Tamil Movies: ఒకే కథను అరగదీస్తున్న దర్శకులు.. వాళ్ళకే ఓటేస్తున్న హీరోలు!

తమిళ్ హీరోలు, దర్శకుల మధ్య ఉన్న ఈక్వేషన్స్ కూడా ఏంటో ఎవ్వరికీ అర్ధం కాదు. ఒకే కథను మార్చి మార్చి చెప్తోన్న డైరెక్టర్స్ కే అక్కడి స్టార్స్ ఓటేస్తున్నారు.

Tamil Movies: ఒకే కథను అరగదీస్తున్న దర్శకులు.. వాళ్ళకే ఓటేస్తున్న హీరోలు!

Tamil Movies (1)

Tamil Movies: తమిళ్ హీరోలు, దర్శకుల మధ్య ఉన్న ఈక్వేషన్స్ కూడా ఏంటో ఎవ్వరికీ అర్ధం కాదు. ఒకే కథను మార్చి మార్చి చెప్తోన్న డైరెక్టర్స్ కే అక్కడి స్టార్స్ ఓటేస్తున్నారు. అదే మాస్ మ్యానరిజం కావాలంటోన్న హీరోల మాటలకు డైరెక్టర్స్ ఎదురు చెప్పలేకపోతున్నారు. ఈ ఈక్వెషన్ లో తేడా వచ్చింది కాబట్టే అక్కడి దర్శకులు టాలీవుడ్ హీరోలను నమ్ముకుంటుంటే… కోలీవుడ్ హీరోలు ఇక్కడి దర్శకులపై భారం వేస్తున్నారు.

Tamil Movies: సినీ వెలుగంతా తమిళ పరిశ్రమదే.. కానీ అదంతా గతం!

డబ్బింగ్ సినిమాలతో తమిళ్ హీరోలు మన ఆడియెన్స్ కు ఎప్పటినుంచో పరిచయమే. కంటెంట్ బాగుంటే తమిళ్ డబ్బింగ్ సినిమాలు మన దగ్గర బ్లాక్ బస్టర్ కొట్టినవి చాలానే ఉన్నాయి. అసలొకప్పుడు డబ్బింగ్ పాటలదే హవా నడిచిందిక్కడ. కొందరు స్టార్స్ తెలుగు సినిమాల్లో నటించారు కూడా. అయితే సడెన్ గా సీన్ మారిపోయింది. స్టైయిట్ తెలుగు సినిమా చేయాలని కలలు కంటున్నారు కోలీవుడ్ హీరోలు. తెలుగులో ఫేమ్ ఉన్న డైరెక్టర్స్ తో, పెద్ద ప్రొడక్షన్ హౌజ్ లతో డీల్ మాట్లాడుకుంటున్నారు. సేమ్ టైమ్ టాలీవుడ్ స్టార్స్ తో సినిమాలు చేసేందుకు తమిళ్ డైరెక్టర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

Tamil Movies: కోలీవుడ్ కి ఏమైంది.. గుణపాఠం నేర్పేదెవరు?

కోలీవుడ్ స్టార్స్ తో సినిమాలు తీసి టాప్ ఇండియన్ గ్రాసర్స్ ను సృష్టించాడు డైరెక్టర్ శంకర్. జెంటిల్మెన్, భారతీయుడు, అపరిచితుడుతో నేషనల్ ఆడియెన్స్ మాట్లాడుకునేలా చేసి శివాజీ, రోబో, 2.0 సినిమాలతో నార్త్ లోనూ సత్తా చాటాడు శంకర్. ఇండియన్ 2 ఇష్యూ తర్వాత అక్కడి హీరోలతో చేయలేక ఇప్పుడు స్టైయిట్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేస్తున్నాడు. రామ్ చరణ్ తో సినిమాను లైన్ లో పెట్టిన శంకర్ పాన్ ఇండియా మ్యాసివ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

Tamil Movies: అరవ హీరోల రొటీన్ ఫార్ములా.. ఎన్నాళ్లీ రొడ్డకొట్టుడు సామీ!

తమిళ్ సినిమా జెండాను వరల్డ్ వైడ్ కనిపించేలా ఎగిరేసారు మణిరత్నం. ఒకటా రెండా.. ఫిల్మ్ హిస్టరీలో నిలిచిపోయే సినిమాలను చాలానే ప్రేక్షకులకు అందించారు. ఇప్పుడు పొన్నియన్ సెల్వన్ రెండు భాగాలతో మళ్లీ నేషనల్ ఆడియెన్స్ మాట్లాడుకునేలా చేస్తానని చెప్తున్నారు. గజిని, సెవెన్స్ సెన్స్, తుపాకీ, కత్తి, సర్కార్ లాంటి సినిమాలతో పేరుతెచ్చుకున్న ఏఆర్ మురుగుదాస్.. దర్బార్ తర్వాత సైలంటయిపోయాడు. భారతీరాజా, బాలు మహేంద్ర లాంటి సీనియర్ డైరెక్టర్స్ ట్రెండ్ కి తగ్గ ప్రాజెక్ట్లు తీసుకొచ్చే పొజిషన్ లో లేరు. ఇక లింగుస్వామి లాంటి డైరెక్టర్ హీరో రామ్ తో సినిమా చేస్తుంటే.. దర్శకుడు వెంకట్ ప్రభు నాగచైతన్యతో సినిమా పట్టాలెక్కించాడు. ఇలా కాస్త పేరున్న వాళ్లు ఓన్ ప్రాజెక్ట్స్, పక్క రాష్ట్రాల హీరోలతో పని కానిచ్చేస్తున్నారు.

Tamil Movies: కథలేని సినిమాలు.. లాజిక్ మిస్సైతే అడ్రెస్స్ గల్లంతే

లోకేష్ కనగరాజ్, కార్తీక్ సుబ్బరాజ్, నెల్సన్ దిలీప్ కుమార్, పా రంజిత్, హెచ్ వినోద్ లాంటి కోలీవుడ్ డైరెక్టర్స్.. ఒకేలాంటి కథలను ప్రజెంట్ చేస్తున్నారు. వాళ్ల ఇమాజినేషన్ నుంచి బయటపడట్లేదు. ఇక సెల్వ రాఘవన్ కాస్త బెటర్. తమిళ్ ఆడియెన్స్ ను పూర్తిగా సాటిస్ ఫై చేసేలా సెల్వ రాఘవన్ ఆలోచిస్తాడు. అప్పుడప్పుడు అవుట్ ఆఫ్ ది బాక్స్ అనేలా ఈయన సినిమాలుంటాయి. అయితే వీళ్లెవరూ కూడా తమిళ్ మార్కెట్ ను విస్తరించాలనే ఆలోచనలో ఉన్నట్టు కనిపించరు.

South India Movies: ఇండియన్ సినిమాకు కేరాఫ్ అడ్రస్‌గా సౌత్ సినిమాలు!

తమిళ్ డైరెక్టర్స్ పై ఆధారపడకుండా నేషనల్ వైడ్ మార్కెట్ పెంచాలనుకుంటోన్న హీరోలు ఒక్కొక్కరుగా టాలీవుడ్ బాట పడుతున్నారు. మొదటి నుంచి తమిల్ బార్డర్ దాటి.. నేషనల్ స్టార్ అనిపించుకోవాలనే ఆశ ధనుశ్ లో కనిపిస్తుంది. అందుకు తగ్గట్టు బాలీవుడ్ సినిమాలు కూడా చేసిన ధనుశ్.. తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరితో సినిమాను లాంచ్ చేసాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ ధనుశ్ హీరోగా సార్ సినిమాను పట్టాలెక్కించింది. ఇక అతిత్వరలో శేఖర్ కమ్ముల – ధనుశ్ కాంబో మూవీ కూడా పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. అంతేకాదు అల్లు అర్జున్, ధనుశ్ కాంబోలో క్రేజీ మూవీకి వర్క్ జరుగుతున్నట్టు తెలుస్తోంది.

Tollywood Big Movies: ఎంత తోప్ సినిమా అయినా.. లెక్కలు తేల్చేది ప్రేక్షకులే!

శివ కార్తీకేయన్ తన 20వ సినిమాను తెలుగు డైరెక్టర్ తో చేయబోతున్నాడు. జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ తో శివ కార్తీకేయన్ సినిమా సెట్స్ పై ఉది. నిజానికి ఫస్ట్ ఇనిషియేట్ తీసుకుంది దళపతి విజయ్. విజయ్ తెలుగు మూవీ ప్రకటించిన తర్వాతే మిగిలిన వాళ్లు ఒక్కొక్కరుగా ముందుకొచ్చారు. తమిళ్ ఎంట్రీ ఇచ్చి దశాబ్దాలు గడుస్తోన్న ఎప్పుడూ తెలుగు సినిమా చేయలనుకోలేదు విజయ్. అయితే మారుతున్న లెక్కలు, మార్కెట్ పెంచుకోవాలనే ఆశలు, పాన్ ఇండియా ఫోజలు అన్నీ విజయ్ ని మార్చేసాయి. వంశీ పైడిపల్లి, దిల్ రాజు కాంబోలో విజయ్ తన 66వ ప్రాజెక్ట్ ను ఈమధ్యే స్టార్చ్ చేసాడు.

High Budget Movies: ఎఫీషియన్సీ లోపం.. సినిమాలను ఆదుకోలేని గ్రాండియర్!

ఎప్పుడో తెలుగు ప్రేక్షకుల్లో ఇంపాక్ట్ చూపించిన సూర్య, కార్తీ, విక్రమ్ లాంటి హీరోలు ఆల్రెడీ తెలుగు డైరెక్ట్ సినిమాలు చేసారు. రక్త చరిత్ర2తో సూర్య, ఊపిరితో కార్తీ డెరెక్ట్ గానే పలకరించారు. అయితే వీళ్లు ఈసారి మరింత గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ వేస్తున్నారు. ఇప్పటికిప్పుడు కాకపోయినా సూర్య, బోయపాటి శ్రీను కాంబో ఖచ్చితంగా పట్టాలెక్కుతుంది.

Tamil Films: ఫుల్ యాక్షన్ మోడ్.. దుమ్ములేపుతున్న తమిళ తంబీలు

చివరగా ఒక్కటి… తమ పరిధిని దాటి ఆలోచించగలవారి కల… కేజీఎఫ్ చాప్టర్2. గొప్ప రిసోర్సెస్, వేల కోట్ల బడ్జెట్ లేకపోయినా తమ ఉద్వేగం, సాహసమే పెట్టుబడిగా ప్రపంచ స్థాయి అవుట్ పుట్ ఇవ్వడం అనేది హోంబలే టీమ్ సాధించిన గొప్ప అచీవ్ మెంట్. ఒక హార్డ్ బాయిల్డ్ సోల్ ని రాకీ బాయ్ లోకి ఆవాహన చేయించి ఆ పాత్రని ఒక సూపర్ హీరో స్థాయిలో నిలబెట్టాడు దర్శకుడు. ఇదే ఎవరైనా గుర్తించాల్సింది. ఇక్కడే తమిళ్ సినిమా తడబడుతోంది. అయితే అందరూ ఇంతలా అతిహీరోయిజాన్నే నమ్ముకోవాలని కాదు… రొడ్డకొట్టుడు కథలు, స్క్రీన్ ప్లే, మ్యూజిక్ కు మాత్రం దూరంగా ఉండాలని. ఇది అక్కడ సాధ్యపడదు అనుకున్నారో ఏమో… తెలుగు డైరెక్టర్స్ ను తమిళ్ హీరోలు… తెలుగు హీరోలను తమిళ్ డైరెక్టర్స్ నమ్ముకుంటున్నారు.