Akshay Kumar : ‘బెల్ బాటమ్’ రిలీజ్ డేట్ ఫిక్స్..

జెట్ స్పీడ్‌లో సినిమాలు చేసే అక్షయ్ కుమార్ .. తన సినిమాల్ని కంప్లీట్ చెయ్యడమే కాకుండా అప్‌కమింగ్ మూవీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేశారు..

Akshay Kumar : ‘బెల్ బాటమ్’ రిలీజ్ డేట్ ఫిక్స్..

Akshay Kumar Confirms Bell Bottom Release Date

Akshay Kumar: సినిమా ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే నార్మల్ స్టేజ్‌కి వస్తోంది. వన్ బై వన్ షూటింగ్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. కొత్త సినిమాల జోలికి వెళ్లకుండా ఉన్న సినిమాల్ని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు స్టార్లు. అసలే జెట్ స్పీడ్‌లో సినిమాలు చేసే అక్షయ్ కుమార్ .. తన సినిమాల్ని కంప్లీట్ చెయ్యడమే కాకుండా అప్‌కమింగ్ మూవీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేశారు.

కరోనాతో సినిమాల షూటింగ్స్ ఆగిపోయి రిలీజ్‌లన్నీ పోస్ట్‌పోన్ అయిపోయాయి. ఇప్పుడిప్పుడే ఆ ఆగిపోయిన సినిమాల షూటింగ్స్ మొదలు పెడుతున్నారు స్టార్లు. అందరూ షూటింగ్స్ అవ్వక సినిమాలు పోస్ట్‌పోన్ చేసుకుంటుంటే.. అక్షయ్ కుమార్ మాత్రం అనుకున్న టైమ్ కన్నా ముందే షూటింగ్ కంప్లీట్ చేసి, అనౌన్స్ చేసిన టైమ్ కంటే ముందే రిలీజ్ చేస్తున్నారు.

అక్షయ్ కుమార్.. ఈ బాలీవుడ్ స్టార్ హీరో ఏ సినిమా చేసినా కాసుల వర్షమే. ఆ క్రేజ్‌ని క్యాష్ చేసుకోవడానికి వరసగా సినిమాలు చేస్తున్నారు అక్షయ్. ఒకప్పుడు మొనాటనస్ సినిమాలు చేసిన ఈ హీరో, ఇప్పుడు వెరైటీకే ఓటేస్తున్నారు. అలా తెరకెక్కిన సినిమా ‘బెల్ బాటమ్’. అక్షయ్ కుమార్, వాణి కపూర్, హ్యూమా ఖురేషి లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ‘బెల్ బాటమ్’ సినిమా ఫస్ట్ ఆగస్ట్ 13 న రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు ఆ సినిమాని ప్రీ పోన్ చేసి జులై 27న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో షేర్ చేశారు అక్షయ్ కుమార్.

స్పై థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ రెట్రో కాన్సెప్ట్ మూవీలో ‘బెల్ బాటమ్’ స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. లాక్‌డౌన్ తర్వాత థియేటర్లు ఓపెన్ అయ్యాక రిలీజ్ అవుతున్న పెద్ద స్టార్ మూవీ ‘బెల్ బాటమ్’. అక్షయ్ కుమార్ ఏదైనా డేర్ స్టెప్ తీసుకుంటారు.. అది రీల్ లైఫ్ అయినా.. రియల్ లైఫ్ అయినా.. థియేటర్లకి ఆడియెన్స్‌ని రప్పించాలంటే పెద్ద సినిమా ఏదో ఒకటి రిలీజ్ అవ్వాలి. ఇప్పుడు అక్షయ్ ఆ రిస్క్ తీసుకుని అనుకున్న టైమ్ కంటే ముందే ఆడియెన్స్‌ని ఎంటర్‌టైన్ చెయ్యబోతున్నారు.