ సినిమాకు కేరాఫ్ అడ్రస్‌గా సౌత్ సినిమాలు!

ఇక అజయ్ దేవ్ గన్ కి కూడా అంత పెద్ద స్క్రీన్ స్పేస్ ఇవ్వకపోవడంతో బాలీవుడ్ జనాలు బాగానే పైర్ అయ్యారు. అంతేకాదు.. ట్రిపుల్ఆఱ్ ప్రమోషన్స్ లో కూడా అటు ఆలియా కానీ, ఇటు అజయ్ కానీ ఏమంత యాక్టివ్ గా లేరని టాక్. సినిమా రిలీజ్ అప్పుడు కానీ, ఈరేంజ్ లో కలెక్షన్లు వచ్చినప్పుడు కానీ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక్కపోస్ట్ కూడా పెట్టలేదు. ఆలియా అలిగిందన్న రూమర్స్ బాగా స్ప్రెడ్ అవ్వడంతో లేటెస్ట్ గా అబ్బే.. అలాంటిదేం లేదని ఫార్మల్ గా సోషల్ మీడియాలో మెసేజ్ పాస్ చేసింది ఆలియా.

Star Heroes Movies: కాలం చెల్లిన రొటీన్ సినిమా.. అష్టకష్టాలు పడుతున్న హీరోలు

పాన్ ఇండియా ఇమేజ్ కోసం బాలీవుడ్ స్టార్లని బాగా వాడుకుంటున్నారు కానీ.. వాళ్లను సినిమాలో హైలెట్ చెయ్యడం లేదని, చిన్న రోల్సే ఇస్తున్నారని గరమ్ అవుతున్నారు బాలీవుడ్ ఫాన్స్. అజయ్, ఆలియా అనేకాదు.. అమితాబ్ బచ్చన్ కూడా అంతకుముందు మనం, సైరా లాంటి సినమాల్లో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. ఇమేజ్ ఫాక్టర్ కోసం వాడుతున్నారే కానీ.. క్రెడిట్ మాత్రం ఇవ్వడం లేదని టాక్.

Telugu Dubbing Movies: నేషనల్ వైడ్ తెలుగు సినిమా డబ్బింగ్ మేళా

ఇలా బాలీవుడ్ స్టార్లని జస్ట్ ఇమేజ్ కోసం వాడుకుంటున్నారని, సరైన వాల్యూ ఇవ్వడం లేదని, బాలీవుడ్ తర్వాతే టాలీవుడ్ అని ఫీలవుతున్నారు. ఇది అందరూ ఫీలయితే.. టాలీవుడ్ నుంచి సినిమా ఆఫర్లొస్తే.. ఎంత పెద్ద సినిమా అయినా.. ఎంత పెద్ద స్టార్ కాస్ట్ ఉన్నా.. ఏ రేంజ్ పాన్ ఇండియా మూవీ అయినా ఆలోచించి ఓకే చెప్పాల్సొస్తుంది బాలీవుడ్ స్టార్లు.