High Budget Movies: కంటెంట్ లేదా.. హైఎండ్ వాల్యూస్ ఉన్నా బూడిదలో పోసిన పన్నీరే!

రాబోతున్న సినిమాల్లో మాక్సిమమ్ పాన్ ఇండియా సినిమాలే. ఇప్పుడు జాగ్రత్త పడకపోతే రిలీజయ్యాక చేసేదేమి ఉండదు. స్టార్స్, డైరెక్టర్స్, కాస్ట్.. అందరూ సైడై అయిపోతారు. నిర్మాత కూడా..

High Budget Movies: కంటెంట్ లేదా.. హైఎండ్ వాల్యూస్ ఉన్నా బూడిదలో పోసిన పన్నీరే!

High Budget Movies (2)

High Budget Movies: రాబోతున్న సినిమాల్లో మాక్సిమమ్ పాన్ ఇండియా సినిమాలే. ఇప్పుడు జాగ్రత్త పడకపోతే రిలీజయ్యాక చేసేదేమి ఉండదు. స్టార్స్, డైరెక్టర్స్, కాస్ట్.. అందరూ సైడై అయిపోతారు. నిర్మాత కూడా పెద్దగా నష్టపోడు. కానీ గంపెడు ఆశలు పెట్టుకుని సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన వాళ్లే.. చివరకు మిగిలింది ఇదని బాధపడక తప్పదు.

10 రూపాయలతో తీద్దామనుకుంటే 100 అవుతోంది.. 150 వస్తాయనుకుంటే.. అది మాత్రం కలగానే మిగిలిపోతుంది. ఇలా హై బడ్జెట్ సినిమాల పరిస్థితి ఘోరంగా తయారైంది. ఓటీటీకి ప్రస్తుతం డిమాండ్ బాగా పెరిగింది. మార్కెట్ లో కుప్పలు తెప్పలుగా ఓటీటీలు వచ్చేస్తున్నాయి. ఇంట్లోకే సరుకు వచ్చేస్తుంటే.. పబ్లిక్ థియేటర్ కి వెళ్లే ఛాన్స్ తగ్గిపోతుంది. ఆడియెన్స్ రేషియో తగ్గిపోవడం వల్ల కూడా పెట్టిన పెట్టుబడికి తగిన ఫలితం ఉండట్లేదనేది నిజం.

High Budget Movies: వందల కోట్ల బడ్జెట్ మూవీస్.. టాలీవుడ్‌లో అసలేం ఏం జరుగుతుంది?

ఓటీటీని దాటి ప్రేక్షకుడు.. థియేటర్ కి రావాలంటే అంతకుమించి అన్న లెవెల్ లో స్క్రీన్ ఉండాలి. అందుకే ఇంతలా ఖర్చు పెడుతున్నామంటున్నారు మేకర్స్. అందుకే టాలీవుడ్ స్థాయి పాన్ ఇండియాను రీచ్ అయిందని చెప్తున్నారు. ఒక వేళ అంచనాలను అందుకోలేకపోతే కనీసం బ్రేక్ ఈవెన్ కూడా అవని పరిస్థితి ఉంది. అయినా సరే స్టార్ కాస్ట్ ను సెట్ చేసుకుని ధైర్యంగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోడానికే కొందరు నిర్మాతలు మొగ్గుచూపుతున్నారు.

Postpone Movies: క్రేజీ కాంబినేషన్స్.. కానీ సెట్స్ మీదకెళ్ళడం చాలా లేట్!

కంటెంట్ కు ప్రాధన్యత నిచ్చే మలయాళ సినిమాలు ఇంత ఖర్చుపెట్టి పాన్ ఇండియా సోకుని కోరుకోవట్లేదు. తమిళ్, కన్నడలో కూడా పెద్దగా భారీ సినిమాలు రావట్లేదు. బాలీవుడ్ లో బిగ్ స్టార్స్ సందడే కరువైంది. సో ఇప్పుడందరి చూపు టాలీవుడ్ వైపే. అందుకే ఇక్కడికే తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ స్టార్స్ వస్తున్నారు. ప్రొడ్యూసర్స్ పెట్టుబడి పెడతామంటున్నారు. లైన్ లో ఉన్న సినిమాలను చూసుకుంటే ఈ విషయం ఇట్టే తెలిసిపోతుంది.

High Budget Movies: ఎఫీషియన్సీ లోపం.. సినిమాలను ఆదుకోలేని గ్రాండియర్!

సలార్, ప్రాజెక్ట్ కె, చరణ్ – శంకర్, తారక్ – కొరటాల శివ, బన్నీ- సుకుమార్ పుష్ప2, లైగర్, జనగణమన, హరిహర వీరమల్లు వీటన్నింటికి మించి రాజమౌళి – మహేశ్ ప్రాజెక్ట్ ఇలా ఇంకా ఎన్నో భారీ సినిమాలు రాబోతున్నాయి. యంగ్ హీరోలు కూడా రిచ్ కంటెంట్ కోసం నిర్మాతలు ఖర్చు చేసేలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఏం చేసినా.. ఎవరూ చేసినా.. ప్రేక్షకులు తీర్పుని బట్టే ఫలితముంటుంది. ఓటీటీని వద్దనుకుని.. టికెట్ రేట్ ను లెక్క చేయకుండా ఆడియెన్స్ థియేటర్స్ కి రావాలంటే భారీ బడ్జెట్ కి తగిన ఎలిమెంట్స్ ఉండాలి. లేదంటే చివరకు మిగిలేది ఏంటో తెలుగులో రాధేశ్యామ్, ఖిలాడీ.. హిందీలో బచ్చన్ పాండే, అటాక్ కోసం ఖర్చు పెట్టిన వారిని అడిగితే తెలుస్తుంది.