Postponed Movies: అటకెక్కిన సినిమాలు.. సర్ సర్లే ఎన్నెన్నో అనుకుంటాం!

ఎన్నెన్నో అనుకుంటాం.. అన్నీ అవుతాయాఏంటి..? సినిమాలు కూడా అంతే.. స్టార్ హీరోలు, క్రేజీ డైరెక్టర్లు అబ్బ.. కాంబినేషన్ అదిరిపోతుంది.. బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనుకుని సరికొత్త సినిమాల్ని అనౌన్స్ చేశారు. కానీ పట్టాలెక్కి కొన్ని, సెట్స్ మీదకెళ్లకుండానే కొన్ని, అనౌన్స్ మెంట్ల వరకూ రాకుండానే మరికొన్ని మిడిల్ డ్రాప్ అయిపోయాయి.

Postponed Movies: అటకెక్కిన సినిమాలు.. సర్ సర్లే ఎన్నెన్నో అనుకుంటాం!

Postponed Movies

Postponed Movies: ఎన్నెన్నో అనుకుంటాం.. అన్నీ అవుతాయాఏంటి..? సినిమాలు కూడా అంతే.. స్టార్ హీరోలు, క్రేజీ డైరెక్టర్లు అబ్బ.. కాంబినేషన్ అదిరిపోతుంది.. బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనుకుని సరికొత్త సినిమాల్ని అనౌన్స్ చేశారు. కానీ పట్టాలెక్కి కొన్ని, సెట్స్ మీదకెళ్లకుండానే కొన్ని, అనౌన్స్ మెంట్ల వరకూ రాకుండానే మరికొన్ని మిడిల్ డ్రాప్ అయిపోయాయి. ఇలా అటకెక్కిన సినిమాలేంటో డీటెయిల్డ్ గా చూద్దాం.

Bollywood Movies: బాలీవుడ్ కి చేతకావట్లేదా? సౌత్ ను చూసి నేర్చుకోవాల్సిందేనా?

సినిమా ఇండస్ట్రీలో అంతే.. ఎప్పుడు ఏ నిమిషం ఏమైనా జరగొచ్చు. డేట్స్ అడ్జస్ట్ చేసుకుని హీరో, డబ్బలు పెట్టడానికి ప్రొడ్యూసర్, తెరకెక్కించే డైరెక్టర్.. ఇలా అందర్నీ సెట్ చేసుకుని సినిమా ప్లాన్ చేసుకుంటే చివరికి ఆ సినిమా అడ్రస్ లేకుండాపోతోంది. వకీల్ సాబ్ డైరెక్టర్ వేణుశ్రీరామ్, అల్లుఅర్జున్ కాంబినేషన్లో అప్పుడెప్పుడో 5 ఏళ్ల క్రితం మొదలైన ఐకాన్.. ఇప్పుడు అడ్రస్ లేదు. అసలు సినిమా స్టార్టవుతుందా.. లేదా అనే క్లారిటీ లేదు. ఎందుకంటే ప్రొడ్యూసర్ దిల్ రాజు ఐకాన్ ఆగిపోలేదని చెబుతున్నారు.. అటు హీరో అల్లు అర్జున్ ఏమో .. ఐకాన్ తప్ప.. మిగిలిన సినిమా షూటింగ్స్అన్నీ చేస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం ఈ ఐకాన్ అటకెక్కనట్టే అంటున్నారు ఫాన్స్.

Malty starrer Movies: వచ్చేస్తున్న టాప్ స్టార్ మల్టీస్టారర్ కాంబినేషన్స్!

వెంకటేష్, తరుణ్ భాస్కర్ కాంబినేషన్లో హైదరాబాద్ రేసింగ్ క్లబ్ బ్యాక్ డ్రాప్ లో కూడా ఓ మూవీ ప్లాన్ చేశారు. ఇదిగో స్టారటవుతుంది.. అదిగో స్టార్టవుతుందని చెబుతున్నా.. ఇప్పటి వరకూ ఈ సినిమా మీద ఎటువంటి అప్ డేట్ లేదు.. కాబట్టి ఈ సినిమా కూడా ప్రస్తుతం లైమ్ లైట్లో లేనట్టే. మంచు విష్ణు, శ్రీను వైట్ల కాంబినేషన్లో అప్పట్లో వచ్చిన క్రేజీ ఎంటర్ టైనర్ ఢీ కి సీక్వెల్ గా సినిమాని అనౌన్స్ చేశారు. కానీ క్రియేటివ్ డిఫరెన్సెస్ తో ఈ సినిమా ఆగిపోయినట్టు తెలుస్తోంది.

Tamil Movies: ఒకే కథను అరగదీస్తున్న దర్శకులు.. వాళ్ళకే ఓటేస్తున్న హీరోలు!

డైరెక్టర్ వినాయక్ హీరోగా, నరసింహ డైరెక్షన్లో ప్లాన్ చేసిన సినిమా గ్రాండ్ గా స్టార్టయ్యింది. ఈ సినిమా కోసం వినాయక్ వెయిట్ లాస్ కూడా అయ్యారు. అప్పట్లో షూట్ స్టార్ట్ అయ్యిందన్నారు కానీ.. వినాయక్ మళ్లీ డైరెక్షన్లో బిజీ అవ్వడంతో శీనయ్య సినిమా అటకెక్కింది. విజయ్ దేవరకొండ, హుషారు డైరెక్టర్ హర్ష కాంబినేషన్లో సినిమా ఆల్ మోస్ట్ సెట్ అయ్యింది.. ఇక సెట్స్ మీదకెళ్లడమే లేటనుకున్నారు.. కానీ ఈ రౌడీ హీరో పాన్ ఇండియా హీరోగా బిజీ అవ్వడంతో హర్ష సినిమాని పక్కన పెట్టేసినట్టే అంటున్నారు జనాలు.