Ala Vaikunthapurramuloo : అలా.. రికార్డుల వేట కొనసాగుతోందిలా.. రెండు బిలియన్ల స్ట్రీమింగ్స్ సాధించిన ‘అల..వైకుంఠపురములో..’

‘అల..వైకుంఠపురములో..’ రికార్డులు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి.. గతేడాది సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా బన్నీ, త్రివిక్రమ్, తమన్ కెరీర్‌లో మెమరబుల్ మూవీగా మిగిలిపోయింది..

Ala Vaikunthapurramuloo : అలా.. రికార్డుల వేట కొనసాగుతోందిలా.. రెండు బిలియన్ల స్ట్రీమింగ్స్ సాధించిన ‘అల..వైకుంఠపురములో..’

Ala Vaikunthapurramuloo

Updated On : April 18, 2021 / 3:49 PM IST

Ala Vaikunthapurramuloo:‘అల..వైకుంఠపురములో..’ రికార్డులు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి.. గతేడాది సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా బన్నీ, త్రివిక్రమ్, తమన్ కెరీర్‌లో మెమరబుల్ మూవీగా మిగిలిపోయింది..

Ala Vaikunthapurramuloo
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, హాట్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో, ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, హారికా హాసిని రాధకృష్ణ (చినబాబు) కలిసి నిర్మించిన ‘అల..వైకుంఠపురములో..’ ఇప్పటికే సోషల్ మీడియాలో పలు రికార్డ్స్ క్రియేట్ చేసింది.

Ala Vaikunthapurramuloo
‘రాములో.. రాములా’, ‘బుట్ట బొమ్మా’, ‘సిత్తరాల సిరపడు’ పాటలు ఏ రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేశాయో చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఏకంగా 2 బిలియన్ల యూట్యూబ్ స్ట్రీమింగ్స్ సాధించిన ఫస్ట్ సౌత్ ఇండియన్ మూవీగా ‘అల..వైకుంఠపురములో..’ నెవర్ బిఫోర్ తరహా రికార్డ్ సెట్ చేసింది. ఈ సినిమా ఆల్బమ్ యూట్యూబ్‌లో రెండువందల కోట్ల స్ట్రీమింగ్స్ సాధించి రేర్ రికార్డ్ నమోదు చేసింది.

Ala Vaikunthapurramuloo