Jayasudha : జయసుధకు ఏమైంది? ఆందోళనలో అభిమానులు..

రీసెంట్‌గా జయసుధ షేర్ చేసిన పిక్ చూస్తే ఈ వార్తలు నిజమేనేమో అనిపిస్తుంది..

Jayasudha : జయసుధకు ఏమైంది? ఆందోళనలో అభిమానులు..

Jayasudha

Updated On : November 23, 2021 / 5:52 PM IST

Jayasudha: తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ సినిమాల్లో స్టార్ హీరోలతో నటించి, ఎమ్మెల్యేగానూ పనిచేశారు సీనియర్ నటి జయసుధ. ఇప్పుడు ఆమె గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సహజనటిగా ప్రేక్షకులను ఆకట్టుకున్న జయసుధ అనారోగ్యానికి గురయ్యారనేది ఆ వార్త సారాంశం.

Jayamma Panchayathi : సుమ సినిమా సాంగ్ అదిరిపోయిందిగా..

సెకండ్ ఇన్నింగ్స్‌లో మధర్ క్యారెక్టర్ అంటే మేకర్స్ ఆమెనే తీసుకునేవారు. అలాంటి రోల్స్‌తోనే బిజీ అయిపోయారు జయసుధ. అయితే ఆమె కొద్ది రోజులుగా విదేశాల్లో ఉంటున్నారు. అనారోగ్య కారణాల వలనే ట్రీట్‌మెంట్ కోసం విదేశాలకు వెళ్లారని వార్తలు వస్తున్నాయి. రీసెంట్‌గా జయసుధ షేర్ చేసిన పిక్ చూస్తే ఈ వార్తలు నిజమేనేమో అనిపిస్తుంది.

Thank You Movie : కూల్ అండ్ స్టైలిష్ లుక్‌లో నాగ చైతన్య..

కళగా ఉండే ఆమె ముఖం కాస్త కొత్తగా కనిపించడంతో పాటు బరువు తగ్గినట్లుగా ఉన్నారు. ‘స్మైల్.. ఇట్స్ ఫ్రీ థెరపీ’ అంటూ జయసుధ ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో షేర్ చేశారు. దీంతో ఫ్యాన్స్, నెటిజన్స్ ఆమె అనారోగ్యంతో ఉన్నారా.. జయసుధకు ఏమైంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. త్వరలో ఆమె హైదరాబాద్ తిరిగి రాబోతున్నారని తెలుస్తోంది. స్వయంగా జయసుధనే తన హెల్త్ గురించి వస్తున్న వార్తల గురించి క్లారిటీ ఇస్తేనే కానీ ఇలాంటి ప్రచారాలు ఆగవు.