Allu Aravind : ఇండస్ట్రీని దయచేసి అర్థం చేసుకోండి – అల్లు అరవింద్

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అరవింద్ ఈ కామెంట్స్ చేశారు.

Allu Aravind : ఇండస్ట్రీని దయచేసి అర్థం చేసుకోండి – అల్లు అరవింద్

Allu Aravind

Allu Aravind :  తెలుగు సినిమా ఇండస్ట్రీలో థియేటర్లు, టికెట్ రేట్ల వివాదం ఇంకా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం… మెగా ఫ్యామిలీలోని కీలక సభ్యులకు మధ్య విన్నపాలు, వార్నింగులు కంటిన్యూ అవుతున్నాయి. మొన్న చిరంజీవి… నిన్న పవన్ కళ్యాణ్… ఇవాళ ఇదే లైన్ లో నిర్మాత అల్లు అరవింద్ కూడా చేరారు.

అక్కినేని అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అరవింద్ ఈ కామెంట్స్ చేశారు. హైదరాబాద్ సినీ మాక్స్ లో ఈ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా సినిమా టికెట్ల వివాదంపై స్పందిస్తూ… “ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి నా విజ్ఞప్తి. సినీ పరిశ్రమలో అనేక సమస్యలున్నాయి. వాటిని త్వరగా పరిష్కరించాలి. కరోనా నుంచి ప్రజలను ఎలా రక్షించారో సినీ పరిశ్రమను రక్షించాలి. రాజు తలుచుకుంటే వరాలకు కొదువుండదు. సినీ పరిశ్రమ సమస్యలను దయ చేసి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రిలీజ్ అయ్యే సినిమాలు మీ సర్కారు విధానాలపైనే ఆధార పడి వుంటాయి. తెలుగు సినీ పరిశ్రమ విజయవంతంగా కొనసాగేందుకు సహకరించాలి” అని అల్లు అరవింద్ జగన్ ను రిక్వెస్ట్ చేశారు.

ఓవైపు… అటు ఏపీ సర్కారు స్పీడు.. మరోవైపు.. ఇటు మెగా ఫ్యామిలీ దూకుడు.. మొత్తానికి మా ఎన్నికల కంటే ముందే మూవీ రాజకీయం తెలుగు రాష్ట్రాల్లో కాక రేపుతూ హాట్ టాప్ అవుతోంది.