Tamil Movies: కోలీవుడ్ కి ఏమైంది.. గుణపాఠం నేర్పేదెవరు?

టాలీవుడ్ అంటే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అన్నట్టు తయారైంది. శాండిల్ వుడ్ కూడా సంకెళ్లు తెంచుకుంది. మలయాళీ ఇండస్ట్రీ సైతం గిరి గీసుకుని లేదు.

Tamil Movies: కోలీవుడ్ కి ఏమైంది.. గుణపాఠం నేర్పేదెవరు?

Tamil Movies

Tamil Movies: టాలీవుడ్ అంటే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అన్నట్టు తయారైంది. శాండిల్ వుడ్ కూడా సంకెళ్లు తెంచుకుంది. మలయాళీ ఇండస్ట్రీ సైతం గిరి గీసుకుని లేదు. ఇలా సౌత్ ని చూసి బాలీవుడ్ కి చెమటలు పడుతున్నాయిప్పుడు. కానీ అన్ని రకాలుగా లో ఫేజ్ లో కోలీవుడ్ ఇండస్ట్రీ నడుస్తోంది. ఎందుకు ఇతర మేకర్స్ తలదన్నేలా కోలీవుడ్ లీడ్ తీసుకోలేకపోతుంది. కారణం ఏమై ఉంటుంది..?

Tamil Movies: అరవ హీరోల రొటీన్ ఫార్ములా.. ఎన్నాళ్లీ రొడ్డకొట్టుడు సామీ!

తమిళ్ ఇండస్ట్రీకి ఏమైంది… హీరోలు ఎందుకు పరిథి దాటి ఆలోచించలేకపోతున్నారు… ఇప్పుడివే చర్చలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. రీసెంట్ రిలీజ్ బీస్ట్ తో ఫ్యాన్స్ వాళ్ల పరువు పోయినట్టు ఫీల్ అవుతున్నారు. ఏదో పాన్ ఇండియా బిల్డప్ ఇచ్చి నార్త్ లో రిలీజ్ చేస్తే… సింగిల్ టికెట్స్ కూడా తెగక… థియేటర్స్ నుంచి ఎత్తేసారు. ఏపీ తెలంగాణతో సహా దేశంలోని చాలా చోట్ల బీస్ట్ కలెక్షన్స్ దారుణంగా ఉన్నాయి. అంతెందుకు సొంత రాష్ట్రంలో పరిస్థితీ అంతంత మాత్రమే. కేవలం బిజినెస్ లెక్కలు చూసుకుని కథలు లైట్ తీసుకుంటే ఎంత పెద్ద స్టార్ కైనా ఇలాంటి అవమానాలు తప్పవు. అయితే.. ఎందుకిలా జరుగుతోంది..?

Tamil Movies: కథలేని సినిమాలు.. లాజిక్ మిస్సైతే అడ్రెస్స్ గల్లంతే

నిర్మాత అరుణ్ పాండ్యన్ చేసిన వ్యాఖ్యలు తమిళ్ హీరోలకు కోపం తెప్పిచ్చొచ్చు. కానీ తమిళ్ మేకర్స్ లో మాక్సిమమ్ ఇలాంటి ఫీలింగ్ కనిపిస్తుంది. సినిమాకు 100 కోట్ల బడ్జెట్ అనుకుంటే అందులో 10 శాతం వరకు మాత్రమే కంటెంట్ కు ఖర్చు పెట్టి… మిగిలింది స్టార్స్ కు సమర్పించుకోవడమే అన్నట్టు కోలీవుడ్ తయారైందని… అందుకే తమిళ్ సినిమా నశించిపోతుందనేది చాలామంది చెప్తున్న మాటే. అంటే మా కటౌట్ చాలు.. లాభాలు ఆటోమేటిక్ గా వచ్చేసాయనేది హీరోల వర్షన్. సో కథ, కాకరకాయ లాంటి అవసరమా అన్నట్టు పరిస్థితి తయారైంది కాబట్టే… సినిమాల రిజల్ట్ బెడిసికోడుతుందన్నది 70ఎంఎం స్క్రీన్ పై కనిపిస్తోంది.

South India Movies: ఇండియన్ సినిమాకు కేరాఫ్ అడ్రస్‌గా సౌత్ సినిమాలు!

తమిళ ఇండస్ట్రీ ఎటు వైపు వెళ్తుందన్నది అక్కడి వారికే అర్ధం కావట్లేదు. ఎటూ పాలుపోక విజయ్, ధనుశ్, సూర్య, శివకార్తీకేయన్ లాంటి హీరోలు తెలుగు దర్శకులను నమ్ముకుంటున్నారు. మేమేం తక్కువ తినలేదని శంకర్, లింగుస్వామి, వెంకట్ ఫ్రభు లాంటి తమిళ్ డైరెక్టర్స్ తెలుగు హీరోలతో సినిమాలు చేస్తున్నారు. మొత్తంగా తమిళ్ సినిమాకంటే తెలుగు ప్రాజెక్ట్స్ బ్రహ్మాండంగా రూపొందుతున్నాయని అక్కడి వాళ్లు మొహమాటం లేకుండా ఒప్పేసుకుంటున్నారు. ప్రజెంట్ తెలుగు సినిమాదే అగ్రస్థానమని తమిళ్ ప్రముఖ డైరెక్టర్ భారతీరాజా సైతం పొగడ్తలతో ముంచెత్తారు.

Tollywood Big Movies: ఎంత తోప్ సినిమా అయినా.. లెక్కలు తేల్చేది ప్రేక్షకులే!

410 కోట్లతో రూపొందిస్తే అందులో 10 కోట్లే కథకు ఖర్చుపెట్టి మిగిలింది నటులు తమ కోసమే ఖర్చు పెట్టిస్తున్నారని, అలా తమిళ సినిమా నశించిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారన్నారు. నిజం చెప్పాలంటే ప్రస్తుతం తమిళ సినిమాల కంటే తెలుగు సినిమాలు బ్రహ్మాండంగా రూపొందుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాయన్నారు. తమిళం, మలయాళం చిత్రాల కంటే తెలుగు సినిమానే అగ్రస్థానంలో ఉందని భారతీరాజా పేర్కొన్నారు.