Apple’s iPhone: ఆపిల్ మరో ముందడుగు.. ఐఫోన్‌లో 48MP కెమెరా!

కెమెరా విషయంలో మరో ముందడుగు వేస్తోంది ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీ సంస్థ ఆపిల్.

Apple’s iPhone: ఆపిల్ మరో ముందడుగు.. ఐఫోన్‌లో 48MP కెమెరా!

Iphone

Apple’s iPhone: కెమెరా విషయంలో మరో ముందడుగు వేస్తోంది ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీ సంస్థ ఆపిల్. ఐఫోన్‌ 13కి ఇప్పటికే మార్కెట్‌లో మంచి క్రేజ్ ఉండగా.. రాబోయే అప్‌డేట్ ఫోన్ ఆపిల్ 14కి సంబంధించి ఆసక్తికరమైన అప్‌డేట్ లీక్ అయ్యింది. ఆపిల్ ఐఫోన్ 14లో కెమెరా 48మెగా పిక్సెల్ ఉంటుందని వెల్లడించింది ఆపిల్ సంస్థ. అంతేకాదు.. 8K వీడియో రికార్డింగ్ కూడా ఇందులో రానున్నట్లు చెబుతున్నారు.

ఈ హై-రిజల్యూషన్ కెమెరా ఐఫోన్ 14 ప్రో మోడల్‌లో మాత్రమే ఉంటుంది అని నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం, 12MP కెమెరా Apple iPhoneలో అందుబాటులో ఉంది. అలాగే 4K వీడియో రికార్డింగ్‌కు మాత్రమే అవకాశం ఉంది. ఆపిల్ ఐఫోన్‌లో ఇప్పటివరకు అత్యుత్తమ ఫీచర్లు అందుబాటులో ఉన్నప్పటికీ ఒక్క కెమెరా విషయంలో మాత్రం ఎప్పుడూ నిరుత్సాహపరుస్తూనే ఉంది.

అయితే, 2022లో రానున్న ఫోన్‌ల మాత్రం ఈ నిరుత్సాహాన్ని కూడా తగ్గించేలా ప్లాన్ చేస్తుంది ఆపిల్ సంస్థ. ఐఫోన్ 14 విషయంలోనే కాదు.. ఐఫోన్ 15విషయంలోనూ ఓ ఆసక్తికర విషయం టెక్ సర్కిళ్లలో తెగ తిరుగుతోంది. ఐఫోన్ 15లో “పెరిస్కోప్ కెమెరా” అందుబాటులోకి రానుందని సమాచారం. ఈ కెమెరా అందుబాటులోకి వస్తే రియల్‌గా వాడే కెమెరా అవసరం కూడా లేనంత స్పష్టమైన ఫోటోలు వస్తాయి.

అయితే, ఇంత స్పష్టమైన ఫోటోలు తీసేందుకు ఫోన్ ఇంటర్నల్ మెమరీ ఎలా సపోర్ట్ చేస్తుందోననే అనుమానాలు కూడా టెక్ నిపుణుల్లో ఉన్నాయి. ఎందుకంటే, ఆపిల్ ఐఫోన్‌లో 12మెగా పిక్సెల్ కెమెరాతో ఫోటో తీస్తేనే ఎక్కువ స్టోరేజ్ అవసరం అవుతుంది. మరి 48 మెగా పిక్సెల్‌తో ఫోటోలు, వీడియోలు అంటే మామూలు విషయం కాదు. ఏది ఏమైనా ఐఫోన్ 14, ఐఫోన్ 15 ఫోన్లు కెమెరా స్పెసిఫికేష‌న్ల‌పై లీకులు మాత్రం ఉత్కంఠ రేపుతున్నాయి.